వాషింగ్టన్ డిసి,ఐఏషియ న్యూస్: కొత్త హెచ్1బీ వీసా దరఖాస్తులకు మాత్రమే వార్షిక రుసుము ఉంటుందన్న శ్వేత సౌధం ప్రకటించింది.కొత్త హెచ్1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్లు రుసుము ఉంటుందని వెల్లడించారు.ఇప్పటికే వీసా ఉన్నవారు లక్ష డాలర్ల రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.కొత్త వీసాదారులకే రుసుము ఉంటుందని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలినా లివిట్ వెల్లడించారు.ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లకు, పునరుద్దరణలకు కొత్త రుసుము వర్తించదని పేర్కొన్నారు.విదేశాల్లో ఉన్న హెచ్1బీ వీసాదారులు వెంటనే అమెరికాకు రావాల్సిన అవసరం లేదన్నారు.హెచ్1బీ వీసాల్లో దాదాపు 72 శాతం భారతీయులు ఉన్నట్లు తెలిపిన శ్వేతసౌధం.ట్రంప్ ప్రభుత్వం నిన్న అనూహ్యంగా తీసుకున్న నిర్ణయంతో వీసాదారుల్లో ఆందోళన చెందుతున్నారు.
Authored by: Vaddadi udayakumar