నేడు జవహర్లాల్ నెహ్రూ జయంతి

స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: నవభారత నిర్మాతగా, స్వతంత్ర భారతావని మొట్టమొదటి ప్రధానమంత్రిగా అంతులేని కీర్తిని సంపాదించిన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన రోజు నవంబర్ 14. ఈ రోజున దేశంలోని చిన్నారులందరూ “బాలల దినోత్సవం”గా కన్నులపండువగా జరుపుకుంటారు. చాచాజీ జన్మదినం రోజునే బాలల పండుగను జరపటానికి కారణం. పిల్లలపట్ల ఆయనకు ఉన్న ప్రేమే.అందుకే “జాతి భవిష్యత్తు నాలుగ్గోడల మధ్యనే రూపుదిద్దుకుంటుంది కాబట్టి దేశంలోని బాలబాలికల అభివృద్ధికై తన పుట్టిన రోజును బాలల దినోత్సవం”గా జరుపుకోవాలని చాచాజీ ఆకాంక్షించారు.కాబట్టి చాచాజీ ఆశించినట్లుగా మన దేశంలో ప్రతి సంవత్సరం ఆయన పుట్టిన రోజైన నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవంను జరుపుకుంటున్నాము. ఈ బాలల దినోత్సవాన్ని ప్రపంచంలోని అన్ని దేశాలూ ఒక్కో రోజున జరుపుకుంటాయి. అయితే మన దేశంలో మాత్రం రోజా పువ్వులన్నా, పసిపిల్లలన్నా విపరీతంగా ప్రేమించే చాచాజీ జన్మదినాన జరుపబడుతోంది.తన 75 సంవత్సరాల జీవిత కాలంలో 52 సంవత్సరాలపాటు రాజకీయాల్లోనే గడిపిన చాచాజీ.. చాలా కాలం జైళ్లలోనే గడిపారు. 18 సంవత్సరాలపాటు ప్రధానమంత్రి పదవిని దీక్షా పట్టుదలలతో నిర్వహించిన ఈ త్యాగశీలి.1964 మే 27వ తేదీన పరమపదించారు. న్యూఢిల్లీలోని శాంతివనంలో నిర్మించిన చాచాజీ సమాధి.జాతీయ స్మారక చిహ్నంగా వెలుగొందుతోంది.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

కార్మికులు, కార్మికుల కోసం మాట్లాడే వాళ్లంటే నాకు ఎంతో ఇష్టం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: కార్మికులు, కార్మికుల కోసం మాట్లాడే వాళ్లంటే నాకు ఎంతో ఇష్టమని సినీ నటులు ప్రకాష్ రాజ్ అన్నారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *