admin

గూగుల్ మ్యాప్స్ ద్వారా “ఆర్టీసీ బస్ టికెట్ల” బుకింగ్

ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణీకుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ బుకింగ్ విధానం మరింత సులభతరం చేసేలా మార్పులు తెస్తోంది. ఇప్పటికే ఉన్న విధానాలతో పాటుగా కొత్తగా గుగూల్ మ్యాప్స్ ద్వారా టికెట్ బుకింగ్ కు అవకాశం కల్పిస్తోంది. వాట్సప్ ద్వారా టికెట్ రిజర్వేషన్ విధానం అందుబాటులోకి తెచ్చింది. గుగూల్ మ్యాప్స్ లో అన్ని బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. దీని ద్వారా కావాల్సిన సర్వీసులో టికెట్ బుక్ చేసుకొనేలా వెసులుబాటు అందుబాటులోకి తీసుకొచ్చారు.ప్రయాణీకులకు ప్రస్తుతం …

Read More »

అత్తను సజీవదహనం చేసిన కోడలు

పెందుర్తి(విశాఖపట్నం),ఐఏషియ న్యూస్: అత్తను కుర్చీలో కాళ్లతో కట్టి కళ్లకు గంతలు కట్టి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన అమానవీయ సంఘటన విశాఖ జీవీఎం 98వ వార్డు పరిధిలోగల అప్పన్నపాలెంలోజరిగింది.ఈ సంఘటనపై శనివారం సాయంత్రం వెస్ట్ ఎసిపి పృథ్వీరాజ్, సీఐ కెవి సతీష్ కుమార్ తో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తెలియజేసిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.అప్పన్నపాలెంలోని జయంతి కనకమహాలక్ష్మి(66), కుమారుడు సుబ్రహ్మణ్య శర్మ, కోడలు లలిత, వారి పిల్లలతో వర్షిణి అపార్టమెంట్‌లో నివసిస్తున్నారు.శుక్రవారం ఉదయం సుబ్రహ్మణ్య శర్మ బయటకు వెళ్లగా అదే …

Read More »

అమెరికాలో ఏపీ యువతీ అనారోగ్యంతో మృతి

వాషింగ్టన్,ఐఏషియ న్యూస్: ఎన్నో కలలతో అమెరికా వెళ్లిన ఆ యువతిని అనారోగ్యం కబలించింది. యువతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులకు గుండెకోతను మిగిల్చింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ చిన్నారి లేదన్న వార్త తెలియడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏపీలోని బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన యార్లగడ్డ రామకృష్ణ, నాగమణి దంపతుల కుమార్తె అయిన రాజ్యలక్ష్మి(23) విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. 2023లో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లింది. ఇటీవల …

Read More »

పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్న ఇద్దరు నిందితులకు జైలు శిక్ష విధించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: పాకిస్తాన్ తో సంబంధాలకు సంబంధించి విశాఖపట్నం నేవీ గూఢచర్యం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు మరో ఇద్దరు నిందితులకు జైలు శిక్ష విధించింది. విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టు ఇద్దరు నిందితులకు 5 సంవత్సరాల 10 నెలల జైలు శిక్షను,ఐదు వేల రూపాయల జరిమానా విధించింది.దీనితో ఈకేసులో ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు నిందితులను దోషులుగా నిర్ధారించి శిక్ష విధించినట్లు ఎన్‌ఐఏ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. Authored by: Vaddadi udayakumar

Read More »

అనంత్ నాగ్ లో పక్షి ఢీకొనడంతో లోకో పైలట్ కు గాయాలు: ప్రయాణికులందరూ సురక్షితం

అనంత్ నాగ్,ఐఏషియ న్యూస్: బిజ్బెహారా-అనంత్ నాగ్ మధ్య శనివారం ఉదయం లోకోమోటివ్ అద్దంను డేగ ఢీకొనడంతో రైలు పైలట్ కు స్వల్ప గాయాలు అయ్యాయి.గాయపడిన పైలట్ శ్రీ విశాల్ కు అనంత్ నాగ్ రైల్వే స్టేషన్లో ప్రథమ చికిత్స అందించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.తనిఖీ కోసం రైలును కొద్దిసేపు నిలిపివేసి, తర్వాత రైలు ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడానికి రైల్వే అధికారులు అనుమతి ఇచ్చారు.ఈ ప్రమాదంలో ప్రయాణికులకి ఎటువంటి నష్టం జరగలేదని రైల్వే అధికారులు పేర్కొన్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నేతలు

            హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు,ఇతర ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,పీసీసీ అధ్యక్షుడు,ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,కార్పొరేషన్ చైర్మన్లు,ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని,ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు.శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు …

Read More »

బ్యాంకుల దగ్గర వృద్ధులారా జర జాగ్రత్త: వృద్ధుని ఏమార్చి 3 లక్షల కొట్టేసిన కేటుగాళ్లు

బాపట్ల,ఐఏషియ న్యూస్: బాపట్ల జిల్లా ఇంకొల్లుకు చెందిన 75 ఏళ్ల వృద్దుడు చిలంకూరి కాంతయ్య ఇంకొల్లులోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తాను తాకట్టు పెట్టుకున్న బంగారు నగలను విడిపించుకోవాలని వచ్చాడు.అందుకు బ్యాంకులో కట్టాల్సిన 3 లక్షల 90 వేల రూపాయలు తీసుకుని బ్యాంకులోకి వెళ్లాడు.బ్యాంకు అధికారులు మరో 10 వేల రూపాయలు వడ్డీ అయిందని, మొత్తం 4 లక్షల రూపాయలు చెల్లించాలని సూచించారు. దీంతో మరో 10 వేల రూపాయలు ఇంటికి వెళ్లి తీసుకురావడానికి తన సైకిల్‌పై బయలుదేరేందుకు సిద్దమయ్యాడు.తన వెంట తీసుకొచ్చిన 3 …

Read More »

కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: కింగ్ జార్జి ఆసుపత్రిలో అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. విశాఖపట్నంలో రేడియాలజిస్టులు, రేడియోగ్రాఫర్లు ఉత్సాహంగా పాల్గొని ఎక్స్రే ఆవిష్కర్త డాక్టర్ రాంట్జెన్ కి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేడియాలజిస్టుల సంఘ అధ్యక్షులు డాక్టర్ సురేష్ మాట్లాడుతూ ప్రజల్లో రేడియాలజీ సేవల పట్ల అవగాహన తీసుకురావాలన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన కేజీహెచ్ పర్యవేక్షణాధికారి డాక్టర్ వాణి సందేశాన్నిస్తూ ప్రజల నుండి రేడియాలజీ సేవల కోసం ఎంతో ఒత్తిడితో కూడిన డిమాండ్ ఉన్నప్పటికీ కేజీహెచ్ లో మంచి సేవలు అందిస్తున్నారని హర్షం …

Read More »

Hindus of DFW Hosts Annual Diwali – Sparkle of Joy Civic Reception Civic Leaders, Interfaith Partners, and Dignitaries from India and New York Gather to Celebrate Unity and Service

The Annual Diwali – Sparkle of Joy Civic Reception, hosted by Hindus of DFW, brought together a distinguished gathering of civic leaders, Hindu American community representatives, interfaith partners, and international dignitaries for an evening of cultural celebration, civic engagement, and shared purpose. Held in Dallas, the event welcomed Mayors, Mayor Pro Tems, and Council Members from over 15 cities across …

Read More »

604 బస్సులపై కేసులు…102 బస్సులు సీజ్

ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: కర్నూలు ఘటన తర్వాత కర్ణాటక ప్రభుత్వం ప్రైవేట్ బస్సు భద్రతపై కఠిన చర్యలు తీసుకుంది.12 బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహించి, అత్యవసర నిష్క్రమణ, అగ్నిమాపక యంత్రం వంటి భద్రతా లక్షణాలను పరిశీలించారు. 4,452 బస్సులను తనిఖీ చేసి, 604పై కేసులు నమోదు చేయగా, 102 బస్సులు సీజ్ అయ్యాయి.అక్టోబర్ 24న హైదరాబాద్ నుండి బెంగళూరు వస్తున్న ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన ఏసీ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు సజీవ దహనమైన విషయం తెలిసిందే. …

Read More »