పెదబయలు,ఐఏషియ న్యూస్:: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు మారుమూల గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక గిరిజనుల కష్టాలు వర్ణానతీతం.పెదబయలు మండలంలోని జామిగుడ పంచాయతీ పరిధి తారాబుకి చెందిన కుమడ.శ్రీదేవికి శనివారం గుండె నొప్పి వచ్చింది.గ్రామానికి రహదారి సౌకర్యం లేక అంబులెన్స్ రాక కుటుంబీకులు డోలికట్టి శ్రీదేవికి తారాబు జలపాతం వరకు మోసుకొచ్చి ఎత్తుకొని ప్రాణం అరచేతిలో పెట్టుకొని ఉదృతంగా ప్రవహిస్తున్న వాగును దాటించారు.అక్కడ నుంచి జీపులో ముంచంగిపుట్టు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారు మాట్లాడుతూ..ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అధికారులు స్పందించి తారాబు గ్రామానికి రహదారితోపాటు వంతెన నిర్మించి తమ యొక్క రవాణా కష్టాలు తీర్చాలని వారు వేడుకుంటున్నారు.
Authored by: Vaddadi udayakumar