తిరుపతి,ఐఏషియ న్యూస్:: తిరుపతి నగరంలో చైన్స్ స్నాచర్స్ హల్చల్ చేశారు.ఐదుగురు మహిళ మెడలో గొలుసులు తెంచుకొని పారిపోయారు.శనివారం 3 నుంచి 5 గంటల మధ్య చేతివాటం ప్రదర్శించిన చైన్ స్నాచార్లు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు చోట్ల, ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరోచోట చోరీ జరిగిన వైనం. ఈస్ట్ పోలీస్ స్టేషన్లోనే పోస్టల్ కాలనీలో ఓ మహిళ మెడలో చైన్ తెంపుకెళ్ళిన ఘటన జరిగింది.అలిపిరి పోలీస్ స్టేషన్ లోని ఉపాధ్యాయనగర్, గొల్లవానిగుంట, రాయల్ ఓక్ షో రూమ్ సందులో, గంగారాం ఫంక్షన్ హాల్ ఎదురుగానున్న సందులో వరుస చోరీలు చేసిన చైన్ స్నాచర్లు.ఓ ప్రక్కన పోలీసులు బంగారం రేటు పెరిగిందని జాగ్రత్తలు చెబుతున్నా రోడ్డుపై నిర్లక్ష్యంగావెళ్తున్న మహిళలలోని గొలుసులు అపహరణ గురయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Authored by: Vaddadi udayakumar