రాయపూర్,ఐఏషియ న్యూస్: ఛత్తీస్‌గఢ్‌లోని రాయపుర్‌లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది.ఓ ప్రైవేట్ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదవశాత్తు ఓ నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా తెలిసింది.గోదావరి ఇస్పాట్ లిమిటెడ్‌కి చెందిన ప్లాంట్‌లో నిర్మాణ భాగం కూలిపోవడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సిల్తారా ప్రాంతంలో ఉన్నఈ ప్లాంట్‌లో ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికిచేరుకునిసహాయకచర్యలుచేపట్టారు.శిథిలాల కింద చిక్కుకున్న ఆరుగురి మృతదేహాలను రెస్యూటీం సహాయంతో బయటకు తీశారు.గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్టుగా రాయ్‌పూర్ ఎస్పీ లాల్ ఉమేద్ సింగ్ తెలిపారు. అయితే,కూలిన శిథిలాల కింద మరికొందరు కార్మికులు చిక్కుకుని ఉండే అవకాశముందని అధికారులు అనుమానిస్తున్నారు.
Authored by: Vaddadi udayakumar