హాస్టళ్లకు కొత్త లుక్ రావాలి… హాస్టళ్ల నిర్మాణాలకు, మరమ్మతులకు నిధులిస్తాం యువత ఉపాధి కోసం జాబ్ మేళాలు నిర్వహించండి త్వరలో శాశ్వత కుల ధృవపత్రాలు విద్యారుణాలపై వడ్డీ భారం తగ్గించేలా త్వరలో కొత్త పథకం ప్రాంతాల మధ్య అభివృద్ధిలో పోటీ తొలిరోజు కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: సంక్షేమం అంటే పేదలకు చేసే దానం కాదు…వారి అభివృద్ధికి, సాధికారతకు మార్గం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్ధిక అసమానతలు తగ్గించేందుకు అన్ని మార్గాలను వినియోగించుకుందామని చెప్పారు. సోమవారం రాష్ట్ర …
Read More »Politics
ఏపీలో ఉచిత బస్ ప్రయాణానికి నెల రోజులు
3.17 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సులలో ప్రయాణం మహిళలకు 118 కోట్లు రూపాయల లబ్ధి ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. పంద్రాగస్టు సందర్భంగా ఆగస్ట్ 15వ తేదీ స్త్రీ శక్తి పథకాన్ని విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభించి నేటికి నెల …
Read More »మారిషస్ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్గులాంకు విమానాశ్రయంలో ఘన స్వాగతం
స్వాగతం పలికిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుపతి,ఐఏషియ న్యూస్: మారిషస్ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్గులాం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయంకు సోమవారం చేరుకున్నారు.తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు విచ్చేసిన మారిషస్ ప్రధాని.మారిషస్ ప్రధానికి ఘన స్వాగతం పలికిన మంత్రి ఆనం, పలువురు నేతలు, ఉన్నతాధికారులు.రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా బ్రహ్మశ్రీ ఆశ్రమమునకు చేరుకొని,అనంతరం తిరుమల చేరుకోనున్న మారిషస్ ప్రధాని.మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న ప్రధాని నవీన్ చంద్ర రామ్గులాం. Authored by: Vaddadi udayakumar
Read More »బీజేపీలో చేరిన ప్రముఖ న్యాయవాది మళ్ల తులసీరాం
పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పీవీఎన్ మాధవ్ విశాఖపట్నం,,ఐఏషియ న్యూస్: నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది మళ్ల తుల సీరాం శనివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఈ సందర్భంగా మళ్ల తులసీరామ్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ప్రధాని మోదీని ఆదర్శంగా తీసుకుని, బీజేపీ పథకాలు, పరిపాలన పట్ల ఆకర్షితుడైనయ్యానని ఈ సందర్భంగా మళ్ల తులసీరాం తెలియజేశారు. తులసీరాం 1999 నుంచి 2008 నుంచి ఎన్ఎస్ యూఐలో పని చేశారు. ఆ …
Read More »రైతులు ఆందోళన చెందవద్దు… రాష్ట్రంలో ఎరువులు సరిపడా నిల్వలు ఉన్నాయి..
అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం వారం రోజుల్లో మరింత యూరియా రాష్ట్రానికి చేరుకోనుందని వెల్లడించిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో ఎరువులు ఎటువంటి కొరత లేకుండా అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. విజయవాడలోని క్యాంప్ ఆఫీస్ లో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా, డీఎపి, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులు సహా అన్నిరకాల ఎరువులు సరిపడా నిల్వలుగా ఉన్నాయని తెలిపారు. జిల్లా వారీగా …
Read More »భారతదేశ 15వ ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అత్యంత వైభవంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాధాకృష్ణన్ చేత పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు హాజరయ్యారు.వీరితోపాటుమాజీ …
Read More »62 ఏళ్ల తర్వాత అదే నిజమైంది: ఉపరాష్ట్రపతి మాతృమూర్తి ఆనందం
చెన్నై,ఐఏషియ న్యూస్: ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికవడం పట్ల ఆయన మాతృమూర్తి జానకీ అమ్మాల్ హర్షం వ్యక్తం చేశారు. తనకు కొడుకు పుట్టినప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నారు.ఆయన లాగే నేను కూడా టీచర్ గా పనిచేశాను. ఆయన పేరునే నా కుమారుడికి పెట్టాను. ఏదో ఒక రోజు తను రాష్ట్రపతి అవ్వాలనే ఆ పేరు పెడుతున్నావా అని తన భర్త అడిగారు.62 ఏళ్ల తర్వాత అదే నిజమైంది. నాకు చాలా సంతోషంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. Authored by: Vaddadi udayakumar
Read More »ఏపీ ఆటో డ్రైవర్లకు శుభవార్త
దసరా నుంచి ఖాతాలో డిబిటి ద్వారా నేరుగా 15వేలు జమ ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వాహనమిత్ర అమలు పైన ప్రకటన చేసారు. దసరా నుంచి ఈ పథకం అమల్లో భాగంగా అర్హత ఉన్న ప్రతీ ఆటో డ్రైవరు ఖాతాలో రూ 15 వేలు జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే లబ్దిదారులు.. ఖర్చు.. నిధుల కేటాయింపు పైన కసరత్తు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2.90 లక్షల మంది ఆటో డ్రైవర్లకు పథకం అమలు కానుంది. ప్రభుత్వం నిర్దేశించిన …
Read More »నర్సీపట్నం అమ్మాయి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం గురువారం బదిలీ చేసిన 12 మంది జిల్లా కలెక్టర్ లలో కీర్తి చేకూరి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు.ఈమె అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం కోటవురట్ల తంగేడు గ్రామానికి చెందినవారు. నర్సీపట్నం ఆర్.సి.యం పాఠశాలలో విద్యనభ్యసించారు.బీటెక్ మెటలర్జీ ఐఐటి (మద్రాస్)లో చేశారు. మొదట ఐఆర్ఎస్ అధికారిగా కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అయినప్పటికీ ఐఏఎస్ చేయాలన్న పట్టుదలతో రెండుసార్లు తక్కువ ర్యాంకు వచ్చినప్పటికీ మూడోసారి పరీక్షలు రాసి ఆల్ ఇండియా 14వర్యాంక్ సాధించారు.కాకినాడ జాయింట్ కలెక్టర్, …
Read More »ఉపరాష్ట్రపతి భారత ప్రభుత్వంలో రెండవ అత్యున్నత స్థానం
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్:ఉప రాష్ట్రపతి భారత ప్రభుత్వంలో రెండో అత్యున్నత స్థానం. భారత రాజ్యాంగంలోని 63వ అధికరణంలో ఉపరాష్ట్రపతి పదవి గురించిన ప్రస్తావన ఉంది. ఈ పదవికి సంబంధించి భారత్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోని మరే పెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోను లేని అంశం ఇది. పెద్ద ప్రజాస్వామ్యాలలో, అమెరికాలో మాత్రమే ఈ పదవి ఉంది.అయితే భారత్, అమెరికాలలో ప్రజాస్వామ్య విధానాలు వేరు (భారత్‌లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం,అమెరికాలో అధ్యక్ష ప్రజాస్వామ్య పద్ధతి ఉన్నాయి) అందుచేత ఉప రాష్ట్రపతి విధులకు,అమెరికా ఉపాధ్యక్షుడి విధులకు చాలా తేడా ఉంది.ఉపరాష్ట్రపతి …
Read More »