admin

భక్తులను మోసగిస్తే కఠిన చర్యలు: టిటిడి

తిరుమల,ఐఏషియ న్యూస్: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులను మాయమాటలతో మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టిటిడి హెచ్చరించింది. గత వారం రోజుల క్రితం భక్తురాలు శ్రీమతి ఊర్వశి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గూగుల్ ద్వారా వసతి కోసం వెతికే క్రమంలో శ్రీనివాసం రెస్ట్ హౌసెస్ అనే వెబ్ సైట్ లో ఇచ్చిన మొబైల్ నెంబర్ 8062180322 ను సంప్రదించగా, అభిమన్యు అనే వ్యక్తి తాను శ్రీనివాసం కాంప్లెక్స్ లో రిసెప్షన్ కి చెందిన వాడినని …

Read More »

విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు భోజనం చేయాలి

ఫుడ్ పాయిజన్ జరిగే సంఘటనలు తగ్గుతాయి తెలంగాణ హైకోర్టు సీజే అపరేశ్‌కుమార్‌ సింగ్ హైదరాబాద్,ఐఏషియ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగాప్రభుత్వపాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో కలిసి అక్కడే భోజనం చేయాలని తెలంగాణ హైకోర్టు సూచించింది. ఇలా చేస్తే ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు తగ్గిపోతాయి, నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని అభిప్రాయపడింది.స్కూల్ భోజన నాణ్యతపై పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించింది.విద్యార్థులు పాఠశాల పనుల్లో భాగస్వాములు కావడం తప్పుకాదని సీజే వ్యాఖ్య.తాను కూడా చిన్నప్పుడు స్కూల్ పనులు చేశానని సీజే అపరేశ్‌కుమార్‌ సింగ్ గుర్తుచేసుకున్నారు.ప్రభుత్వంపై పిటిషనర్ వాదన ఈ …

Read More »

చెట్లు నరికితే.. ఒక్కో వృక్షానికి రూ. లక్ష జరిమానా

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: చెట్లను నరకడం పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. దీనివల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని.. వర్షాలు సరిగ్గా పడవు. వాయు కాలుష్యం పెరుగుతుంది. ప్రజలు అనారోగ్యం పాలవుతారు. అందుకే చెట్లను నరకడం నేరం.ప్రతిఒక్కరికీ పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది.చెట్లను నాటి వాటిని సంరక్షించాలి. పర్యావరణాన్ని కాపాడితే మన భవిష్యత్తును మనం కాపాడుకున్నట్లేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చెట్లు నరకడం మనిషిని చంపడం కంటే దారుణమని, పర్యావరణానికి నష్టం కలిగించే వారిపై దయ చూపరాదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.అక్రమంగా చెట్లు నరికితే ఒక్కోదానికి రూ.1 …

Read More »

17 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన ముంబై అండర్ వరల్డ్ డాన్ అరుణ్ గావ్లి

ముంబై,ఐఏషియ న్యూస్: ముంబై అండర్ వరల్డ్ డాన్, రాజకీయ నాయకుడిగా మారిన అరుణ్ గావ్లి 17 ఏళ్ల అనంతరం నాగ్పూర్ సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యాడు. 2007లో శివసేన కార్పొరేటర్ కమలాకర్ జంసండేకర్ హత్య కేసులో అతనికి జీవిత ఖైదు విధించారు.సుప్రీంకోర్టు అతనికి ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. అతను బయటకు వచ్చిన వెంటనే,అతని కుటుంబం, మద్దతుదారులు అతనికి ఘన స్వాగతం పలికారు. Authored by: Vaddadi udayakumar

Read More »

జిఎస్టి లో రెండు స్లాబ్ లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

కేంద్ర క్యాబినెట్ నిర్ణయం భారీగా రేట్లు తగ్గనున్న టీవీ,వాషింగ్ మెషిన్,ఏసీలు హెల్త్,లైఫ్ ఇన్సూరెన్స్ లకు జీఎస్టీ ఎత్తివేత ఏపీ చీఫ్ బ్యూరో, ఐఏషియ న్యూస్: ప్రస్తుతం వసూలు చేస్తున్న జీఎస్టీలో 12శాతం, 28శాతం స్లాబులను తొలగించి ఆ స్థానంలో కేవలం. 5శాతం, 18శాతం స్లాబులే కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన న్యూఢిల్లీలో బుధవారం 56వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. పన్ను రేట్లపై రాష్ట్రాలు, కేంద్రం విస్తృతంగా చర్చించిన తర్వాత ఈ …

Read More »

సిబిఐకి సుగాలి ప్రీతి కేసు అప్పగించిన ఏపీ ప్రభుత్వం

అమరావతి ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుగాలి ప్రీతి కేసును సీబీఐకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ హయాంలో ఈ కేసును సీబీఐకు అప్పగించారు. అయితే దర్యాప్తు సరిగా జరగలేదని భావిస్తున్న నేపథ్యంలో మరోసారి సీబీఐకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థకు లేఖ రాయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గురువారం రోజున జరిగే ఏపీ కేబినెట్ సమావేశంలోనూ ఈ విషయంపై చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు 2017 ఆగస్టు …

Read More »

బిఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేసిన కెసిఆర్

హైదరాబాద్బీ,ఐఏషియ న్యూస్:  బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితను పై వేటు వేసారు. కొంత కాలంగా కవిత చేస్తున్న వ్యాఖ్యలు.. వివాదాలు తారాస్థాయికి చేరటంతో కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించి ఈ నిర్ణయం ప్రకటించారు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం సీబీఐకి కేసు అప్పగింత పైన స్పందించిన కవిత నేరుగా హరీష్, సంతోష్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. వీటిని కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. పార్టీకి నష్టం చేసే విధంగా కవిత వ్యవహరించారనే కారణంతో పార్టీ …

Read More »

సింహాద్రి అప్పన్న అన్నప్రసాద పథకానికి లక్ష విరాళం

సింహాచలం(విశాఖపట్నం),ఐఏషియ న్యూస్: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి అన్నప్రసాద పథకానికి విజయనగరం జిల్లా, భోగపురం మండలం, ముడసాలపేట గ్రామానికి చెందిన చెల్లిబోయిన నరసింగరావు దంపతులు భక్తిశ్రద్ధలతో 1,00,000 రూపాయలు విరాళంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వి త్రినాధరావు చేతులమీదుగా వీరికి స్వామివారి నిత్య అన్న ప్రసాదం బాండ్ ను అందజేశారు. దాతలు నరసింగరావు దంపతులు స్వామివారి నిత్య అన్న ప్రసాదం పథకంలో శాశ్వత భాగస్వాములు అయ్యారు. దాతకు స్వామివారి దర్శనంఅనంతరము ఆలయ పర్యవేక్షణ అధికారి త్రిమూర్తులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు.భక్తులకు …

Read More »

శ్రీకనకమహాలక్ష్మి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు

విశాఖ దక్షిణం,ఐఏషియ న్యూస్: బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు మంగళవారం సాయంత్రం 5: గం లకు పవిత్రో త్సవములు ప్రారంభించడమైనది. ఇందులో భాగంగా గణపతి ఆరాధన, పుణ్యావచనం, అజస్ర దీపారాధన,అంకురార్పణ్ణం,నీరాజనంమంత్రాపుష్పములతో నేటి కార్యక్రమం పూర్తి అయినది. ఈ యొక్క కార్యక్రమంలో కార్యానిర్వహణదికారిణి శ్రీమతి కే. శోభారాణి, కార్యనిర్వాహక ఇంజినీర్, సిహేచ్.వి. రమణ, పర్యవేక్షణాదికారి కనకరాజు,దాత శ్రీ సుంకర. రవీంద్ర, వేద పండితులు,అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »

విశాఖ వచ్చిన సీఎం చంద్రబాబుకు ఘనస్వాగతం,ఆత్మీయవీడ్కోలు

విశాఖపట్నం,ఐఏషియ బ్యూరో: ఒక్కరోజు పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం విశాఖ నగరానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకుస్థానిక నేతలు, అధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది.మంగళవారం హెలికాప్టర్ ద్వారా బీచ్ రోడ్డులో గల కోస్టల్ బ్యాటరీ వద్ద హెలిపాడ్ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, పార్లమెంట్ సభ్యులు ఎం.శ్రీభరత్, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, ప్రభుత్వ …

Read More »