రెండు గంటల సమయంలోనే తప్పిపోయిన కొడుకుని తల్లి చెంతకు చేర్చిన వన్ టౌన్ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: తప్పిపోయిన బిడ్డ ఆచూకీ రెండు గంటల్లో కనుగొన్న వన్ టౌన్ పోలీసులు. ఈ సంఘటన నగరంలోని పూర్ణ మార్కెట్ కొత్త రోడ్డు ప్రాంతంలో జరిగింది. గురువారం 3 సంవత్సరాల వయసు గల రుత్విక్ రాజును వెంట తీసుకొని కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు.
ఇంతలో కొంత సమయం అయిన తర్వాత ఆ బాలుడు తమ వెంట కనిపించకపోవడంతో రుత్విక్ తప్పి పోయాడని గ్రహించిన కుటుంబ సభ్యులు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ. జీడి బాబుకు ఈ విషయం తెలుసుకొని వెంటనే హుటా హుటీన అన్ని ప్రాంతాలకు సమాచారం అందించారు. దీంతో రెండుగంటల సమయంలో తప్పిపోయిన బాలుడును తల్లి చెంతకు చేర్చారు. కుమారుడు దొరకడంతో ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. తమ కుమారుడిని తమకు అప్పగించిన వన్ టౌన్ సిఐ.జీడి బాబుకు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు  తెలియజేశారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

తిరుపతిలో చైన్స్ స్నాచర్స్ హల్చల్

తిరుపతి,ఐఏషియ న్యూస్:: తిరుపతి నగరంలో చైన్స్ స్నాచర్స్ హల్చల్ చేశారు.ఐదుగురు మహిళ మెడలో గొలుసులు తెంచుకొని పారిపోయారు.శనివారం 3 నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *