మైనారిటీ యువతకు ఖతార్ లో ఉద్యోగ అవకాశాలు

  • 13న విజయవాడలో ఎంపిక ఇంటర్యూలు
  • నిరుద్యోగ మైనారిటీ యువత సద్వినియోగం చేసుకోవాలి
  • రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి

అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలోని నిరుద్యోగ మైనారిటీ యువతకు ఖతార్ దేశంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను కూటమి ప్రభుత్వం కల్పించడంలో భాగంగా ప్రత్యేకంగా ఎంపిక ఇంటర్యూ లను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గురువారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.ఏపీ ప్రభుత్వం, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (ఓఎంసిఏపీ)ద్వారా ఖతార్ దేశంలోని దోహా ప్రాంతంలో హోమ్ కేర్ నర్స్ (రిజిస్టర్డ్ నర్స్) ఉద్యోగాల కొరకు అర్హులైన అభ్యర్డుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగిందన్నారు.అర్హులైన మైనారిటీ వర్గాల యువతీ యువకులు ఈ క్రింద తెలపబడిన రిజిస్ట్రేషన్ లింక్ (https://naipunyam.ap.gov.in) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
హోమ్ కేర్ నర్స్ ఉద్యోగానికి దరఖాస్తు చేసే యువతీ యువకుల వయస్సు 21 నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. బి.ఎస్సీ లేదా జి.ఎన్.యమ్ నర్సింగ్ విద్యార్హత ఉండి,అనుభవం కూడా ఉండాలన్నారు.ఎంపికైన వారికి నెలకు జీతము సుమారు రూ.1.20 లక్షలను ఆదాయపు పన్నును మినహాయించి పొందవచ్చునని,ఉచిత వసతి,రవాణా సదుపాయం కల్పించబడుతుందని తెలిపారు. ఆన్ లైన్ ద్వారా నమోదును ఈనెల 12వ తేదీ లోపు చేసుకోవాలన్నారు. నమోదు చేసుకున్న వారికి ఇంటర్వూలను 13 వ తేదీ నిర్వహించడం జరుగుతుందని,రిజిష్ట్రేషన్ చేసుకోలేకపోయినవారు అదే రోజు ఉదయo 10గంటలకు ఓ ఎం సి ఏ పి కార్యాలయం, గవర్నమెంట్ ఐ.టి.ఐ. కాంపస్, రమేష్ ఆసుపత్రి రోడ్డు, విజయవాడ -520008 నందు జరిగే ఇంటర్యుకు నేరుగా హాజరు కావచ్చునని మంత్రి ఫరూక్ తెలిపారు.కూటమి ప్రభుత్వం నేతృత్వంలో మైనారిటీ వర్గాల అభివృద్దికి అందించబడుతున్న ఈ అవకాశాన్ని బి.ఎస్సీ/నర్సింగ్ అర్హత కలిగిన మైనారిటీ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని మంత్రి సూచించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు కోసం 9988853335, 8712655686, 8790118349, 8790117279,ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించడం ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.
Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

5 లక్షల మందికి ఉద్యోగాలు: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి

శ్రీకాకుళం,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరుదైన వరాలు అందుతున్నాయి. కేంద్ర మంత్రిగా ఏపీ నుండి రామ్మోహన్ నాయుడు ఉండడంతో ఆయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *