admin

పసుపు కిలో రూ:200 గిట్టుబాటు ధర కల్పించాలి

పసుపు రైతులకు ఉచితంగా ప్రాసెసింగ్ యూనిట్లు పంపిణీ చేయాలి ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ హుకుంపేట,ఐఏషియ న్యూస్: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లోసురేంద్ర, మండల కార్యదర్శి టి క్రిష్ణరావు జీకే మండ పంచాయతీ గడ్డిమర్రి గ్రామంలో ఆదివాసులు పండిస్తున్న పసుపు పంటలను గురువారం పరిశీలించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ఆదివాసి ప్రాంతంలో పండిస్తున్న ఏజెన్సీ బంగారం పసుపు కిలో రూ :200 కొనుగోలు చేస్తే తప్పా రైతులకు గిట్టుబాటురాదన్నారు.ప్రభుత్వం …

Read More »

నేడు,రేపు టెన్త్ ఫీజు చెల్లింపునకు అవకాశం

అమరావతి,ఐఏషియ న్యూస్: పదవ తరగతి పరీక్ష ఫీజుల చెల్లింపునకు శుక్ర, శనివారం వరకు అవకాశం కల్పించినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడి లాగిన్ ద్వారా ఫీజు చెల్లించాలని సూచించారు. తక్కువ వయసున్న విద్యార్థులు వయసు మినహాయింపు ఫీజును బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో చెల్లించవచ్చన్నారు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు కూడా అదే వెబ్ సైట్ నుంచి ఫీజులు కట్టొచ్చని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు చివరి రోజు వరకు వేచిచూడ కుండా వీలైనంత త్వరగా …

Read More »

ఆకవలలలో ఒకరు ఎస్పీ మరొకరు ఏసిపి: పోలీస్ శాఖలో ఒక అద్భుతం

స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: కవలలు ఇద్దరూ సైంటిస్ట్ లు కావడం,ఇద్దరూ డాక్టర్లు కావడం లాంటి అద్భుతాలు ఎక్కువగా సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. కానీ నిజజీవితంలో కూడా అలాంటి అద్భుతాలు జరుగుతుంటాయి. కవలలు ఇద్దరూ ఐపీఎస్ అధికారులు అయిన అద్భుతం ఇది. అరవిందన్ అనే ఐపీఎస్ అధికారి తన కవల సోదరుడు అభినందన్ తో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అదికాస్తా నెటిజన్లని ఆశ్చర్యపరుస్తూ వైరల్ గా మారింది. ఇద్దరూ అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉన్నారు. ఇద్దరూ ఖాఖీ డ్రెస్సులో అదిరిపోయేలా ఫోజు ఇచ్చారు. …

Read More »

ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ప్రకటించిన స్పీకర్ ప్రసాద్

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ అసెంబ్లీలో గతంలో కాంగ్రెస్ లోకి ఫిరాయించిన బీఆర్ఎస్,ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల విషయంలో ఎట్టకేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు.ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలు,ఆయా పార్టీల ప్రతినిధులతో విచారణ నిర్వహించిన స్పీకర్ ఇవాళ తన నిర్ణయం ప్రకటించారు. ఓవైపు సుప్రీంకోర్టు వరుస డెడ్ లైన్లతో ఉరుముతున్న వేళ స్పీకర్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తెల్లం వెంకట్రావు,బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, …

Read More »

అరటిపువ్వు కూర తింటే..అసిడిటీ,హైబీపీకి చెక్ పెట్టొచ్చు

హెల్త్ డెస్క్ ,ఐఏషియ న్యూస్: అరటి పండులో పోషకాలెన్నో వున్నాయి.అరటి పండు కంటే అరటి పువ్వులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా వున్నాయి. అరటిపువ్వు వంటకాలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఒక పాత్ర‌లో కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక అందులో పోపు గింజలు వేసి.. వేగాక పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లి ముక్కలు వేసి వేపుకోవాలి. అందులో కట్ చేసిన అరటి పువ్వు ముక్కల్ని చేర్చుకోవాలి.అందులోనే ఉప్పు, కొద్దిగా ఇంగువ‌, క‌రివేపాకులు, ధ‌నియాల పొడి, కొత్తిమీర‌, ప‌సుపు కూడా చేర్చి.. …

Read More »

ఆఫీసులో అలసిపోతున్నారా? బొప్పాయి ముక్కలు తినండి

హెల్త్ డెస్క్,ఐఏషియ న్యూస్: ఆఫీసులో అలసిపోతున్నారా? ఒత్తిడి వేధిస్తుందా? అయితే ఒక కప్పులో బొప్పాయి పండ్లను ఇంటి నుంచి తెచ్చుకుని తినాల్సిందే అంటున్నారు. ఆరోగ్య నిపుణులు. లేదంటే ఇంటికెళ్లిన వెంటనే కాఫీలు, టీ తీసుకోకుండా ఒక కప్పు బొప్పాయి ముక్కలను తీసుకోవడం చేయాలి. బొప్పాయిలో వుండే విటమిన్ సి.. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. అంతేగాకుండా విటమిన్ సి.. ఒత్తిడిని కలిగించే హార్మోన్లను నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బొప్పాయి మధుమేహ వ్యాధిగ్రస్థులకు మేలు చేస్తుంది.మధుమేహం రాకుండా వుండాలంటే రోజూ ఒక కప్పు బొప్పాయి …

Read More »

20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సర్వేయర్ శ్రీరాములు

పుంగనూరు,ఐఏషియ న్యూస్: చిత్తూరు జిల్లా పుంగనూరు తహసిల్దార్ కార్యాలయంలో బుధవారం రాత్రి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 20 వేలు లంచం తీసుకుంటూండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా విలేజ్ సర్వేయర్ శ్రీరాములు పట్టుబడ్డాడు.మంగళం పంచాయతీలో 8గుంటల భూమి సర్వే కొరకు దరఖాస్తు చేసుకున్న ఉమాశంకర్,15 రోజుల క్రితం మంగళం సచివాలంలో సర్వే కొరకు దరఖాస్తు చేసుకున్నారు. సర్వే సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.50 వేలు ఒప్పందం కుదుర్చుకుని రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.నిందితుడు వద్ద నుంచి నగదు …

Read More »

శీతాకాలం విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

హైదరాబాద్‌,ఐఏషియ న్యూస్: శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం హైదరాబాద్‌ చేరుకున్నారు. హకీంపేటలోని ఎయిర్‌ఫోర్స్‌ శిక్షణ కేంద్రానికి ప్రత్యేక విమానం ద్వారా చేరుకున్న ఆమెకు తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క తదితరులు స్వాగతం పలికారు. 18న నిలయంలో విశ్రాంతి తీసుకుంటారు. 19న రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు హాజరవుతారు. 20న గచ్చిబౌలిలో బ్రహ్మకుమారీస్‌ శాంతిసరోవర్‌ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొంటారు. 21న నిలయంలో నిర్వహించే పౌరుల భేటీ, ఎట్‌ హోమ్‌లో …

Read More »

మహిళా పోలీసు స్టేషన్ సందర్శించిన సిపి డా.శంఖబ్రత బాగ్చి

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: నగరంలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉంచుతూ నగరం మొత్తం ప్రశాంతముగా ఉండేలా నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల నందు సిపిడాక్టర్.శంఖబ్రత బాగ్చి రెండవ విడత ఇన్స్పెక్షన్ లో భాగముగా బుధవారం మహిళా పోలీసు స్టేషన్ ఆకస్మిక తనికి నిర్వహించారు. పోలీసు స్టేషన్ ను సందర్శించిన సిపి పోలీస్ అధికారులు, సిబ్బంది విధులను సమీక్షించి, సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్న సీపీ. స్టేషన్ రికార్డులు అన్నీ సక్రమముగా ఉన్నదీ లేనిదీ పరిశీలించి, సంబంధిత అధికారులకు …

Read More »

“Nuvvu Naaku Nachav” Re-release in 4K worldwide on January 1, 2026

24 years ago, on September 6, 2001, a magic happened on the Telugu screen. That was the movie “Nuvvu Naaku Nachav”. The audience was satisfied enough to eat a feast. Even after watching this movie many times, this is content with a repeat value that still does not get bored. That is why the 2026 New Year is ready for …

Read More »