గోవా,ఐఏషియ న్యూస్: గోవాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని శుక్రవారం పీఎం మోదీ ఆవిష్కరించారు. దక్షిణ గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠంలో ఏర్పాటు చేసిన 77 అడుగుల కాంస్య శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గుజరాత్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ శిల్పి రామ్ సుతార్ ఈ రాముడి విగ్రహాన్ని తయారు చేశారు.550 ఏళ్ల మఠం సంప్రదాయాన్ని పురస్కరించుకుని ఈనెల 27 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ఇక్కడ వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. Authored by: Vaddadi udayakumar
Read More »admin
కనకమహాలక్ష్మిని దర్శించుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సూర్యకుమారి
విశాఖ దక్షిణం,ఐఏషియ న్యూస్: ఉత్తరాంధ్ర కల్పవల్లి విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి మార్గశిర మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సూర్యకుమారి శుక్రవారం కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ఈవో శోభారాణి ప్రిన్సిపల్ కార్యదర్శి సూర్యకుమారికి శేష వస్త్రాలు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. Authored by: Vaddadi udayakumar
Read More »20వేలు లంచం తీసుకొంటూ ఎసిబికి చిక్కిన వీఆర్వో సూర్యనారాయణ
అనకాపల్లి క్రైమ్,చాన్విక జ్యోతిన్యూస్: అనకాపల్లి మండలం, అక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన యస్. శ్రీను తండ్రికి వారి గ్రామములో కొంత వ్యవసాయభూమి వున్నది. ఆయన ఇటీవల చనిపోయినారు. దానిమీదట సదరు శ్రీను ఆ భూమిని తన తల్లి పేరున రెవిన్యూ రికార్డులలో మ్యుటేషన్ చేసి,ఆమె పేరున ఈ-పాస్ బుక్ ఇచ్చుటకు గాను, అనకాపల్లి మండల రెవిన్యూ అధికారులకు దరఖాస్తు చేసినాడు. అయితే, ఆ దరఖాస్తును ప్రాసెస్ చేసి, ఆమె పేరును రెవిన్యూ రికార్డులలో మ్యుటేషన్ చేసి, ఈ-పాస్ బుక్ ఇచ్చుటకు గాను, అనకాపల్లి మండలం, మారేడుపల్లి …
Read More »కాళీమాత విగ్రహాన్ని మేరీమాతగా మార్చిన పూజారి: ముంబైలో కలకలం
కలలో దేవతే చెప్పిందని పూజారి వింత వాదన పూజారిని అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు ముంబై,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: ముంబై శివారు చెంబూర్‌లోని ఒక కాళీమాత ఆలయంలో విగ్రహాన్ని మేరీమాత రూపంలోకి మార్చడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు బాధ్యుడిగా భావిస్తున్న ఆలయ పూజారిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. భక్తుల ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.చెంబూర్‌లోని అనిక్ విలేజ్‌లో ఉన్న హిందూ శ్మశానవాటికలోని కాళీ ఆలయంలో ఇటీవల ఈ ఘటన జరిగింది. కాళీమాత నల్లటి విగ్రహానికి తెలుపు రంగుపూసి,బంగారు …
Read More »ప్రపంచంలోని టాప్ 100 సిటీలలో హైదరాబాద్ 82వ స్థానం
మొదటి,రెండో స్థానంలో లండన్,న్యూయార్క్ మూడోస్థానం ప్యారిస్ హైదరాబాద్,చాన్విక జ్యోతిన్యూస్: హైదరాబాద్ మహానగరం దినదినాభివృద్ధి చెందుతోంది. ఫ్యూచర్ సిటీగా అంతర్జాతీయ స్థాయులో దూసుకెళ్తోంది. వరల్డ్ లోని అత్యుత్తమ నగరాలతో పోటీ పడుతోంది. ఇక్కడి అనుకూలమైన వాతావరణం. దిగ్గజ కంపెనీలకు అనువైన స్పాట్ గా మారుతోంది. భాగ్యనగరంలోని చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక ప్రదేశాలు టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. చార్మినార్, గోల్కొండ కోట, సాలార్ జంగ్ మ్యూజియం, బిర్లా మందిర్, హుస్సేన్ సాగర్, కుతుబ్ షాహీ సమాధులు, చౌమహల్లా ప్యాలెస్, రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించేందుకు ఏటా వేల సంఖ్యలో …
Read More »ఏసీబీకి చిక్కిన ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్
ఇంటినంబర్ కేటాయింపునకు లంచం డిమాండ్ నిజామాబాద్,ఐఏషియ న్యూస్: తన డ్రైవర్ ద్వారా ఓ వ్యక్తి నుంచి రూ.20వేలు డిమాండ్ చేసిన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు.ఈ నేపథ్యంలో గురువారం కమిషనర్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.డ్రైవర్ భూమేశ్ బ్యాగ్ తనిఖీ చేయగా అతనివద్ద నుంచి లెక్కల చూపని నాలుగు లక్షల30వేల రూపాయలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కమిషనర్ తో పాటు డ్రైవర్ పై కూడా కేసు నమోదు చేసి వారిద్దరిని అరెస్టు …
Read More »అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయానికి మాస్టర్ ప్లాన్ రెడీ
అమరావతి,చాన్విక జ్యోతిన్యూస్: రాజధాని అమరావతిలో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొత్తం 4,618 ఎకరాల్లో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.ఫేజ్–1లో భాగంగా 4 కిలోమీటర్ల పొడవైన రన్‌వేను నిర్మించనున్నారు. ఈ విమానాశ్రయాన్ని ‘కోడ్–4ఎఫ్’ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. దీని ద్వారా ఎయిర్‌బస్ ఏ 380, బోయింగ్ 777–9 వంటి ప్రపంచంలోని అతిపెద్ద విమానాలు కూడా అమరావతిలో ల్యాండింగ్ చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ విమానాశ్రయం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయ విమాన రవాణాలో …
Read More »ఏపీ రాష్ట్రంలో ‘స్క్రబ్ టైఫస్’ బ్యాక్టీరియా కలకలం
అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో ‘స్క్రబ్ టైఫస్’ బ్యాక్టీరియా కలకలం రేపుతున్నాయి.26 జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.స్క్రబ్ టైఫస్ అనేది నల్లిని పోలిన చిన్న కీటకం.ఈ కీటకం కుడితే శరీరంపై నల్లని మచ్చ, దద్దుర్లు ఏర్పడతాయి.వారం, పది రోజుల తర్వాత జ్వరం, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పులు, జీర్ణ సమస్యల రూపంలో ఇన్‌ఫెక్షన్స్ బయటపడతాయి. ఇప్పటివరకుచిత్తూరు (379), కాకినాడ (141),విశాఖ (123), కడప (91, నెల్లూరు (86), అనంతపురం (68), విజయనగరం (59)తదితర జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య శాఖ …
Read More »పొరపాటున ఫోన్ పేలో అమౌంట్ ఒకరు అనుకుని వేరే వారికి పంపారా?
స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: పొరపాటున డబ్బు ఒకరికి పంపబోయి వేరొకరికి పంపించారా?అయితే వెంటనే ఇలా చేయండి. చాలా మంది పొరపాటున ఒకరికి బదులు మరొకరికి డబ్బులు పంపిస్తుంటారు. అలాంటి సమయంలో కంగారు పడకుండా వెంటనే ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ తీసుకోండి. గూగుల్ పే లో పంపితే ఈ నంబర్‌కి కాల్ చేయండి: 18004190157. ఫోన్ పే లో పంపితే: 08068727374 నంబర్‌కి సంప్రదించండి. పేటీఎం లో పంపితే: 01204456456 నంబర్‌కి కాల్ చేయండి. భీమ్ యాప్ ద్వారా పంపితే: 18001201740 నంబర్‌కి సంప్రదించండి. మీ …
Read More »దోమల కోసం వాడే స్లీప్‌వెల్ అగరబత్తీల్లో ప్రమాదకర రసాయనం
స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: దోమల నివారణకు వాడే స్లీప్‌వెల్ అగరబత్తీల్లో ప్రమాదకరమైన మేపర్‌ఫ్లూథ్రిన్ అనే పురుగుమందు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల విజయవాడలోని ఒక షాపులో తనిఖీలు చేసి సేకరించిన నమూనాలను హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్‌కు పంపగా ఈ అగరబత్తీల్లో ప్రాణాంతక రసాయనం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీనివల్ల శ్వాసకోశ, నాడీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఈ అగరబత్తీలను వాడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. Authored by: Vaddadi udayakumar
Read More »
News Website (iasianews.net) I Asia News