admin

కారును ఢీకొన్న ఆర్టీసీ బస్

ఆనందపురం(విశాఖపట్నం),ఐఏషియ న్యూస్: ఆనందపురం మండలంలోని వేములవలస వద్ద కారును వెనక నుండి ఆర్టిసి బస్సు ఢీకొనడంతో కారు నుజ్జు నుజ్జు అవ్వగా ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం కలగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి కి చెందిన జి గోవింద్ తో పాటు మరో వ్యక్తి చీపురుపల్లి నుండి మధురవాడ వెళ్తుండగా హైవే నుండి వేముల వలస పెట్రోల్ బంక్ వైపు సర్వీస్ రోడ్లో వస్తుండగా అదే సమయంలో విజయనగరం నుండి పాత గాజువాక వెళ్తున్న గాజువాక డిపో ఆర్టీసీ బస్సు వెనక …

Read More »

5 వేలకే ఈ-సైకిల్.. రాష్ట్రంలో కొత్త మొబిలిటీ విప్లవానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం

అమరావతి,ఐఏషియ న్యూస్: పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర పథకాల పరిధిలో 23,999 విలువైన ఈ-సైకిళ్లను కేవలం 5 వేలకే ప్రజలకు అందించేందుకు సిద్ధమైంది. మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ లోన్ ద్వారా చెల్లించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.ఈ పథకానికి తొలి అడుగు సీఎం చంద్రబాబునాయుడు సొంతనియోజకవర్గమైన కుప్పంలో పడనుంది. అక్కడ మొదటి విడతగా ఈ-సైకిళ్ల పంపిణీ ప్రారంభం కానుంది. విద్యార్థులు, యువత, ఉద్యోగులకు ఈ విధానం ప్రత్యక్ష లాభం చేకూర్చేలాకార్యాచరణరూపొందించారు.అమ్మాయిలు, అబ్బాయిలకు …

Read More »

పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం: ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం

స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: సామాజిక మాధ్యమాలకు బానిసలై అందులో నుంచి బయటికి రాలేని వారు చాలామంది ఇప్పుడు ఎన్నో అవస్థలు పడుతున్నారు.ఇక చిన్న పిల్లలు సోషల్ మీడియా వాడటం పట్ల మరింత ఎక్కువ ఆందోళనకరంగా మారుతోంది. చిన్న వయసులోనే సోషల్ మీడియా బారినపడి చిన్నారులు ఎంతలా మారిపోతున్నారో కళ్లారా చూస్తూనే ఉన్నాం.ఈ క్రమంలోనే సోషల్ మీడియాపై ఆంక్షలు విధించాలని నియత్రణలో ఉంచాలనే డిమాండ్లు ప్రపంచ దేశాల్లో వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో చిన్నారులకు.. సోషల్ మీడియా వాడకుండా కఠిన ఆదేశాలు ఇవ్వాలనే వాదనలు వినిపిస్తున్న వేళ.. ఆస్ట్రేలియా …

Read More »

అతి చిన్నదేశపు ఒక్కనోటు మన కరెన్సీలో 7 లక్షలకు సమానం

షాకింగ్‌గా ఉన్నా.. ఇది నిజం సుమా బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: ప్రపంచంలోనే అత్యంత పవర్‌ ఫుల్‌ కరెన్సీ గురించిన మాట్లాడుకుంటే చాలా మంది అమెరికా డాలర్ లేదా యూరో అనుకుంటారు. కానీ ఓ చిన్న దేశానికి సంబంధించిన ఒకే ఒక్క నోటు మన దేశపు కరెన్సీలో దాదాపు 7 లక్షలకు సమానం.ఇంతకీ ఆ దేశం ఏది? ఆ నోటు విశేషాల గురించి మాట్లాడుకుంటే.ఆ దేశం పేరు బ్రూనై. ఆ దేశపు 10,000 డాలర్ల నోటు భారత కరెన్సీలో దాదాపు రూ.6.8 లక్షలకు సమానం. Vice.com …

Read More »

తెలంగాణ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం

భారత్ ఫ్యూచర్ సిటీలో స్టూడియోలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వ సహకారం సీఎం రేవంత్ రెడ్డి తో తెలుగు చిత్ర సినీ పరిశ్రమ ప్రముఖులు సమావేశం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.భారత్ ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 రెండో రోజున “సృజనాత్మక …

Read More »

20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ డిప్యూటీ తాసిల్దార్

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టర్‌ కార్యాలయంలోని జిల్లా పౌర సరఫరాల అధికారి విభాగంలో పనిచేస్తున్న డిప్యూటీ తహశీల్దార్ హనుమ రవీందర్ నాయక్ లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ  అధికారులకు పట్టుబడ్డారు.ఫిర్యాదుదారునిపై నమోదైన పిడిఎస్ రైస్ కేసును తొలగించడానికి, అలాగే అతనికి విధించిన జరిమానా ప్రక్రియలు పూర్తి చేసి రేషన్ షాప్‌ను తిరిగి తెరవడంలో సహాయం చేస్తానని చెబుతూ 20వేలు రూపాయలు లంచం డిమాండ్ చేసిన హనుమ రవీందర్ నాయక్, ఈ సందర్భంగా ప్రియదర్ నుండి నగదు తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీకి పట్టుబడి అరెస్టయ్యారు.నిందితుడిని ఏసీబీ కోర్టుకు తరలించారు. …

Read More »

తెలంగాణలో “మహిళల ఉచిత బస్సు” ప్రయాణానికి రెండేళ్లు పూర్తి

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమై నేటికి (డిసెంబర్ 9) సరిగ్గా రెండు సంవత్సరాలు పూర్తయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో.. 2023 డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ప్రారంభించిన ఈ పథకం మహిళా సాధికారతకు గొప్ప మార్గంగా నిలిచింది. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళలకు, ఆర్టీసీ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా అనుహ్య స్పందనను దక్కించుకుంది. తొలి రోజుల్లో …

Read More »

కొత్త డ్వాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్: ఒక్కో సంఘానికి 15 వేలు

అమరావతి,ఐఏషియ న్యూస్: నూతనంగా ఏర్పాటయిన డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రూ.3 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ను ప్రకటించింది.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2 వేల కొత్త డ్వాక్రా సంఘాలకు రూ.15 వేల చొప్పున అందించనున్నారు.ఈ మొత్తాన్ని ఆయా సంఘాల సభ్యులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. సంఘం ఖాతాలోనే నిల్వ ఉంటుంది.సంఘం నిధి పెంచేందుకు,సభ్యుల అవసరానికి అనుగుణంగా అంతర్గతంగా అప్పులు మంజూరు చేసుకునేందుకు, బ్యాంకుల ద్వారా ఎక్కువ మొత్తంలో సంఘానికి రుణం మంజూరయ్యేందుకు రివాల్వింగ్ ఫండ్ ఉపయోగపడుతుంది. త్వరలో సంఘాల ఖాతాల్లో నిర్దేశిత …

Read More »

జస్ట్ రూ.100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్

ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, ప్రక్రియను సులభతరం చేసింది.నామమాత్రపు స్టాంపు డ్యూటీతో రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ నెల 9 నుంచి ప్రారంభమైంది. ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించి సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు జరిగాయని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ధారించిన …

Read More »

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

ముమ్మిడివరం,ఐఏషియ న్యూస్: ముమ్మిడివరంలోని గురుకుల బాలికల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు అమలాపురం డి.ఎస్.పి. టి ఎస్ ఆర్ కే ప్రసాద్ తెలిపారు. జిల్లాలో తీవ్ర సంచలనం రేకెత్తించిన ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం ఆయన మీడియాకు వివరించారు. కాట్రేనికోన మండలంలో ఓ గ్రామంలో బాలిక ఇంటి సమీపంలో నివసిస్తున్న మోకా గిరిబాబు, నేరేడుమిల్లి అర్చనా దేవి ఈనెల 3వ తేదీన హాస్టల్‌కు వెళ్లి.. అక్కడి …

Read More »