ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో నగర వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన దృష్ట్యా, నగర ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు భద్రతా చర్యలలో భాగంగా సోమవారం రాత్రి నగర వ్యాప్తంగా అన్ని ప్రధాన కేంద్రాలు, రద్దీ ప్రాంతాలలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు.నగరంలోని అన్ని బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో భద్రతను పటిష్టం చేశారు. మెటల్ డిటెక్టర్లు, బాంబు/డాగ్ స్క్వాడ్ బృందాల సహాయంతో ప్రయాణికుల లగేజీతో పాటు అనుమానాస్పద వస్తువులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.నగర సరిహద్దులు, ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు (వెహికల్ చెకింగ్) ముమ్మరం చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను ఆపి, అందులోని వ్యక్తుల వివరాలను పరిశీలించారు. అలాగే పలు లాడ్జిలు, పార్సిల్ కార్యాలయాలు కూడా పోలీసులు తనిఖీ చేశారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

హైదరాబాద్ లో డ్రగ్స్ పెడ్లింగ్ ముఠా అరెస్ట్

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ లో మాదకద్రవ్యాల వ్యాపారం మరోసారి కలకలం రేపింది. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ , చిక్కడపల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *