పులివెందులలో 22 నుంచి 28 వరకు మెగా ఉచిత క్యాటరాక్ట్ సర్జరీ క్యాంప్

పులివెందుల,ఐఏషియ న్యూస్:  వైయస్సార్ కడప జిల్లా పులివెందులలో వైఎస్ఆర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈనెల 22 నుంచి 28 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శంకర నేత్రాలయ మేసు పుట్టపర్తి మరియు కుంబు తిరుమల రెడ్డి (యూఎస్ఏ) సంయుక్త నిర్వహణలో మెగా ఉచిత క్యాటరాక్ట్ సర్జరీ క్యాంప్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
పులివెందులలో శస్త్రచికిత్సలు,కంటిశుక్లం స్క్రీనింగ్ 7 రోజుల పాటు జరుగుతుంది.ఈ ఉచిత వైద్య శిబిరంలో కంటి రోగులను పరీక్షించి కంటి శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి మొబైల్ ఐ సర్జరీ బస్సులో ఈనెల 26 నుంచి 30 వరకు ఉచిత కంటిశుక్లం శస్త్రచికిత్స నిర్వహిస్తారు.మా ప్రపంచ ప్రఖ్యాత మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (ఎం ఈ ఎస్ యు)లో ప్రభుత్వ ఆమోదంతో శస్త్రచికిత్సలు పూర్తిగా ఉచితంగా నిర్వహించబడతాయి.శస్త్రచికిత్స చేయించుకునే వారికి ఉచిత ఐ ఓ ఎల్ ప్రక్రియతో పాటు ఉచిత నల్ల కళ్లజోడు,మందులు అందజేస్తారు.ఇతర వ్యాధులకు మందులు తీసుకుంటున్న రోగులు శస్త్రచికిత్స కోసం వచ్చినప్పుడు వారి మందులను తమతో తీసుకురావాలని నిర్వాహకులు కోరారు. మా అంబులేటరీ సర్వీస్ ద్వారా రోగులు శస్త్రచికిత్స తర్వాత 2 గంటల్లోపు ఇంటికి తిరిగి వెళ్ళిపోవచ్చు. శస్త్రచికిత్స నో-సూచర్ (మైక్రోస్కోపిక్ స్మాల్ ఇన్సిషన్) టెక్నిక్ ఉపయోగించి నిర్వహించబడుతుంది.
ఈ శిబిరాన్ని శంకర నేత్రాలయ,దివంగత కుంభం తిరుమల రెడ్డి దివంగత శ్రీమతి రామలక్ష్మమ్మ జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.శిబిరానికి వచ్చేవారు ఆధార్ కార్డును తప్పకుండా తీసుకురావాలని కోరారు.పూర్తి వివరాలకు 8247705346, 8247637864, 9441131083 ఈ ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

పులివెందులలో ప్రారంభమైన మెగా ఉచిత క్యాటరాక్ట్ సర్జరీ క్యాంప్

పులివెందుల,ఐఏషియ న్యూస్: వైయస్సార్ కడప జిల్లా పులివెందులలో వైఎస్ఆర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *