admin

తిరుపతి,తిరుమల స్థానికులకు ఈ-డిప్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు

25 నుండి 27 వరకు ఈ-డిప్ నమోదుకు అవకాశం 29వ తేదిన టోకెన్లు కేటాయింపు తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో జనవరి 6,7,8వ తేదిల్లో రోజుకు 5వేల టోకెన్ల చొప్పున తిరుమల,తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాల వారికి స్థానికుల కోటా కింద కేటాయించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.ఈ నేపథ్యంలో ఈనెల 25వ తేది ఉదయం 10 నుండి 27 వ తేది సాయంత్రం 5 …

Read More »

ఆంధ్రప్రదేశ్ లో ఏఐ వైద్యులు అందుబాటులోకి తీసుకువస్తాం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్ బ్యూరో: సీఎం చంద్రబాబు శుక్రవారం విశాఖలో కీలక ప్రకటన చేశారు. విశాఖ కాపులుప్పాడ ఐటీ హిల్స్ వద్ద ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ క్యాంపస్ కు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం కాగ్నిజెంట్ ప్రతినిధులు, ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘త్వరలోనే అందరి ఆరోగ్యానికి డిజిటల్ హెల్త్ రికార్డులతో పాటు ఏఐ డాక్టర్లను కూడా అందుబాటులోకి తెస్తామని, ఆరోగ్యపరంగా ఏం కావాలన్నా ఏఐ డాక్టర్లను అడిగి ముందుకు వెళ్లే పరిస్థితిని తీసుకొస్తామని పేర్కొన్నారు. వాళ్లే వైద్య పరీక్షలు ఆటోమేటిక్ గా చేసుకునే …

Read More »

ఏపీ ఫైబర్ నెట్ కేసు కొట్టేసిన ఏసీబీ కోర్టు

అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి బిగ్ రిలీఫ్ దక్కింది. గత వైసీపీ ప్రభుత్వం సమయంలో ఏపీ ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌లో అవినీతి జరిగిందంటూ ఆయనపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ గా ఆ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా ఈ కేసులో చంద్రబాబుతో పాటు మిగిలిన వారికి క్లీన్‌చిట్‌ ఇచ్చింది.దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.కాగా 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌లో …

Read More »

ఉపాధి హామీ పథకం పేరు మార్చిన కేంద్ర క్యాబినెట్

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఉపాధి హామీ పథకం పేరు మార్చుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ పథకం “పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకం”గా కొనసాగనుంది.సంవత్సరానికి 120 పని దినాలను తప్పనిసరి చేసింది. అంతేకాదు ఈ పథకం అమలుకు రూ.1.51 లక్షల కోట్లు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల ఉపాధి హామీ కూలీలకు మేలు జరగనుంది. ఎక్కువ కూలీ దొరికే అవకాశం ఉంది. Authored by: Vaddadi udayakumar

Read More »

ఉప్పల్‌లో ఫుట్‌బాల్‌ సంబరం..మెస్సీ–సీఎం రేవంత్‌ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్

హైదరాబాద్‌,ఐఏషియ న్యూస్: నగరంలోని ఉప్పల్‌ స్టేడియం శనివారం అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ ఉత్సవానికి వేదికగా మారనుంది. రాత్రి 7 గంటలకు ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ జట్టు – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జట్టు మధ్య ఫ్రెండ్లీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ నిర్వహించనున్నారు. భారత్‌ పర్యటనలో భాగంగా మెస్సీ హైదరాబాద్‌కు రావడం ఫుట్‌బాల్‌ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ప్రపంచ ఫుట్‌బాల్‌లో తనదైన ముద్ర వేసిన మెస్సీని ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించడంతో స్టేడియం పరిసరాల్లో ప్రత్యేక సందడి నెలకొంది.ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌ను వీక్షించేందుకు కాంగ్రెస్‌ …

Read More »

ఇండిగో సంక్షోభం.. దిల్లీలో రూ.1,000 కోట్లు నష్టం

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఇండిగో సంక్షోభంతో దిల్లీలో వ్యాపార,పర్యాటక, పారిశ్రామిక రంగాలకు రూ.1,000 కోట్లు నష్టం వాటిల్లిందని ది ఛాంబర్‌ ఆఫ్‌ ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ వెల్లడించింది. విమాన రాకపోకల్లో అంతరాయం వల్ల వ్యాపారులు, పర్యాటకులు, బిజినెస్‌ ట్రావెలర్స్‌ రాకపోకలకకు అంతరాయం కలిగిందని పేర్కొంది. గత 10 రోజుల్లో దిల్లీ మార్కెట్లలో జనసంచారం దాదాపు 25శాతం తగ్గిందని వివరించింది. దిల్లీ విమానాశ్రయం నుంచి నిత్యం 1.5 లక్షల ప్యాసింజర్లు ప్రయాణిస్తుంటారని అందులో సుమారు 50 వేల మంది వ్యాపారులు, బిజినెస్‌ ట్రావెలర్స్‌ ఉంటారని తెలిపింది. Authored …

Read More »

15లోగా రేషన్ స్మార్ట్ కార్డ్స్ తీసుకొని వాళ్ళు రూ 200 చెల్లించాలి

అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డులు,రేషన్ పంపిణీలో నూతన సంస్కరణలు ప్రవేశపెడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తోంది.క్యూఆర్ కోడ్‌తో కూడిన ఈ రేషన్ కార్డులను ఉచితంగా గత కొద్ది నెలల నుంచి పంపిణీ చేస్తోంది. అయితే కొంతమంది ఈ కార్డులను ఇంకాతీసుకోలేదు. ఆగస్టు నుంచి కార్డులను ఏపీ ప్రభుత్వం ఇస్తుండగా ఇప్పటికీ చాలామంది తీసుకోలేదు. కేవలం వృద్దులు, వికలాంగులకు మాత్రమే రేషన్ డీలర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇంటికెళ్లి ఇస్తున్నారు.ఇప్పటికీ …

Read More »

విద్యా వ్యాప్తి కోసం అనిల్ అగర్వాల్ 21,000 కోట్ల రూపాయల విరాళం

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: బీహార్ నుంచి లండన్ వెళ్లి స్థిరపడిన వైశ్య సామాజిక వర్గానికి చెందిన అనిల్ అగర్వాల్ భారత దేశంలో ఉన్నత విద్యా వ్యాప్తి కోసం 21,000 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు.ఈ డబ్బుతో ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీ కంటే పెద్ద విశ్వవిద్యాలయయాలు స్థాపించి వాటిని నో ప్రాఫిట్ నో లాస్ పద్ధతిలో నడపాలని కోరారు. ఇప్పటివరకు భారతదేశంలో విద్య కోసం ఇచ్చిన విరాళాలలో ఇదే అతిపెద్ద విరాళమని అంటున్నారు. విద్యరంగ అధికారులు. Authored by: Vaddadi udayakumar

Read More »

ప్రభుత్వ వైద్య కళాశాలలుప్రైవేటీకరణ జరగకుండా చర్యలు తీసుకోవాలి

అమరావతి,ఐఏషియ న్యూస్: ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీలో మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో నిర్మించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు నిర్వహిస్తోంది. కోటి సంతకాల సేకరణతో ఈ నెల 18న మాజీ సీఎం జగన్ గవర్నర్ తో భేటీ కానున్నారు. ప్రభుత్వం మాత్రం పీపీపీ విధానం సరైనదిగా వాదిస్తోంది. కాగా, ఈ సమయంలో వైసీపీ మెడికల్ కాలేజీల అంశాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లింది. ఢిల్లీ కేంద్రంగా వైసీపీ తమ ఆందోళన వివరించే ప్రయత్నం చేస్తోంది.ఏపీలో …

Read More »

పెందుర్తిలో 13 ఏళ్ల బాలిక అదృశ్యం

పెందుర్తి(విశాఖపట్నం),ఐఏషియ న్యూస్: విశాఖపట్నం సిటీ, పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ జె ఎన్ ఎన్ యు ఆర్ ఎమ్ హౌస్‌లో నివసించే తాడి సంధ్య (13) అనే బాలిక గత సెప్టెంబర్ 23న తన అత్త నరవ వెంకటలక్ష్మి ఇంటిలో ఉంటూ, సక్రమంగా ఇంటి పనులు చేసుకోవాలని ఆమె మందలించడంతో, అదే రోజు ఉదయం 10.00 నుండి 11.00 గంటల మధ్యలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి బయటికి వెళ్లి ఎక్కడికో వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి రాలేదు. ఇంటి పరిసరాల్లో, బంధువుల …

Read More »