భారతీయ ప్రయాణికులకు అర్జెంటీనా ప్రభుత్వం శుభవార్త

బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: భారతీయ ప్రయాణికులకు అర్జెంటీనా ప్రభుత్వం అద్భుతమైన శుభవార్తను అందించింది. ఇకపై యూఎస్ వీసా (బి 1/బి2 కేటగిరీ) ఉన్న భారతీయ పౌరులు అర్జెంటీనాకు వెళ్లడానికి ప్రత్యేకంగా వీసా తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఈ కొత్త నిబంధన వల్ల లక్షలాది మంది భారతీయ ప్రయాణికులకు ప్రయాణం మరింత సులభతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నిర్ణయం భారతదేశం, అర్జెంటీనా మధ్య పర్యాటకం, వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.అర్జెంటీనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

జపాన్‌ తదుపరి ప్రధానిగా సనై తకైచి.. తొలిసారి మహిళకు అవకాశం

స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్:  పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో జపాన్‌ ప్రధానిగా ఉన్న షిగెరు ఇషిబా ఇటీవల తన పదవికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *