తెలంగాణ “రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025′ చంద్రబాబుకు ఆహ్వానం

ఆహ్వాన పత్రిక అందజేసిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

అమరావతి,ఐఏషియ న్యూస్: తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలుసుకున్నారు.తెలంగాణ ప్రభుత్వం త్వరలో నిర్వహిస్తున్న’తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’కు రావాలని చంద్రబాబును ఆయన ఆహ్వానించారు.ఈనెల 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సదస్సుకు రావాలని సీఎం చంద్రబాబును రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోమటిరెడ్డి కోరారు.ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ను దావోస్ సమ్మిట్ తరహాలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థల ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులు సదస్సుకు హాజరవుతున్నారని ఆయన చంద్రబాబుకు వివరించారు. సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

రౌడీయిజం చేస్తే “రాష్ట్ర బహిష్కరణ” చేస్తా

ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కొందరు రాజకీయ ముసుగులో ఉండే రాజకీయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *