లక్ష మంది మహిళలను వ్యాపారవేత్తలుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం

మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో లక్ష మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.విశాఖ సీఐఐ సమ్మిట్ లో లింగ సమానత్వ స్పందన: సమగ్ర భవిష్యత్ ను నిర్మిస్తున్నాం అనే అంశంపై చర్చా గోష్టిలో మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి శనివారం సాయంత్రం పాల్గొని మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ర్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. మహిళాభివృద్ధికి ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయంటే అందుకు ముఖ్యమంత్రి పై ఉన్న నమ్మకమేనన్నారు. ఆయన లీడర్ షిప్ లో పనిచేస్తున్నాం కాభట్టే మాకు ఎంతో గౌరవం ఉందన్నారు. లక్ష ఎకరాల్లో కాఫీ పంట పండిస్తున్నారని, కాఫీని ప్యాక్ చేయడం వల్ల మహిళలకు ఆదాయం వస్తుందని, అది మహిళలకు ముఖ్యమంత్రి అందిస్తున్న ఆదాయ మార్గమన్నారు.విశాఖకు గూగుల్ సంస్థ వస్తుందంటే పక్క రాష్ట్రాలు ఎంతో ఇబ్బంది పడ్డాయని అయినా ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్ లు ఎంతో పట్టుదలగా వ్యవహరించి రాష్ట్రానికి తీసుకొచ్చారన్నారు. మరిన్ని అంశాలపై మంత్రి ప్రసంగించారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పూర్తి చేసిన ఏపీ ప్రభుత్వం

ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ప్రాంగణంలో ఎంపికైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *