బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: టీవీఎస్ మోటార్ కంపెనీ పోర్టుఫోలియోలో అత్యంత ప్రజాదరణ పొందిన “అపాచీ మోటార్‌సైకిల్” మార్కెట్లోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బెంగళూరులో మంగళవారం కంపెనీ డైరెక్టర్, సీఈఓ కేఎన్ రాధాకృష్ణన్ మార్కెట్లోకి లిమిటెడ్ ఎడిషన్ అపాచీ ఆర్‌టీఆర్ శ్రేణి మోటార్ సైకిళ్లను విడుదల చేశారు. 2005లో అపాచీ మార్కెట్లోకి విడుదల చేసినప్పటి నుంచి వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని రాధాకృష్ణన్ తెలిపారు. దాదాపు 80కి పైగా దేశాల్లో 65 లక్షల మంది వినియోగదారులకు అపాచీ అత్యంత నమ్మకమైన బ్రాండ్‌గా ఉందన్నారు. అపాచీ 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160, 180, 200, ఆర్‌టీఆర్ 310, ఆర్‌ఆర్ 310 లిమిటెడ్ ఎడిషన్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు.అలాగే సరికొత్త ఆర్‌టీఆర్ 160 4వీ, ఆర్‌టీఆర్ 200 4వీ వేరియంట్స్‌ను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు.టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ లిమిటెడ్ ఎడిషన్స్ ధరలు రూ.1,37,990 నుంచి రూ.3,37,000 మధ్యన ఉండగా ఆర్‌టీఆర్ 4వీ వేరియంట్స్ ధరలు రూ.1,28,490 నుంచి రూ.1,59,990 మధ్యన ఉన్నాయి.
Authored by: Vaddadi udayakumar