admin

హుస్సేన్‌సాగర్‌ లో దూకి రెండేళ్ల కుమార్తెతో తల్లి ఆత్మహత్య

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ఓ వివాహిత క్షణికావేశంలో తన రెండేళ్ల కుమార్తెతో కలిసి హుస్సేన్‌సాగర్‌ లో దూకి ఆత్మహత్య చేసుకుంది.కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వివాహిత తన రెండేళ్ల కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. పాతబస్తీకి చెందిన పృథ్విలాల్ వ్యాపారం చేస్తుండగా ఆయన భార్య కీర్తిక అగర్వాల్ (28) చార్టెడ్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. వీరికి బియ్యారా అనే రెండేళ్ల కుమార్తె ఉంది. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో.. కీర్తిక గత ఏడాదిన్నరగా తన కుమార్తెతో కలిసి బహదూర్‌పురలో ఉన్న తన తల్లిదండ్రుల వద్దే …

Read More »

మహిళా వరల్డ్ కప్ క్రికెటర్లతో ప్రధాని మోడీ భేటీ

        న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు బుధవారం ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ఆయన నివాసానికి మహిళల ప్రపంచ కప్ ఆడిన క్రికెటర్లతో భేటీ అయ్యారు. వరల్డ్ కప్ టైటిల్ విజయంపై ప్రధాని మోడీ క్రికెటర్లను అభినందించారు.అదే సమయంలో వరుసగా మూడు పరాజయాలు, సోషల్ మీడియాలో ఎదుర్కొన్న ట్రోలింగ్ తర్వాత టోర్నమెంట్‌లో వారి అద్భుతమైన పునరాగమనాన్ని ప్రశంసించారు. దీంతో క్రికెటర్లు కూడా తాము ఎదుర్కొన్న పరిస్ధితుల్ని ప్రధానితో పంచుకున్నారు.మరోవైపు మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ …

Read More »

తెలంగాణ కేబినెట్ నుంచి “ముగ్గురు మంత్రులు” అవుట్

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ లో భారీ మార్పులు జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రుల శాఖల్లో మార్పులు ఉంటాయని, కొందరు మంత్రులు పదవులు కోల్పోతారని సమాచారం. కొత్తగా ముగ్గురికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ పదవులు కోల్పోతారని ఓ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. ఈనెల 11 తర్వాత మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రి పదవి కోసం పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు ఎదురుచూస్తున్నారు.తాజాగా ఎమ్మెల్సీ అజారుద్దీన్ కి మైనార్టీ సంక్షేమశాఖ …

Read More »

విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే విస్తరణ

నేషనల్ హైవే 65 విస్తరణకు కేంద్రం ఆమోదం విజయవాడ,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే 65 పై కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.నేషనల్ హైవే 65 ను విస్తరించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. హైదరాబాద్, విజయవాడ 65వ జాతీయ రహదారిని విస్తరించే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం అవసరమైన భూ సేకరణ ప్రక్రియ కోసం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అధికారులను నియమిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నేషనల్ హైవే విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ నేషనల్ హైవే 65 విస్తరణలో …

Read More »

జూబ్లీహిల్స్ లో త్రిముఖ పోటీ: గెలుపు ఎవరిదో?

11న ఎన్నికలు 14న కౌంటింగ్ హోరాహోరీ ఎన్నికల ప్రచారం మాటలతూటాలు హైదరాబాద్,ఐఏషియ న్యూస్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపెవరిది.ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిగా మారిన చర్చ. పోలింగ్ సమీపిస్తున్న వేళ జూబ్లీహిల్స్ లో అంచనాలు మారుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలు హోరా హోరీగా ప్రచారం చేస్తున్నాయి. గెలుపు పైన ధీమాగా ఉన్నా.. లోలోపల మాత్రం ఆందోళనతో ఉన్నాయి. ఈ సమయంలో ప్రముఖ సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. పబ్లిక్ మూడ్ పైన అంచనాలను వెల్లడి స్తున్నాయి. అందులో భాగంగా ప్రముఖ సర్వే సంస్థ జూబ్లీహిల్స్ లో …

Read More »

రాష్ట్రవ్యాప్తంగా “120 సబ్ రిజిస్ట్రార్” కార్యాలయాల పై ఏసీబీ దాడులు

పలు రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రికార్డులు స్వాధీనం ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీలో అవినీతి కేంద్రాలుగా మారిన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల విషయంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ప్రభుత్వం అవినీతి నిరోధానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రం పరిస్ధితి మారడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ విరుచుకుపడుతోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏకంగా 120 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఏకకాలంలో దాడులు జరుపుతోంది. రాష్ట్రంలోని సబ్ రిజిస్టార్ …

Read More »

జీనబాడు బాలికల ఆశ్రమ పాఠశాలలో విజృంభించిన మలేరియా

చికిత్స కోసం విద్యార్థులను ఆసుపత్రికి తరలింపు అరకు/అనంతగిరి,ఐఏషియ న్యూస్: ఏయస్ ఆ‌ర్ జిల్లా ఆనంతగిరి మండలం జీనబాడు బాలికల ఆశ్రమ పాఠశాలలో మలేరియా విజృంభించింది. విద్యార్థులను దేవరాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధమ చికిత్స చేసి ముగ్గురు బాలికను అనకాపల్లి జిల్లా కె కోటపాడు 50 పడకల ఆసుపత్రికి బుధవారం రాత్రి 9-20 నిమిషాల కు 108 లో తరలించారుగిరిజన బాలికలు పట్ల (ఉపాద్యాయులు) ప్రభుత్వం నిర్లక్ష్యంవల్ల ఈ పరిస్థితి దాపురించిందని, విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. …

Read More »

17 నుండి 30 వరకు కుష్టువ్యాధి గుర్తింపు సర్వే

శరీరంపై స్పర్శలేని మచ్చలుంటే తెలపండి: కలెక్టర్ హరేందిర ప్రసాద్ విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: జిల్లాలోని ఈ నెల 17 నుండి 30 వ తేదీ వరకు కుష్టువ్యాధిని గుర్తించే కార్యక్రమం (ఎల్సిడిసి) పటిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేందిర ప్రసాద్ అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో కుష్టువ్యాధి సర్వే పై జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ హారంధిర ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల పరిధి …

Read More »

తిరుమలలో 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం

టీటీడీ చైర్మన్ బిఆర్.నాయుడు వెల్లడి తిరుమల,ఐఏషియ న్యూస్: టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణం గా మార్పులకు సిద్దమైంది. సాంకేతికతను వినియోగించుకొని సేవలు పెంచాలని డిసైడ్ అయింది. అదే విధంగా డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ఏకాదశి రోజు ప్రారంభం అయ్యే వైకుంఠ ద్వార దర్శనం పది రోజులు కొనసాగించాలని నిర్ణయించింది. కాగా, శ్రీవారి దర్శనం,వసతి కేటాయింపుపైన టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు కీలక అంశాలను వెల్లడించారు.టీటీడీ పాలక మండలి బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ …

Read More »

హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ హిందూజా మృతి

లండన్,ఐఏషియ న్యూస్: హిందూజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ పి. హిందూజా (85) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న హిందూజా లండన్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం కన్నుమూశారు.హిందుజా ఫ్యామిలీలో రెండో తరానికి చెందిన గోపీచంద్ 2023లో గ్రూప్ సంస్థలకు ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన సోదరుడు శ్రీచంద్ మరణానంతరం బాధ్యతలు స్వీకరించారు.గోపీచంద్ హిందుజాకు భార్య సునీత, కుమారులు సంజయ్, ధీరజ్, కుమార్తె రీతా ఉన్నారు. ఇండో- మిడిల్ ఈస్ట్ ట్రేడింగ్ ఆపరేషన్స్ నిర్వహించే సంస్థను అంతర్జాతీయ దిగ్గజ …

Read More »