- నేడు, రేపు దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ కార్యక్రమం
- సబ్ రిజిస్ట్రార్ కు లేఖ అందజేసిన దస్తావేజులేఖరులు
సబ్బవరం,ఐఏషియ న్యూస్: శ్రీదుర్గమాంబ దస్తావేజులేఖర్ల సంక్షేమ సంఘం సమావేశం గురువారం అనకాపల్లి జిల్లా సబ్బవరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్బవరం దస్తావేజు లేఖర్ల తరపు నుండి ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం ప్రకారం సంఘం గౌరవ అధ్యక్షులుగా బిక్కవల్లి రామ్మూర్తి (రాంబాబు),అధ్యక్షులుగా వల్లభ జోస్యల సీతారామమూర్తి,ఉపాధ్యక్షులుగా జూరెడ్డి శ్రీరామమూర్తి,ప్రధాన కార్యదర్శిగా శేఖర మంత్రి శ్రీనివాసరావు పట్నాయక్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా, దంతులూరి సురేష్ వర్మ,జాయింట్ సెక్రెటరీగా నరవ రామచంద్ర రావు,కోశాధికారిగా గొప్ప శేఖర్,లీగల్ అడ్వైజర్ గా బి సత్యనారాయణ(రమేష్), ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి పలువురు అభినందనలు తెలియజేశారు.అనంతరం సబ్బవరం సబ్ రిజిస్ట్రార్ కు నూతన కార్యవర్గం వివరాలు తెలియజేస్తూ, దస్తావేజు లేఖరులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 19 నుంచి 20 వరకు రెండు రోజులు పాటు పెన్ డౌన్ చేస్తున్నట్లు తెలియజేసిన లేఖను అందజేశారు.
Authored by: Vaddadi udayakumar