విశాఖపట్నం,ఐఏషియ న్యూస్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం గురువారం బదిలీ చేసిన 12 మంది జిల్లా కలెక్టర్ లలో కీర్తి చేకూరి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు.ఈమె అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం కోటవురట్ల తంగేడు గ్రామానికి చెందినవారు. నర్సీపట్నం ఆర్.సి.యం పాఠశాలలో విద్యనభ్యసించారు.బీటెక్ మెటలర్జీ ఐఐటి (మద్రాస్)లో చేశారు. మొదట ఐఆర్ఎస్ అధికారిగా కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అయినప్పటికీ ఐఏఎస్ చేయాలన్న పట్టుదలతో రెండుసార్లు తక్కువ ర్యాంకు వచ్చినప్పటికీ మూడోసారి పరీక్షలు రాసి ఆల్ ఇండియా 14వర్యాంక్ సాధించారు.కాకినాడ జాయింట్ కలెక్టర్, గుంటూరు మున్సిపల్ కమిషనర్ కూడా ఈమె పని చేశారు.ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Authored by: Vaddadi udayakumar