గుడివాడ,ఐఏషియ న్యూస్: విజయనగరం జిల్లాకి చెందిన బంకురు శ్రీహరి గత 5ఏళ్ళుగా కృష్ణా జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్ లో పని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో పట్టుదలతో చదువుకుని ఒక వైపు విధులు నిర్వహిస్తూ మరొక వైపు డీఎస్సీ కోసం కస్టపడి చదివి వచ్చిన ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఎస్ జి టి పోస్ట్ కు అర్హత సాధించటం జరిగింది. దీనిపై పలువురు ఉన్నతాధికారులు ప్రశంసించారు..మరియు గుడివాడ తాలూకా ఎస్ఐ నంబూరి చంటి బాబు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసి ఉపాధ్యాయ వృత్తిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని మరింత ఉన్నత స్థాయికి వెళ్లేలా కృషి చేయాలని అభినందించి మంగళవారం పోలీస్ శాఖ నుండి రిలీవ్ చేయటం జరిగింది.
Authored by: Vaddadi udayakumar