సీనియర్ జర్నలిస్ట్ వడ్డాది ఉదయకుమార్ కు విశ్వజనని “ఉత్తమ జర్నలిస్ట్” అవార్డు

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: సీనియర్ జర్నలిస్ట్,చాన్విక జ్యోతి తెలుగు దినపత్రిక ప్రధాన సంపాదకులు వడ్డాది ఉదయకుమార్ (విశాఖపట్నం) కు పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన విశ్వజనని ఫౌండేషన్ సంస్థ “విశ్వజనని ఉత్తమ జర్నలిస్టు” అవార్డును ప్రకటించింది.ఈ మేరకు ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బొగ్గారపు బ్రహ్మానందం ఉదయకుమార్ కు సమాచారం అందజేశారు.విశ్వజనని ఫౌండేషన్ 2025 సంవత్సరానికి గాను వివిధ రంగాల్లో వారికి ప్రతిభా పురస్కారాలను ప్రకటించింది. ఈ ప్రతిభాపురస్కారాల్లో భాగంగా పాత్రికేయ రంగంలో 35 సంవత్సరాలుగా విశేష కృషి చేస్తున్న విశాఖకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ వడ్డాది ఉదయకుమార్ కు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు లభించింది.ఈ అవార్డును నవంబర్ నెల ఒకటో తేదీన హైదరాబాద్ నాంపల్లిలో గల పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వేదికగా పలువురు ప్రముఖుల చేతుల మీదుగా ఉదయకుమార్ కు అందజేయనున్నారు.ఉదయకుమార్ కు ఈ అవార్డు రావడం పట్ల పలువురు జర్నలిస్టులు, మిత్రులు, శ్రేయోభిలాషులు,అభినందనలు తెలియజేశారు. తనకు ఉత్తమ జర్నలిస్టు అవార్డు రావడం పట్ల ఉదయకుమార్ ఆనందం వ్యక్తం చేశారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

ఇండిగో సంక్షోభం.. దిల్లీలో రూ.1,000 కోట్లు నష్టం

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఇండిగో సంక్షోభంతో దిల్లీలో వ్యాపార,పర్యాటక, పారిశ్రామిక రంగాలకు రూ.1,000 కోట్లు నష్టం వాటిల్లిందని ది ఛాంబర్‌ ఆఫ్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *