3 నెలలు పదవీకాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సీఎస్ విజయానంద్ పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది.ఈ నెలాఖరున ఆయన రిటైర్ కావాల్సి ఉంది. అయితే విజయానంద్ పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో విజయానంద్ పదవీకాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. …
Read More »empolyment
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టుల ధర్నా
జయశంకర్ భూపాలపల్లి,ఐఏషియ న్యూస్: జిల్లాలోని జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలను వెంటనే అప్పగించాలని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.చాలా కాలంగా జర్నలిస్టు సోదరులు వేచి చూస్తున్న ఈ సమస్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడాని తీవ్రంగా టిడిపి ఖండించింది. ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర నాయకులు,వరంగల్ పార్లమెంట్ కాంటెస్ట్ ఎంపీ అభ్యర్థి సాగర్, పెద్దపల్లి టిడిపి ఇంచార్జ్ అందే భాస్కరాచారి దీక్షా శిబిరాన్ని సందర్శించి జర్నలిస్టులకు మద్దతు …
Read More »జనవరిలో విశాఖలో “కాగ్నిజెంట్” కార్యకలాపాలు ప్రారంభం
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఏపీలో వాణిజ్య రాజధాని విశాఖలో తాజాగా నిర్వహించిన సీఐఐ పెట్టుబడుల సదస్సు సక్సెస్ అయింది. ఇందులో భారీ ఎత్తున పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. వీటిని గ్రౌండ్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ సహా పలు ఐటీ సంస్ధలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్దమవుతున్నాయి. ఇదే క్రమంలో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ 2026 జనవరిలోనే విశాఖలో క్యాంపస్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో క్యాంపస్ లు కలిగిన కాగ్నిజెంట్ సంస్ధ …
Read More »ఏపీలో త్వరలో లెక్చరర్ పోస్టుల భర్తీ: మంత్రి లోకేశ్
అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 4,300 అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తామని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.విద్యార్థి, యువజన సంఘాల నాయకులతో శనివారం జరిగిన భేటీలో ఆయన ఈ హామీ ఇచ్చారు.కాలేజీలు,వర్సిటీల్లో రాజకీయ ప్రసంగాలకు అనుమతించబోమని,విద్యాసంస్థల పనివేళలు పూర్తయిన తర్వాత రాజకీయేతర సమస్యలు చెప్పుకోవడానికి ప్రత్యేక వేదికపై అవకాశం కల్పిస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »హెచ్1-బీ వీసాలపై యూటర్న్.. ట్రంప్ వ్యాఖ్యలతో భారతీయ నిపుణులకు ఊరట
విదేశీ టెక్ నిపుణులను అమెరికాకు స్వాగతిస్తామన్న ట్రంప్ వాషింగ్టన్,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: వలసల విషయంలో తన కఠిన వైఖరికి భిన్నంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని టెక్నాలజీ పరిశ్రమల అభివృద్ధికి విదేశీ నిపుణుల అవసరం ఎంతోఉందని,అమెరికన్లకు శిక్షణ ఇచ్చేందుకు వేలాది మందిని ఆహ్వానిస్తానని ఆయన స్పష్టం చేశారు. చట్టబద్ధమైన వలసలను తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తానని తెలిపారు. వాషింగ్టన్‌లో జరిగిన యూఎస్-సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరంలో ట్రంప్ మాట్లాడుతూ.. “అరిజోనాలో బిలియన్ల డాలర్ల పెట్టుబడితో భారీ కంప్యూటర్ చిప్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి, …
Read More »టెక్స్ టైల్స్ లో రూ.4,380 కోట్ల పెట్టుబడులు
సీఎం చంద్రబాబు, మంత్రి సవిత సమక్షంలో ఒప్పందాలు కుదిరిన 7 ఎంవోయూలు 6,100 ఉద్యోగాల రాక విశాఖపట్నం, చిత్తూరు,గుంటూరు, శ్రీ సత్యసాయి, అనకాపల్లి పరిశ్రమల ఏర్పాటు రూ.4 వేల కోట్లతో ఫిన్లాండ్ కు చెందిన ఇన్ఫినిటెడ్ ఫైబర్ సంస్థ పెట్టుడులు పెట్టుబడులతో టెక్స్ టైల్స్ రంగానికి ఊతం : మంత్రి సవిత విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ లో టెక్స్ టైల్స్ రంగంలో రూ.4,380.38 కోట్ల మేర ఏడు ఎంవోయూలు జరిగాయి. ఈ ఒప్పందాలతో ప్రత్యక్షంగా 6,100 ఉద్యోగాలు …
Read More »ఏపీకి 13 లక్షల కోట్లు పెట్టుబడులు: సీఎం చంద్రబాబు ప్రకటన
ముగిసిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే విశాఖ వేదికగా 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు శనివారంతో దిగ్విజయంగా ముగిసింది. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామిక టౌన్‌షిప్‌గా ఉన్న శ్రీసిటీలో ఏర్పాటు చేసిన మరికొన్ని యూనిట్లను సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు.శ్రీసిటీలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన పలు కంపెనీలతో 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీటి ద్వారా దాదాపు 12,365 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ముఖ్యమంత్రి …
Read More »లక్ష మంది మహిళలను వ్యాపారవేత్తలుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో లక్ష మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.విశాఖ సీఐఐ సమ్మిట్ లో లింగ సమానత్వ స్పందన: సమగ్ర భవిష్యత్ ను నిర్మిస్తున్నాం అనే అంశంపై చర్చా గోష్టిలో మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి శనివారం సాయంత్రం పాల్గొని మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ర్ట్రాన్ని అభివృద్ధి …
Read More »ఏపీకి భారీగా పెట్టుబడులు: 3,49,476కోట్ల ఒప్పందాలు
4,15,890 నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు సత్ఫలితాలను ఇస్తోంది. విశాఖపట్నం వేదికగా భాగస్వామ్య సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. శుక్ర శనివారాలు రెండు రోజులపాటు ఈ సదస్సు జరగనున్నది. ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి పలు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే పలువురు వ్యాపారవేత్తలు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వారికి వివరిస్తూ పలు సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తొలిరోజైన శుక్రవారం …
Read More »భారత్ కు గేట్ వే లా మారనున్న ఆంధ్రప్రదేశ్
విశాఖ వేదికగా 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం 72 దేశాల నుంచి ప్రతినిధులు హాజరు విశాఖపట్నం ,ఐఏషియ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే విశాఖ వేదికగా 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. నగరంలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాగా ఈ సదస్సును భారతదేశ ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అలానే కేంద్రమంత్రులు …
Read More »
News Website (iasianews.net) I Asia News