ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. భూయజమానుల సమస్యలను పరిష్కరించే దిశగా కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఒకవేళ రైతు ఆధార్ నంబరు వెబ్‌ల్యాండ్‌లో తప్పుగా నమోదైతే సవరణ చేసుకోవడం సులభం. ఇకపై వెబ్‌ల్యాండ్‌లో సవరణ కోసం జేసీ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ సవరణ చేసే బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించనుంది ప్రభుత్వం. తహసీల్దార్లే భూకేటాయింపు, సేకరణ, కోర్టు ఉత్తర్వుల అమలు వంటి బాధ్యతలు చూసుకుంటారు. ఆర్డీవోలకు రీ సర్వే పూర్తయిన తర్వాత గ్రామాల్లో …
Read More »admin
ఎచ్చెర్ల జనసేన శ్రేణులతో ఎమ్మెల్సీ నాగబాబు ముఖాముఖి
ఎచ్చెర్ల,ఐఏషియ న్యూస్: శాసనమండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన శ్రేణులతో సోమవారం ముఖాముఖి మాట్లాడారు.ఎచ్చెర్ల నియోజకవర్గం పిఓసీ ఎస్.విశ్వక్ సేన్ అధ్యక్షతన ఎమ్మెల్సీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, జనసేన బలోపేతం కోసం సమష్టిగా పనిచేయాలని నాగబాబు స్పష్టం చేశారు. ఈ సమావేశంలోఎచ్చెర్ల నియోజకవర్గం నాయకులు,మండల అధ్యక్షులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »అంగన్వాడి కార్యకర్తలకు ఉచిత స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
విశాఖ దక్షిణం,ఐఏషియ న్యూస్: అంగన్వాడీ కార్యకర్తలకు ఉచిత మొబైల్ ఫోన్స్ (5జి టెక్నాలజీ) 12,500 ఖరీదైన మొబైల్ ఫోన్స్ ను సౌత్ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీ కృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా 90 మంది అంగన్వాడీ కార్యకర్తలకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆన్లైన్ కి సంబంధించిన పోషణ ట్రాకర్ బాల సంజీవిని మరింత వేగంగా లబ్ధిదారుల నమోదు, 6 సంవత్సరాల లోపు పిల్లల గ్రోత్ మానిటరింగ్ ఆన్లైన్ వర్క్ చేయడానికి అంగన్వాడీ కార్యకర్తలకు 5జి …
Read More »107 సంవత్సరాల చరిత్ర గల కోడిగుడ్డు మేడ
స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: తెనాలి ప్రాంతంలో కోడిగుడ్డు మేడంటే తెలియనివారుండరు. 107 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ భవనం రాజసానికి ఠీవిగా నిలుస్తోంది. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో 1918లో పారేపల్లి పెదరావమ్మ తన తమ్ముడు పచ్చిపులుసు రాంపుల్లయ్య పేరిట నిర్మించారు.రాజమహల్లా ఉండాలన్న ఆలోచనతో మద్రాస్ నుంచి కార్మికులు, నిపుణులను రప్పించారని, సున్నం, కోడిగుడ్డు సొన, సహజ రంగులను ఇక్కడే గానుగ ఆడించి దానినే సిమెంటుగా వినియోగించారని, విశ్రాంత ఉపాధ్యాయుడు పారేపల్లి భార్గవరామదుర్గాప్రసాద్ వివరించారు. రెండు అంతస్తుల ఈ భవనంలో 12 గదులున్నాయి. ప్రధాన …
Read More »క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన ఫుట్‌బాల్ మ్యాచ్
కప్ దక్కించుకున్న సింగరేణి ఆర్ఆర్-9 టీమ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ స్పోర్ట్స్,ఐఏషియ న్యూస్: ఎన్నో రోజులుగా ఉత్కంఠగా ఎదురుచూసిన ప్రపంచ పుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటినా కెప్టెన్ లియోనెల్ మెస్సీ హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం మైదానంలో క్రీడాభిమానులను ఉర్రూతలూగించింది. మెస్సీ స్టేడియంలోకి అడుగుపెట్టడం నుంచి ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో సింగరేణి ఆర్ఆర్-9 టీమ్ తరఫున ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గోల్ సాధించి హైలైట్‌గా నిలిచారు.ఫుట్‌బాల్ దిగ్గజాలు రోడ్రిగో డి …
Read More »రెండోవిడత ల్యాండ్ పూలింగ్ పై త్రిసభ్య కమిటీ సమావేశం
కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అమరావతి,ఐఏషియ న్యూస్: అమరావతికేంద్రంగాకీలకనిర్ణయాలుజరగుతున్నాయిరైతుల సమస్యల పరిష్కారం పైన ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. రెండో విడత లాండ్ పూలింగ్ కు నిర్ణయం తరువాత త్రిసభ కమిటీ వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. రైతుల పెండింగ్ అంశాల పరిష్కారం పైన కసరత్తు చేస్తోంది. అటు అమరావతిలో లాండ్ పూలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కాగా.. లాండ్ పూలింగ్ కు ముందుకు రాని రైతుల విషయంలో ఏం చేయాలనే అంశం పైన శనివారం త్రిసభ్య కమిటీ చర్చించింది. కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో రైతుల సమస్యల …
Read More »తండ్రి ఆటో కింద పడి కూతురు మృతి
అనకాపల్లి,ఐఏషియ న్యూస్: విశాఖ ఎన్ఏడి నుండి మాకవరపాలెం అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ టెట్ పరీక్ష రాసేందుకు తండ్రి ఆటోలో వెళుతుండగా ఆటో అదుపుతప్పి ఆటోలో ఉన్న ఆటో డ్రైవర్ కుమార్తెసునీత (25) అక్కడికక్కడే మృతి చెందగా. తండ్రి లక్ష్మణరావు స్వల్ప గాయాలయ్యాయి మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసిన అనకాపల్లి ట్రాఫిక్ పోలీసులు. Authored by: Vaddadi udayakumar
Read More »ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా 15 మంది దుర్మరణం
మారేడుమిల్లి,ఐఏషియ న్యూస్: రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తోన్నాయి. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 15 మందికి పైగా ప్రయాణికులు దుర్మరణం పాలైనట్లు సమాచారం. పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ బస్సు అది. అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదానికి గురైంది. చింతూరు- మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడింది.ఈ సమాచారం అందిన …
Read More »జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణ వేళల మార్పు
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖపట్నం-లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12805/12806) రైళ్ల ప్రయాణ వేళల్ని ద.మ.రైల్వే మార్చింది. కొత్త వేళలు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయని జోన్ సీపీఆర్వో ఏ.శ్రీధర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం-లింగంపల్లి(12806)రైలువిశాఖపట్నంలో ఉదయం 6.20కి బయల్దేరి, లింగంపల్లికి రాత్రి 7.15కి చేరుకుంటుంది. లింగంపల్లి-విశాఖపట్నం(12805) రైలు ఉదయం 6.55కి లింగంపల్లి నుంచి బయల్దేరి, విశాఖపట్నంకు రాత్రి 7.50కి చేరుకుంటుంది.ఈ మారిన వేళలను ప్రయాణికులు గమనించాలని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »బ్లూబర్డ్ ఉపగ్రహ ప్రయోగం 21కి వాయిదా
తిరుపతి,ఐఏషియ న్యూస్: ఇస్రో చేపట్టనున్న వాణిజ్య ఉపగ్రహ ప్రయోగం ‘బ్లూబర్డ్’ వాయిదా పడినట్టు తెలిసింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఎల్వీఎం3-ఎం6 రాకెట్ ప్రయోగం ద్వారా బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని తొలుత ఈనెల 17న ప్రయోగించనున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. అయితే రాకెట్ అనుసంధానంఆలస్యం కావడంతో ఈ ప్రయోగం ఈ నెల 21కి వాయిదా పడినట్లు ఇస్రో వర్గాల సమాచారం. షార్‌లోని రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధాన పనులు జరుగుతున్నాయి. అన్నీ సజావుగా సాగితే ఈ …
Read More »
News Website (iasianews.net) I Asia News