బీహార్ ఎన్నికలవేళ తేల్చి చెప్పిన సుప్రీం కోర్ట్ న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: మన దేశంలో ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో కీలకమైన ఆధార్ కార్డు ఎన్నికల్లో ఓటు హక్కు పొందేందుకు చెల్లుబాటయ్యే పత్రాల్లో ఒకటిగా ఎప్పటి నుంచో ఉంది. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆధార్ ను ఓటరుగా నమోదు అయ్యేందుకు తగిన పత్రంగా ఎన్నికల సంఘం గుర్తించకపోవడంతో వివాదం మొదలైంది. దీనిపై ఇప్పటికే ఈసీకి అక్షింతలు వేసిన సుప్రీంకోర్టు.. ఆధార్ ను తప్పనిసరిగా గుర్తింపు కార్డుగా స్వీకరించాల్సిందేనని ఇవాళ తేల్చిచెప్పేసింది.బీహార్ లో ప్రత్యేక ఓటరు …
Read More »admin
అంగరంగ వైభముగా సింహాద్రినాధుని నిత్య కల్యాణం
సింహాచలం,ఐఏషియ న్యూస్: ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి నిత్య కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణములో పాల్గొన్న భక్తుల, గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతోకార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు …
Read More »శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మహా పూర్ణాహుతితో ముగిసిన శ్రావణలక్ష్మి పూజలు
విశాఖ దక్షిణం,ఐఏషియ న్యూస్: ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి ఆలయంలో నెలరోజులు పాటు ఘనంగా నిర్వహించిన శ్రావణ లక్ష్మి పూజలు శనివారం నిర్వహించిన మహా పూర్ణహుతితో ఘనంగా ముగిసాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరణ చేశారు.అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి కే. శోభరాణి, వేద పండితులు,అర్చకులు,ఉభయదాతలు, సిబ్బంది పాల్గొన్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »మూడు నెలల్లోగా ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి
రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీలో ఉద్యోగులకు చెల్లించాల్సి బకాయిల పైన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరాయి. ఉద్యోగులు, పెన్షర్ల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేసాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ ప్రకటించాలని,12వ పిఆర్సీ కమీషన్ తక్షణమే నియమించాలని కోరుతున్నాయి. తక్షణమే పెండింగ్ డిఏలు విడుదల చేయాలని సంఘాల నేతలు కోరారు. మూడు నెలల్లోగా వీటి చెల్లింపు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని సంఘాలు …
Read More »ఏపీ డీజీపీకి మానవహక్కుల సంఘం నోటీసులు
తిరుపతి డిప్యూటీ మేయర్ ఉపఎన్నిక సందర్భంలో ఘటనపై నోటీసులు వైసీపీ ఎంపీ గురుమూర్తి ఫిర్యాదుపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ దర్యాప్తు నివేదిక అందించాలని డీజీపీకి ఆదేశాలు అమరావతి,ఐఏషియ న్యూస్: తిరుపతి డిప్యూటీ మేయర్ ఉపఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలపై ఏపీ డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) నోటీసులు జారీ చేసింది. ఎస్వీయూ క్యాంపస్‌లో జరిగిన హింసపై ఆరువారాల్లో నివేదిక సమర్పించాలని డీజీపీని ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశించింది.తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా రౌడీ మూకలు తమపై దాడి చేశారని,నిందితుల పేర్లతో …
Read More »భారత్ లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్ లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్ ను ప్రకటించారు. ఇరుదేశాల మధ్య టారిఫ్లకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం కీలకంగా మారింది. ప్రస్తుతం సెర్గియో గోర్ వైట్హౌస్లో పర్సనల్ డైరెక్టర్ గా ఉన్నారు.త్వరలోనే బాధ్యతలు చేపడతారు. Authored by: Vaddadi udayakumar
Read More »సెప్టెంబర్ 8 బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సారథ్యం శోభాయాత్ర విజయవంతం చేయాలి
బిజెపి అనకాపల్లి జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు సుజాతనగర్(విశాఖపట్నం,ఆంధ్రప్రదేశ్),ఐఏషియ న్యూస్: అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో సెప్టెంబర్ 8న జరగబోయే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ “సారథ్యం శోభాయాత్ర” విజయవంతం చెయ్యాలని కోరుతూ పెందుర్తి బిజెపి నాయకులు,జీవీఎంసీ 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు, బిజెపి 95,97వ వార్డుల అధ్యక్షులు చిక్కాల సతీష్ ల ఆధ్వర్యంలో బిజెపి 95,97వ వార్డుల పదాధికారులు,బిజెపి కార్యకర్తలు,అభిమానులతో ముఖ్య సమావేశం చినముషీడివాడలో శనివారం నాడు జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అనకాపల్లి బిజెపి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు పాల్గొని రాష్ట్ర అధ్యక్షులు …
Read More »పులివెందులలో ప్రారంభమైన మెగా ఉచిత క్యాటరాక్ట్ సర్జరీ క్యాంప్
పులివెందుల,ఐఏషియ న్యూస్: వైయస్సార్ కడప జిల్లా పులివెందులలో వైఎస్ఆర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు శంకర నేత్రాలయ మేసు పుట్టపర్తి కుంబు తిరుమల రెడ్డి (యూఎస్ఏ) సంయుక్త నిర్వహణలో మెగా ఉచిత క్యాటరాక్ట్ సర్జరీ క్యాంపు ప్రారంభమైంది.కంటిశుక్లం స్క్రీనింగ్ 7 రోజుల పాటు జరుగుతుంది. ఈ ఉచిత వైద్య శిబిరంలో కంటి రోగులను పరీక్షించి కంటి శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి మొబైల్ ఐ సర్జరీ బస్సులో ఈనెల 26 నుంచి 30 వరకు ఉచిత కంటిశుక్లం శస్త్రచికిత్స …
Read More »150 మంది విద్యార్థులకు ఉచితంగా ఐడి కార్డుల పంపిణీ
పామూరు,ఐఏషియ న్యూస్: పామూరు మండలం మారకొండాపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 150 మంది విద్యార్థులకు పాఠశాలలో గణితోపాధ్యాయునిగా పనిచేయుచున్న అట్లా వెంకటేశ్వర్లు సమకూర్చిన 7,000 ఆర్థిక సహకారంతో తయారు చేసిన స్టూడెంట్ఐ డికార్డులను ఉచితంగా శుక్రవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు ఐడికార్డులను ప్రధానోపాధ్యాయులు చావా శ్రీనివాసులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు కె. భాస్కరరెడ్డి,అట్లా వెంకటేశ్వర్లు,ఎస్.చైతన్య,వి.రమేష్ బాబు,ఎం.విజయ,డి.శ్రీలక్ష్మి,వి.జానకి జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »దొంగ మస్తర్లతో ఉపాధి హామీలో నిధులు గోల్ మాల్
అనకాపల్లి /బుచ్చయ్యపేట,ఐఏషియ న్యూస్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) కింద కూలీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. కానీ బుచ్చయ్యపేట మండలంలో ఈ నిధులు ఖర్చు కాగితాల పైనే కనిపిస్తున్నాయి కానీ పనులు జరిగాయంటూ అధికారులు, సాంకేతిక సిబ్బంది రికార్డులు చూపుతున్నా నేలమీద మాత్రం వాస్తవంగా కంటికి కనిపించడం లేదు.కోట్లు ఖర్చు చేశామని పేపర్లలో చూపిస్తుంటే, కూలీలకు మాత్రం ఒక్క రూపాయి ప్రయోజనం అందకపోవడం తో ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం చెందుతున్నారు. అరకొర పనులు చేసి, …
Read More »