విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ అపాలని 365వ రోజు హాస్పటల్ వద్ద మానవహారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిఐటియు గౌరవ అధ్యక్షులు పద్మనాభ రాజు మాట్లాడుతూ మన పోరాటం వలన గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ను కాపాడుకుంటాం. టెండర్ కి ఎవరి రాలేదు, హాస్పిటల్ అభివృద్ధి కోసం చైర్మన్ కమిటీ వేయడం జరిగింది. పోర్ట్ దగ్గర ఉన్న సోంత నిధులతో అభివృద్ధి చేయాలిహాస్పిటల్ ప్రైవేటీకరణ పై 365 రోజులుగా మాట్లాడుతున్న కార్మికులకు అభినందనలు.హాస్పిటల్ ప్రైవేటీకరణ అనైతికమని, హాస్పిటల్ అభివృద్ధి కార్మికుల కృషితోనే సాధ్యమైందని, సుమారు 40 వేల మంది కార్మికుల ఆరోగ్యానికి సంబంధించిన సేవలను ప్రైవేట్ వారికి అప్పగించడం అనర్హమని తెలిపారు. విశాఖ పోర్టు విశాఖ అభివృద్ధికి కీలకమని, ప్రతీ ఏటా మున్సిపాలిటీకి సగటున 65 కోట్ల రూపాయలు పన్నులు కడుతున్న పోర్టును ప్రైవేట్ వారికి ఇచ్చి ధారాదత్వం చేయడం అభివృద్ధికి అడ్డుగా నిలుస్తుందన్నారు. పోర్టు యాజమాన్యం వద్ద రిజర్వ్ ఫండ్లు, వేల ఎకరాల భూమి ఉన్నప్పటికీ, ప్రైవేటీకరణపై తీసుకున్న నిర్ణయం అన్యాయమని, ఈ విధానాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కే సత్యనారాయణ, జె సత్యనారాయణ , గణేషు శంకర్రావు నర్సింగరావు త్రినాథ్ రావు ఈశ్వరరావు రాఘవులు పెద్ద సంఖ్యలో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar