ప్రపంచంలోని టాప్ 100 సిటీలలో హైదరాబాద్ 82వ స్థానం

మొదటి,రెండో స్థానంలో లండన్,న్యూయార్క్ మూడోస్థానం ప్యారిస్

హైదరాబాద్,చాన్విక జ్యోతిన్యూస్: హైదరాబాద్ మహానగరం దినదినాభివృద్ధి చెందుతోంది. ఫ్యూచర్ సిటీగా అంతర్జాతీయ స్థాయులో దూసుకెళ్తోంది. వరల్డ్ లోని అత్యుత్తమ నగరాలతో పోటీ పడుతోంది. ఇక్కడి అనుకూలమైన వాతావరణం. దిగ్గజ కంపెనీలకు అనువైన స్పాట్ గా మారుతోంది. భాగ్యనగరంలోని చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక ప్రదేశాలు టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. చార్మినార్, గోల్కొండ కోట, సాలార్ జంగ్ మ్యూజియం, బిర్లా మందిర్, హుస్సేన్ సాగర్, కుతుబ్ షాహీ సమాధులు, చౌమహల్లా ప్యాలెస్, రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించేందుకు ఏటా వేల సంఖ్యలో పర్యటకులు వస్తుంటారు. అలాగే హైదరాబాదీ బిర్యానీ, స్ట్రీట్ ఫుడ్ ఎంతో ఫేమస్.
ఇదిలా ఉండగా తాజాగా హైదరాబాద్ మహానగరం మరోసారి అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. ప్రపంచంలోని అత్యుత్తమ 100 నగరాల్లో స్థానాన్ని సంపాదించుకుంది.భారత్ నుంచి బెంగళూరు 29 వ స్థానంలో నిలిచింది.అలాగే దిల్లీ 54 వ స్థానంలో ఉంది.హైదరాబాద్ 82 వ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2026 వరల్డ్ బెస్ట్ సిటీస్ రిపోర్టును రెజోనాస్స్ అనే సంస్థ ప్రకటించింది.ఈ లిస్టులో భారత్ నుంచి మూడు నగరాలు లిస్టులో చేరాయి.అయితే ఈ జాబితాలో హైదరాబాద్ మహానగరం 82 వ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.ఇక 2026 వరల్డ్ బెస్ట్ సిటీస్ రిపోర్టులో లండన్ టాప్ ప్లేస్ లో నిలిచింది. రెండోస్థానంలో న్యూయార్క్, మూడోస్థానంలో ప్యారిస్, నాలుగోస్థానంలో టోక్యో, ఐదోస్థానంలో మాడ్రిడ్ ఉన్నాయి. ఎకనామిక్ గ్రోత్, ఇన్ ఫ్రా స్ట్రక్చర్, టూరిజం, సేఫ్టీ, పర్యావరణం, క్వాలిటీ ఆఫ్ లైఫ్, జీవనశైలి తదితర వాటిని పారామీటర్లుగా తీసుకుంది. హైదరాబాద్ లో టెక్, ఫార్మా కంపెనీలు విస్తృతంగా ఉన్నాయి.జీనోమ్ వ్యాలీ,కరోనా లాంటి ప్రమాదకర వైరస్ లకు వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా ఉంది. వచ్చే ఏడాది హైదరాబాద్ మరింత మెరుగైన ర్యాంక్ సాధిస్తుందని ఆశిద్దాం.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

అమెరికలో అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్

వాషింగ్టన్,ఐఏషియ న్యూస్: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను వారి స్వదేశాలకు పంపించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *