మార్టేరు (పశ్చిమగోదావరి జిల్లా),ఐఏషియ న్యూస్: ప్రముఖ సినీనటుడు జోష్ రవికు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి సూర్య వెంకట నరసింహ (68) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలో మూడో కార్తీక మాసం సోమవారం సందర్భంగా శివాలయంలో అభిషేకాలు చేయడానికి వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా అస్వస్థకు గురయ్యారు వెంటనే ఇంటికి వెళ్లే లోపు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే మార్టేరు గ్రామం అంతా శోకసముద్రంలో మునిగిపోయింది.గ్రామంలో జరిగే ప్రతి శుభకార్యానికి నాని పంతులు అర్చక సేవలు అందిస్తూ అందరి ఆదరభిమానాలు పొందారు. ఆయన పాద హృదయానికి చూసేందుకు బంధువులు గ్రామస్తులు భారీగా తరలివచ్చి జోష్ రవి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News