admin

2 కోట్ల ఆధార్ నంబర్లను డిఆక్టివేట్ చేసిన యూఐడీఏఐ

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: భారతీయులకు ఆధార్ తప్పనిసరి. అయితే ఇటీవలి కాలంలో నకిలీ ఆధార్ కార్డులతో పథకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు కొందరు. అయితే ఇలాంటి వాటిని తగ్గించి ఆధార్ డేటాబేస్ పారదర్శకతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డులను కేంద్ర ప్రభుత్వం డీయాక్టివేట్ చేసింది. దాదాపు 2 కోట్లకు పైగా ఆధార్ నంబర్లను యూఐడీఏఐ తొలగించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం సైబర్ నేరాలువిపరీతంగాపెరిగిపోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా ఈ …

Read More »

రాజ్యంగం ద్వారానే అమరావతి సాధించాం: మహిళా కమిషన్ ఛైర్మెన్ రాయపాటి శైలజ

అమరావతి,ఐఏషియ న్యూస్: భారత రాజ్యంగం ద్వారానే అమరావతి రాజధాని సాధించామని ఏపీ రాష్ట్ర మహిళ కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు.ఫోరమ్ ఫర్ ఆర్టిఐ ఆధ్వర్యంలో బుధవారం అమరావతి లోని మందడం రైతు జెఏసి శిభిరంలో గౌరవ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్ అధ్యక్షతన రాజ్యాంగ ఆమోద దినోత్సవ రాష్ట్ర సదస్సు ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన ఛైర్మెన్ శైలజ మాట్లాడుతూ హక్కులు సాధించుకోవటానికి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చు కోవాలన్నారు. సమాచార హక్కు చట్టం ప్రజలకు వరం అని, కొంత మంది బ్లాక్ మెయిల్ …

Read More »

మూడు కొత్త జిల్లాలకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో 26 నుంచి 29కి పెరగనున్న జిల్లాల సంఖ్య త్వరలో పోలవరం, మార్కాపురం, మదనపల్లె జిల్లాల ఏర్పాటు కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు,నూతనంగా ఒక మండలం ఇక నుంచి వాసవీ పెనుగొండ మండలంగా పేరుమార్పు జిల్లాల పునర్విభజనపై మంత్రుల కమిటీ సిఫార్సుకు సీఎం చంద్రబాబు ఆమోదం కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు- అనంతరం నోటిఫికేషన్ ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదాన్ని తెలియచేశారు. మార్కాపురం, మదనపల్లె జిల్లాలు, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు …

Read More »

డిసెంబర్ లో పంచాయతీ ఎన్నికలు

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: సర్పంచ్ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మంగళవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ను విడుదల చేసింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు పేర్కొంది. మొదటి విడత పోలింగ్ వచ్చేనెల11న, రెండో విడత 14న, మూడో విడత 17న జరుగనుంది. ఓటింగ్జరిగిన రోజునే ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. షెడ్యూల్ రావడంతో ఇవాళ్టి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. 31 జిల్లాల్లోని 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్లు సైతం ఖరారు …

Read More »

బీహార్ కాంగ్రెస్ నుండి ఏడుగురు నాయకులను ఆరేళ్ల పాటు సస్పెన్షన్

పాట్నా,ఐఏషియ న్యూస్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమికి కారణం అయ్యారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు, క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఏడుగురిని ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసిన బీపీసీసీ.కాంగ్రెస్ సేవాదళ్ మాజీ ఉపాధ్యక్షుడు ఆదిత్య పాశ్వాన్, బీపీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు షకీలూర్ రెహమాన్, కిసాన్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాజ్ కుమార్ శర్మ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాజ్ కుమార్ రాజన్, బీసీ శాఖ మాజీ అధ్యక్షుడు కుందన్ గుప్తా, బంకా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కాంచన కుమారి, …

Read More »

చెన్నై-హైదరాబాద్ బుల్లెట్ రైలు: 2.20 గంటల్లో గమ్యం

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: చెన్నై-హైదరాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ రైలును తిరుపతి మీదుగా నడిపేందుకు సవరించిన నివేదికను తమిళనాడు ప్రభుత్వానికి అందజేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే, 778 కిలోమీటర్ల దూరం కేవలం 2 గంటల 20 నిమిషాల్లో ప్రయాణించవచ్చు. ప్రస్తుతం 12 గంటలు పట్టే ప్రయాణం గణనీయంగా తగ్గుతుంది. తమిళనాడులో 223.44 హెక్టార్ల భూమి అవసరమని నివేదిక పేర్కొంది. చెన్నై సెంట్రల్, మీంజూరు వద్ద కొత్త స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. Authored by: Vaddadi …

Read More »

బ్రాహ్మణ వ్యవస్థను కించపరిచిన వ్యక్తిని అరెస్టు చేయాలని పోలీసులకు ఫిర్యాదు

అనకాపల్లి,ఐఏషియ న్యూస్: బ్రాహ్మణులను, బ్రాహ్మణ వ్యవస్థను కించపరుస్తూ, అవమానకరంగా పాటలు రూపంలో, యూట్యూబ్ ద్వారా బ్రాహ్మణ వస్త్రధారణ వ్యవస్థని కించపరిచిన రమణ అనే గాయకుడు మీద అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ వేదుల సూర్యప్రభ ఆధ్వర్యంలో అనకాపల్లి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గంటి రవికుమార్, నూకాంబిక అమ్మవారి ఆలయ ధర్మకర్త కొడుకుల శ్రీకాంత్, బిజెపి నాయకులు ఓరుగంటి నాగమణితో పాటు పలువురు బ్రాహ్మణ సంఘ …

Read More »

గోదావరి పుష్కరాలకు ముహుర్తం ఖరారు

అమరావతి,ఐఏషియ న్యూస్: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నెలకొన్న గోదావరి పుష్కరాలకు ముహూర్తం రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేయడం జరిగింది.2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణ చేయాలని నిర్ణయించారు.ముందస్తుగానే గోదావరి పుష్కరాల కోసం నిధులు కేటాయించిన కేంద్రం.ఇప్పటికే పుష్కరాల కోసం రూ.100 కోట్లను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. అలాగే గోదారి పుష్కరాలు నిర్వహణ కోసం మంత్రుల కమిటీని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి …

Read More »

నేడు జాతీయ రాజ్యాంగ దినోత్సవం

ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: భారత్ అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన గణతంత్ర రాజ్యం దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలకు ప్రతిరూపమే మన రాజ్యాం గం పౌరులు పాలకులు, పాలన యంత్రాంగం, పాటించవలసిన అత్యున్నత చట్టంగా దీన్ని పేర్కొంటారు. ఇందులో ప్రభుత్వ విభాగాలు వాటి స్వరూపం స్వభావం లక్ష్యాలు ఆశయాలు వివరించారు. ప్రతి వ్యక్తి స్వేచ్ఛకు సర్వతో ముఖాభి వృద్ధికి రాజ్యాంగం హామీ ఇస్తుంది.భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీకి గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబర్ 26న ఇండియా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దీన్నే సంవిధాన్ …

Read More »

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టుల ధర్నా

జయశంకర్ భూపాలపల్లి,ఐఏషియ న్యూస్: జిల్లాలోని జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలను వెంటనే అప్పగించాలని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.చాలా కాలంగా జర్నలిస్టు సోదరులు వేచి చూస్తున్న ఈ సమస్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడాని తీవ్రంగా టిడిపి ఖండించింది. ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర నాయకులు,వరంగల్ పార్లమెంట్ కాంటెస్ట్ ఎంపీ అభ్యర్థి సాగర్, పెద్దపల్లి టిడిపి ఇంచార్జ్ అందే భాస్కరాచారి దీక్షా శిబిరాన్ని సందర్శించి జర్నలిస్టులకు మద్దతు …

Read More »