అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం విద్యుత్ శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు అధికారులతో తాజా పరిస్ధితిపై చర్చించారు. అనంతరం ఆయన కీలక ప్రకటనలు చేశారు. అలాగే విద్యుత్ రంగం విషయంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలు రాష్ట్రానికి ఎలా గుదిబండగా మారాయో వెల్లడించారు.ఐదేళ్లలో అన్ని ఆర్టీసీ బస్సులను ఈవీలుగా మార్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే త్వరలోనే వెయ్యి ఈవీ బస్సుల్ని కొనుగోలు …
Read More »admin
జైల్లో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారు
అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్‌ను కలిసిన సోదరి ఉజ్మాఖాన్ కరాచీ,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: జైలులో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారని, అయితే మానసికంగా ఆయన తీవ్ర వేదన అనుభవిస్తున్నారని ఆయన సోదరి ఉజ్మాఖాన్ వెల్లడించారు. రావల్పిండిలోని అడియాలా జైలులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను మంగళవారం ఆమె కలిశారు. సోదరుడ్ని పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఇమ్రాన్ ఖాన్ పూర్తి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ మానసికంగా చాలా ధృఢంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విరుద్ధ పాలనకు వ్యతిరేకంగా ప్రజలకు, …
Read More »జనవరి 1 న్యూ ఇయర్ ఎందుకు జరుపుకుంటామంటే
స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: క్షణాలు,నిమిషాలు, గంటలు,రోజులు,వారాలు,నెలలు,సంవత్సరాలు.. ఇలా కాలం గిర్రున తిరుగుతోంది. ఠక్కున క్యాలెండర్ మారిపోతోంది. మరీ క్యాలెండర్ కథేంటి? జనవరి 1వ తారీఖునే కొత్త సంవత్సరం అని సంబరాలు చేసుకుంటారు ఎందుకు? అసలు సంవత్సరాన్ని లెక్కించడానికి ప్రమాణం ఏంటి? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు మీ మదిలో మెదులుతుంటాయి కదూ.అయితే ఈ క్యాలెండర్ కహాని తెలియాలంటే కొన్ని దశాబ్దాలు కాదు కాదు శతాబ్దాలు వెనక్కి వెళ్లాల్సిందే. కాలం వేసిన బలమైన ముద్రలను లోతుగా పరిశీలించాల్సిందే. ప్రపంచానికి జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం …
Read More »పెళ్లికి వచ్చిన వారికి హెల్మెట్లు బహుమతి
రాజస్థాన్,ఐఏషియ న్యూస్: రాజస్థాన్ లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఇచ్చిన రిటర్న్ గిఫ్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడి కుచామన్ నగరంలో మనోజ్ బర్వాల్ అనే వ్యక్తి తన కూతురు సోనును యశ్ బెద్వాల్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. వివాహానికి హాజరైన వారికి రిటర్న్ గిఫ్టులుగా హెల్మెట్లు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తూ 286 హెల్మెట్లను అందజేయడం పట్ల సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. Authored by: Vaddadi udayakumar
Read More »తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణను రాజకీయ నేతల్ని ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా వాలిపోయిన కొబ్బరి చెట్లను చూసి తెలంగాణ నేతల దిష్టి తగిలిదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై తెలంగాణ మంత్రులు తీవ్రంగా స్పందిస్తున్నారు. పవన్ వ్యాఖ్యల్ను తప్పుబడుతూ ఇవాళ వరుస వార్నింగ్ లు ఇస్తున్నారు.తాజాగా గోదావరి జిల్లాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ …
Read More »ఏపీలో అఖండ-2 టికెట్ ధరలు పెంపునకు ప్రభుత్వం అనుమతి
అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీలో అఖండ-2 టికెట్ ధరలు పెంపునకు ప్రభుత్వం అనుమతించింది.సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75 పెంపు మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.10 రోజుల వరకు టికెట్ ధరలు పెంపునకు అనుమతి ఇవ్వడం జరిగింది.ఈ నెల 4న ప్రీమియర్‌షో టికెట్ ధర రూ.600గా ప్రభుత్వం నిర్ణయించింది. Authored by: Vaddadi udayakumar
Read More »కేంద్రమంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాకు జన్మదిన శుభాకాంక్షలు
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఢిల్లీలో కేంద్ర మంత్రివర్యులు,బిజెపి జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాశ్ నడ్డాని కలిసి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ , కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్, మాజీ ఎంపీ కొత్తపల్లి గీత తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. Authored by: Vaddadi udayakumar
Read More »కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ మంత్రిని కలిసిన బిజెపి నేతలు
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖామాత్యులు హెచ్డి కుమారస్వామిని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే రాష్ట్రంలోని పరిశ్రమల ఏర్పాటు, ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కు అందిస్తున్న సహాయానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ,ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధన్యవాదాలు తెలియజేశారు. Authored by: Vaddadi udayakumar
Read More »4న చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన
అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల నాలుగో తేదీన చిత్తూరు జిల్లా లో పర్యటించనున్నారు.రాష్ట్రవ్యాప్తంగా కొత్త డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసుల ప్రారంభంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఈ నెల 4న ఉదయం 11 గంటలకు డీడీవో ఆఫీసులను వర్చువల్‌గా ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం పవన్.చిత్తూరులో డీడీవో ఆఫీసును స్వయంగా ప్రారంభించనున్న పవన్ కల్యాణ్. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన చిత్తూరు జిల్లా నాయకులు జనసైనికులను కోరారు. Authored by: Vaddadi udayakumar
Read More »కైలాసగిరిపై 1,020 అడుగుల ఎత్తుగల గాజువంతెన ప్రారంభం
విశాఖపట్న,ఐఏషియ న్యూస్: విశాఖలోనే ప్రముఖ పర్యాటక కేంద్రం అయినటువంటి కైలాసగిరిపై సుమారు 7 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన గాజు వంతెనను సోమవారం ఉదయం విశాఖ పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీ భరత్, వి ఎం ఆర్ డి ఏ ఛైర్పర్సన్ ఎంవి ప్రణవ్ గోపాల్,తూర్పు శాసన సభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు,జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు,మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్ తేజ్ భరత్ కలిసి సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం వి.ఎం.ఆర్.డి.ఏ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన మీదట ముఖ్యమంత్రి …
Read More »
News Website (iasianews.net) I Asia News