సమాచార శాఖ కమిషనర్ చావలి సునీల్ దాతృత్వం
మంగళగిరి,ఐఏషియ న్యూస్: ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా, సహాయం చేసే గుణం ఉండటమే అన్నింటికీ మించిన ఆస్తి అన్న చందాన సమాచార శాఖ కమిషనర్ చావలి సునీల్ దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. సమాచార శాఖ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి చనిపోగా, సదరు ఉద్యోగి కుటుంబ దిన స్థితిని గమనించిన సమాచార కమిషనర్ స్పందించి, తన నెల వారి జీతం నుంచి రూ. లక్ష ఆర్థిక సహాయంగా అందజేశారు. వివరాల్లోకి వెళితే.అంబేద్కర్ కోనసీమ జిల్లా, పుల్టేటికూరు గ్రామానికి చెందిన బీరా రాముడు, సత్యవతి దంపతుల ఏకైక కుమారుడు బి.ధనరాజ్. మంగళగిరి మండలం చినకాకాని పరిధి జాతీయ రహదారి వెంబడి గల కార్యాలయంలో సబార్డినేట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. దురదృష్టవశాత్తు 20 నవంబర్ 2024 న గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు.ఇతనికి 11 మే 2024 న శృతితో వివాహం జరిగింది. ధనరాజ్ అకాల మరణ సమాయానికి అతని భార్య నాలుగు నెలల గర్భవతిగా ఉంది.అయితే ధనరాజ్ మరణించిన నాటి నుంచి వారి కుటుంబం ఆర్థికంగా వెనుకబడింది. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ చావలి సునీల్ దృష్టికి రావడంతో ఆయన ఛాంబర్ కు గురువారం ధనరాజ్ కుటుంబ సభ్యులను పిలిపించారు. మీడియా సమక్షంలో ధనరాజ్ కుటుంబానికి లక్ష రూపాయల నగదును సాయం అందజేశారు. భవిష్యత్తులో ఆ కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కమీషనర్ చావలి సునీల్ హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో తనవద్ద పనిచేసే డ్రైవర్ మృతి చెందగా, కొద్ది నెలల క్రితం ఆ డ్రైవర్ కుటుంబానికి చావలి సునీల్ రూ.4 లక్షలు సేకరించి ఆ నగదును బాధితుని కుటుంబ సభ్యులకు అందజేశారు. అదే తరహాలో ప్రస్తుతం మరో ఉద్యోగి కుటుంబానికి సాయం అందించి ఆదుకొని అండగా నిలిచారు.
Authored by: Vaddadi udayakumar