ఒకే వేదికపై “ఐదుతరాల” కుటుంబ సభ్యులు

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి “మేమిద్దరం మాకు ఇద్దరు” అనే ఆలోచనలు రావడంతో ఎవరికి వారే కుటుంబాలు ఏర్పరచుకుని నివసించే సమాజం నేడు ఎక్కడ చూసినా కనిపిస్తుంది.కనీసం వృద్ధ తల్లిదండ్రులు కూడా తమ వద్ద ఉంచుకునే ఆలోచన నేటి యువతలో కొరబడిందని బహిరంగంగానే పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 200 మంది ఒకేసారి ఒక వేదికపై కలుసుకొని ఆనందానుభూతి పొందిన సందర్భమిది. ఈ అరుదైన ఘట్టం తెలంగాణ రాష్ట్ర పరిధిలో పెద్దపల్లి జిల్లా మంథనిలో నెలకొంది. ఈ ప్రాంతానికి చెందిన కొంతం కిష్టయ్య, అమ్మాయి దంపతుల వారసులంతా గురువారం హైదరాబాద్ కొండాపూర్లోని నివాసంలో కలుసుకున్నారు.80 ఏళ్ల వృద్ధులు మొదలుకొని ఆరు నెలల శిశువుల వరకు “అయిదుతరాల”కు చెందిన కుటుంబ సభ్యులు ఒకే దగ్గర చేరి సందడి చేశారు.సామాన్య నేపథ్యం నుంచి మొదలైన ఓ కుటుంబం, అయిదు తరాల సంబరాన్ని జరుపుకోవడం అందరికీ సంతోషాన్ని కలుగజేసింది. ఒకేసారి ఇంతమంది కలవడం అపురూప సన్నివేశంగా పలువురు వ్యాఖ్యానించారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

హాస్టళ్లలో విద్యార్థులకు ఏం జరిగినా అధికారులను సస్పెండ్ చేస్తాం: సీఎం చంద్రబాబు

అమరావతి,చాన్విక జ్యోతిన్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సూపర్ సిక్స్,ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి క్యాలెండర్ రూపొందించాలని ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *