అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలోని అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా 1,750 రెట్రోఫిట్ త్రీ వీలర్ మోటారు సైకిళ్లను అందజేస్తామని మంత్రి డోలా శ్రీబాలవీరాంజ నేయస్వామి తెలిపారు.ఈ నెల 25 లోపు www.apdas-cac.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, రెగ్యులర్ డిగ్రీ, ఆపై ఉన్నతవిద్య చదువుతున్న విద్యా ర్థులు, పదో తరగతి ఉత్తీర్ణులై స్వయంఉపాధితో జీవించేవారు,18 నుంచి 45 ఏళ్ల లోపు ఉండి 70 శాతం అంగవైకల్యం ఉన్న వారు దరఖాస్తు చేసు కొనేందుకు అర్హులని మంత్రి వీరాంజనేయస్వామి వెల్లడించారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News