అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 4,300 అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తామని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.విద్యార్థి, యువజన సంఘాల నాయకులతో శనివారం జరిగిన భేటీలో ఆయన ఈ హామీ ఇచ్చారు.కాలేజీలు,వర్సిటీల్లో రాజకీయ ప్రసంగాలకు అనుమతించబోమని,విద్యాసంస్థల పనివేళలు పూర్తయిన తర్వాత రాజకీయేతర సమస్యలు చెప్పుకోవడానికి ప్రత్యేక వేదికపై అవకాశం కల్పిస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News