admin

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం “కీర్తి పురస్కారానికి” ఎంపికైన రాధిక మంగిపూడి

విజయనగరం,ఐఏషియ న్యూస్: విజయనగర సాహితీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఈతరం రచయిత్రి రాధిక మంగిపూడి, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారానికి ఎంపిక అయ్యారు. 2023 సంవత్సరానికిగాను వివిధ రంగాలలో ప్రసిద్ధిగాంచిన 48 మందిని ఎంపిక చేసినట్లుగా, వారిలో హాస్య రచనల విభాగంలో రాధిక ఎంపికయ్యారని తెలుగు విశ్వవిద్యాలయం వారు గురువారం పత్రికా ప్రకటనలో తెలిపారు. రాధిక మంగిపూడి 2016లో సింగపూర్ లో తన సాహితీ ప్రస్థానం ప్రారంభించి ఇప్పటివరకు 3 కథా సంపుటలు,2 కవితా సంపుటలు,2 పద్య శతకాలు, ఒక వ్యాస సంపుటి …

Read More »

గుంతలు పడిన రోడ్లపై టోల్ వసూలు చేయకూడదు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్:గుంతలు పడిన, డ్రైవింగ్ చేయడానికి అనువుగా లేని, ట్రాఫిక్ జామ్ అయిన రహదారులపై వాహనాదారులను టోల్ చెల్లించాలని బలవంతం చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. త్రిస్సూర్ జిల్లాలోని పలియక్కర ప్లాజా వద్ద టోల్ వసూలును నాలుగు వారాలపాటు నిలిపివేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అంజరియాతో కూడిన ధర్మాసనం భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎస్హెచ్ఏఐ), టోల్ వసూల్ సంస్థ దాఖలు …

Read More »

ఏపీ క్యాబినెట్ లో 33 నిర్ణయాలు ఆమోదం

సచివాలయాల్లో 2,778 పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్  ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీ రాజధాని అమరావతిలో గురువారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ ముందుకు వచ్చిన పలు ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించి ఆమోదముద్ర వేశారు. కేబినెట్ నిర్ణయాల్లో అమరావతి రాజధానిలో భూకేటాయింపులు, సచివాలయాల్లో ఖాళీల భర్తీ, అధికార భాష సంఘం పేరు మార్పు వంటి పలు అంశాలు ఉన్నాయి.ఇవాళ ఏపీ కేబినెట్ మొత్తం 33 నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ఇందులో అమరావతిలోని 29 …

Read More »

లంచం తీసుకొంటూ ఎసిబికి పట్టుబడ్డ సింగరాయి సచివాలయం వీఆర్వో సత్యవతి

వేపాడ (విజయనగరం),ఐఏషియ న్యూస్: విజయనగరం జిల్లా, వేపాడ మండలం, సింగరాయి గ్రామానికి చెందిన గేదల భాస్కరరావు తాత పేరిట సింగరాయి, గుడివాడ గ్రామాలలో 6 ఎకరాల వ్యవసాయ భూమి వున్నది.అయితే ఆ భూమిని గేదల భాస్కరరావు తండ్రి పేరిట,అతని బాబాయి పేరిట 1బి అడంగల్ లో మ్యుటేషన్ చేసి, వారివురి పేరున పట్టాదారు పాస్ పుస్తకాల కోసం వీఆర్వో సచ్చిపోతే సంప్రదించారు. ఈ నేపథ్యంలో పాస్ పుస్తకాలు తయారు చేసి ఇవ్వడానికి సింగరాయి గ్రామ సచివాలయం రెవిన్యూ అధికారి శ్రీమతి కోతన సత్యవతి సదరు …

Read More »

ఆంధ్రప్రదేశ్లో రెండు కొత్త ఎయిర్ పోర్ట్ లకు క్యాబినెట్ ఆమోదం

అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎయిర్‌పోర్టులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో చిత్తూరు జిల్లాలోని కుప్పం, నెల్లూరు జిల్లాలోని దగదర్తిలో కొత్త విమానాశ్రయాలపై చర్చించారు.కుప్పం, దగదర్తిలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు విమానాశ్రయాలను పీపీపీ (ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్‌షిప్) విధానంలో అభివృద్ధి చేస్తారు. దీనికి సంబంధించిన ముయిసాదా ఆర్‌ఎఫ్‌పీని కేబినెట్ ఆమోదించింది. భూసేకరణ, యుటిలిటీల బదిలీ కోసం హడ్కో నుండి రుణం తీసుకుంటారు. విమానాశ్రయానికి కావలసిన మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. దీనికి మౌలిక …

Read More »

జైల్లో ఉన్న ప్రధాని,సీఎం,మంత్రుల తొలగింపు బిల్లుపై అమిత్ షా వివరణ

న్యూఢిల్లీ, ఐఏషియ న్యూస్: జైల్లో ఉన్నవారు ప్రధాని, సీఎం, మంత్రులుగా కొనసాగకుండా కేంద్రం కొత్త బిల్లు తీసుకువచ్చిన సంగతి విదితమే. అయితే ఈ బిల్లుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హెూంమంత్రి అమిత్ షా ఈ కొత్తబిల్లుపై సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. రాజకీయాల్లో నైతిక విలువలను పునరుద్ధరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక బిల్లు తెచ్చిందని స్పష్టం చేశారు. అరెస్ట్ అయి జైల్లో ఉన్న వ్యక్తులు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులు వంటి ఉన్నత రాజ్యాంగ పదవుల్లో కొనసాగకుండా …

Read More »

శ్రీశైల మల్లన్నకు హుండీల ద్వారా 4 కోట్ల 51 లక్షల 62వేలు ఆదాయము లభ్యం

శ్రీశైలం,ఐఏషియ న్యూస్:  శ్రీశైల దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి గత 27 రోజులు సంబంధించి రూ.4,51,62,522 నగదు లభించిందని ఈఓ ఎం శ్రీనివాసరావు  తెలిపారు. అంతేకాకుండా హుండీలో 164 గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారు, 5 కేజీల 840 గ్రాముల వెండిలభించాయని వివరించారు.598 – యుఎస్ఏ డాలర్లు, 100 – న్యూజిలాండ్ డాలర్లు, 100– సింగపూర్ డాలర్లు, 10 – ఇంగ్లాండు ఫౌండ్స్, 100 – ఈరోస్, 300 – ఓమన్ బైసా, 20 – కెనడా డాలర్లు, …

Read More »

ఉచిత ఆర్‌టీసీ బ‌స్సు సౌక‌ర్యం తిరుమ‌ల కొండ పైవ‌ర‌కు పొడిగింపు

ఆర్టీసీ చైర్మన్ కొన‌క‌ళ్ల నారాయ‌ణరావు తిరుమల,ఐఏషియ న్యూస్: ఏపీలో ‘స్త్రీశ‌క్తి’ పేరుతో ఉచిత ఆర్‌టీసీ బ‌స్సు సౌక‌ర్యంఈనెల 15 నుంచి ప్రారంభించింది.ఈ ప‌థకానికి అపూర్వ స్పంద‌న వ‌స్తుంద‌న్న ఏపీఎస్ఆర్‌టీసీ ఛైర్మ‌న్ కొన‌క‌ళ్ల నారాయ‌ణరావు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకుఇప్పుడు తిరుమ‌ల కొండ‌ పైవర‌కు కూడా ఈ సౌక‌ర్యం వ‌ర్తింపు చేశారు.అయితే ఘాట్ రోడ్డు కార‌ణంగా సిటింగ్ వ‌ర‌కే అనుమ‌తి ఇచ్చామని ఆర్టీసీ చైర్మన్ కొన‌క‌ళ్ల నారాయణరావు వెల్లడించారు. Authored by: Vaddadi udayakumar

Read More »

ముఖ్యమంత్రి అయిన ఉపేక్షించేది లేదు: పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

అమరావతి,ఐఏషియ న్యూస్: శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ అధికారులపై దాడులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించాయి. ఈ ఘటనపై అటవీ శాఖ సిబ్బంది స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలు కూడా సీరియస్‌గా స్పందించారు.అటవీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తన అనుచరులతో కలిసి వారిపై దాడి చేశారన్నారు. అంతేకాకుండా, వారిని వాహనాల్లో బంధించి, రాత్రంతా రెండు గంటల పాటు శ్రీశైలం …

Read More »

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు 150 కోట్లు మంజూరు

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ఆసియాలోనే అతి పెద్ద గిరిజన ఉత్సవంగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వచ్చే ఏడాది, 2026 జనవరిలో ఘనంగా జరగనుంది. ఈ జాతరను తెలంగాణ కుంభమేళా అని కూడా పిలుస్తారు. ఈ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఈ జాతర నిర్వహణతో పాటు శాశ్వత నిర్మాణాల కోసం గిరిజన సంక్షేమ శాఖ ఏకంగా రూ. 150 కోట్లు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా …

Read More »