బెంగళూరు,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం పదో తరగతి,ఇంటర్మీడియట్‌లో ప్రతి సబ్జెక్ట్‌లో కనీసం 35 మార్కులు వస్తే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. అయితే, కర్ణాటక ప్రభుత్వం 35 మార్కుల పాస్ నిబంధనలను తాజాగా తొలగిస్తూ మార్పులు చేసింది.2025-26 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి,ఇంటర్ పరీక్షల మూల్యాంకన విధానంలో కొత్త నిబంధనలను అమలు చేయనుంది.ఈ ముసాయిదా నిబంధనల్లో రెండు కీలక సూచనలు ప్రకటించింది.ఒకటి పాస్ మార్కులను తగ్గించడం,రెండు అంతర్గత మూల్యాంకన (ప్రాక్టికల్స్) మార్కులను పాస్ మార్కులకు కలపడం. పదవ తరగతి పరీక్షలలో మొత్తం మార్కులలో కనీసం 33 …
Read More »admin
ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త
ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ వెల్లడి ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళలకు ఉచిత బస్సు పథకంపై క్లారిటీ వచ్చేసింది.ఆగస్ట్ 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పించనున్న సంగతి తెలిసిందే. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని తొలుత జిల్లాలకే పరిమితం చేయాలని …
Read More »సౌత్ కొరియా ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ సిల్వర్ విజేతగా శివకోటి క్షేత్ర
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: సౌత్ కొరియాలో ఈనెల 21వ తేదీ నుంచి జరుగుతున్న 20వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో విశాఖ క్రీడాకారిని శివ కోటి క్షేత్ర సిల్వర్ మెడల్ సాధించారు. ఈమె నగరానికీ చెందిన డి.దినేష్ తో కలిసి ఫెయిర్ స్కేటింగ్ పోటీల్లో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించారు. ఈమె గతంలో చైనాలో జరిగిన 19వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ పోటీల్లో కూడా సిల్వర్ మెడల్ సాధించారు. ఇప్పుడు మరల తాజాగా సిల్వర్ మెడల్ సాధించిన సందర్భంగా పలువురు ఆమెను అభినందించారు. …
Read More »సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన సూపర్ సక్సెస్
ఏపీకి తిరుగు ప్రయాణమైన సీఎం చంద్రబాబు సింగపూర్,ఐఏషియా న్యూస్: పెట్టుబడులను ఆకర్షించటం, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు చేపట్టిన సింగపూర్ పర్యటన విజయవంతంగా పూర్తయ్యింది. మంత్రులు నారా లోకేష్ , పి.నారాయణ, టీజీ భరత్ సహా ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి సింగపూర్ లో నాలుగు రోజుల పాటు అవిశ్రాంతంగా వివిధ సమావేశాలు, రౌండ్ టేబుల్ చర్చల్లో పాల్గొన్నారు. సింగపూర్ లోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను సందర్శించి వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు వీలుగా అధ్యయనం చేశారు. పర్యటనలో మొత్తం 26 కార్యక్రమాలకు …
Read More »శ్రీవారికి రూ.2.4 కోట్ల విలువగల బంగారు శంఖం,చక్రం విరాళం
తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి సుమారు రూ.2.4 కోట్ల విలువ గల బంగారు శంఖం, చక్రాన్ని విరాళంగా సమర్పించారు.చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధులు మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపం వద్ద సుమారు 2.5 కిలోల బరువుతో కూడిన శంఖం,చక్రాన్ని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. అనంతరం అదనపు ఈవో దాతలను శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారికి భక్తులు అందించిన బంగారు శంఖం,చక్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. Authored by: Vaddadi udayakumar
Read More »క్యూఆర్ కోడ్ తో కొత్తరేషన్ కార్డులు మంజూరు
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి ఆగస్టు 25న కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ఎదురుచూస్తున్న లబ్దిదారులకు ప్రభుత్వం ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పాత రేషన్ కార్డుల జారీ స్ధానంలో అత్యాధునిక ఫీచర్లతో రేషన్ కార్డులు తీసుకొస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా వాటి జారీ తేదీని ఖరారు చేసింది. ఈ వివరాలను ఇవాళ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ వెల్లడించారు.ఏపీలో త్వరలో …
Read More »పెట్టుబడులు పెట్టండి…పేదలకూ సాయం చేయండి
ఏపీ-సింగపూర్ స్టార్టప్ ఫెస్టివల్ నిర్వహిస్తాం విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు రండి ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరమ్ రోడ్ షోలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలపై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియన్యూస్: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ఎంపిక అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆ పెట్టుబడులు కూడా అత్యంత భద్రంగా ఉంటాయని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. ఈ ఏడాది నవంబర్ లో విశాఖలో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా ఏపీ- సింగపూర్ బిజినెస్ ఫోరమ్ తరపున రోడ్ …
Read More »ఎస్బిఐ బ్యాంకులో భారీ దోపిడీ
38 లక్షల నగదు,10 కేజీల బంగారం చోరీ తూముకుంట(శ్రీ సత్య సాయి జిల్లా),ఐఏషియ న్యూస్: శ్రీసత్యసాయి జిల్లాలోని తూముకుంట పారిశ్రామికవాడలో ఎస్బీఐ బ్యాంకులో ఆదివారం రాత్రి దుండగులు భారీ దోపిడీ చేశారు.కిటికీ కోసి లోనికి వెళ్లి సీసీ కెమెరా వైర్లు కట్ చేసి, లాకర్ తాళాలు విరిచి రూ.38 లక్షలు, 10 కేజీల బంగారం ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం బ్యాంక్ సిబ్బంది బ్యాంకు తెరిచి బ్యాంకులో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించారు. చోరీ సంఘటనపై పోలీసు అధికారులకు ఫిర్యాదు సంఘటనా స్థలాన్ని డిసిపిమహేశ్, ఎస్ …
Read More »బాలాపూర్ లోని ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: బాలాపూర్ లోని ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారు జామున అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం. షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. Authored by: Vaddadi udayakumar
Read More »రిజిస్ట్రేషన్ ప్రక్రియలోనే ఆస్తి పన్నుల పేరు మార్పు
ఆగస్టు 1 నుంచి ప్రక్రియ ప్రారంభం ఆస్తి పన్ను పేరు మార్పు కై జీవీఎంసీ కి దరఖాస్తులు అవసరం లేదు జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి విశాఖపట్నం,ఐఏషియ న్యూస్ బ్యూరో: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆస్తులు రిజిస్ట్రేషన్ జరిగే ప్రక్రియలోనే ఆస్తి పన్నుల పేరు మార్పు జరిపే విధానాన్ని ప్రజల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించిందని జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి పేర్కొన్నారు. సోమవారం ఆయన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే …
Read More »