తెలంగాణలో కొలువుల జాతక ప్రారంభం
హైదరాబాద్,,ఐఏషియ న్యూస్: తెలంగాణలో కొలువుల జాతర ప్రారంభం కానుంది. ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి ఇప్పటి కే నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వెలువడిన నోటిఫికేషన్ల నియామక ప్రక్రియ దాదాపు పూర్తి అయింది. గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాలు వెలువడంతో మిగతా విభాగాలపై రాష్ట్రప్రభుత్వం దృష్టిసారించింది. ప్రభుత్వం 60,000 పైగా నియామకాలు పూర్తిచేసింది. ప్రభుత్వం ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగాలను గుర్తించగా 20,000 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. దీంతో ఇక నోటిఫికేషన్లు వరుసగా విడుదల చేసేందుకు కసరత్తు కొనసాగుతోంది.తెలంగాణ ప్రభుత్వం పలు శాఖల్లో ఖాళీల భర్తీకి నిర్ణయించింది. ఉద్యోగ ప్రకటనలకు కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తికావడం, పెండింగ్ నియామకాలన్నీ ముగియడంతో సంబంధిత విభాగాలు వర్గీకరణ రోస్టర్ ప్రకారం ఉద్యోగ ఖాళీలు గుర్తిస్తున్నాయి. టీజీపీఎస్సీగురుకుల, పోలీస్ నియామక బోర్డులు కొత్త ఉద్యోగాల భర్తీకి వీలుగా సంబంధిత విభాగాల నుంచి ప్రతిపాదనలు తీసుకునేందుకు అవసరమైన పరిపాలన ప్రక్రియను ప్రారంభించాయి. ఉద్యోగ క్యాలెండర్‌నురూపొందించి, ఆ మేరకు నోటిఫికేషన్ల కోసం అవసరమైన ఆర్థికశాఖ అనుమతులు పొందేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల గుర్తింపు, ఉద్యోగుల సర్దుబాటు, ఇప్పటికే ఆర్థికశాఖ అనుమతి పొందిన పోస్టులపై ప్రభుత్వం నియమించిన కమిటీ పరిశీలిస్తోంది.
Authored by: Vaddadi udayakumar