సమయస్పూర్తితో తల్లికి పునర్జన్మను ఇచ్చిన బాలుడు

భీమవరం,ఐఏషియ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం జొన్నలగరువు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న దీక్షిత్ అనే బాలుడు స్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ ఉన్న క్రమంలో తన తల్లి ఇంకా రావడం లేదని ఇంటికి వెళ్లి చూడగా కరెంట్ షాక్‌తో కొట్టుమిట్టాడుతున్న తల్లిని చూసి కంగుతిన్న దీక్షిత్ భయపడి కేకలు వేసి అందరిని పిలిచే సమయంలేదని గ్రహించి,సమయస్పూర్తితో కరెంట్ షాక్‌కు కారణమైన మోటార్ స్విచ్ ఆపేసి,తన తల్లికి తగిలి ఉన్న వైర్‌ను తొలగించి ప్రాణాలు కాపాడిన దీక్షిత్.అనంతరం తల్లిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి, ఆమెతో కలిసి పేరెంట్స్ మీటింగ్‌కు హాజరైన దీక్షిత్.దీక్షిత్ సమయస్పూర్తితోనే తన తల్లి బ్రతికిందని స్థానికులు దీక్షిత్ ను ప్రశంసించారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *