న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: డిమాండ్ కు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అర్హత ఉన్న వారికి ఆన్ లైన్ లో ఏఐ కోర్సుల శిక్షణ ఇచ్చేందుకు సంస్థలు ముందుకు వచ్చాయి. దరఖాస్తుల ను ఆహ్వానిస్తున్నాయి.నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఏఐ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ ఇవ్వనుంది. సైబర్ సెక్యూరిటీ, ఏఐ డేటా సైన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, ఎథికల్ హ్యాకింగ్, పైథాన్, మెషిన్ లెర్నింగ్ మరియు బిజినెస్ అనలిటిక్స్ ఉన్నాయి. అదనపు కోర్సులలో ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, బ్లాక్‌చెయిన్, డీప్ లెర్నింగ్, …
Read More »admin
సెప్టెంబర్ ఒకటి నుంచి మూడు రోజులు పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
తాడేపల్లి,ఐఏషియ న్యూస్: సెప్టెంబర్ 1,2,3 తేదీల్లో వైయస్సార్సీపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ పులివెందుల లో పర్యటించనున్నారు. ఒకటవ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. రెండవ తేదీన పులివెందుల నివాసం నుంచి బయలుదేరి ఉదయం 7.15 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైయస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. ఆ …
Read More »ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలకు ప్రభుత్వం సన్నద్ధం
అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ ప్రభుత్వం ఇంటర్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నెల ముందుగానే ఫిబ్రవరిలో పరీక్షల నిర్వహణకు నిర్ణయించింది.పరీక్షా విధానంలోనూ మార్పులు తెచ్చింది. తాజా నిర్ణయం మేరకు ఇకపై రోజుకు ఒక్క సబ్జెక్టుకే పరీక్షలు జరగనున్నాయి. మొదట సైన్స్ గ్రూపులకు, ఆ తర్వాత ఆర్ట్స్ గ్రూపులకు పరీక్షలు నిర్వహించేలా ఇంటర్ బోర్డు మార్పులు చేసింది. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ పైన మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది. నెల ముందే పరీక్షలు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఈ విద్యాసంవత్సరంలో ఫిబ్రవరిలోనే …
Read More »గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం,క్రికెటర్ అజారుద్దీన్ ఎంపిక
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, క్రికెటర్ అజారుద్దీన్ ను ఎంపిక చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. గతంలో సిఫార్సు చేసిన అమేర్ అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్ కు చోటు దక్కింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈమేరకు కేబినెట్ లోతీర్మానించి గవర్నర్ కు పంపించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఎదురు చూస్తున్న అజారుద్దీన్ కు అనూహ్యంగా ప్రభుత్వం ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఎవరిని ఎంపిక చేస్తారో …
Read More »ప్రజాస్వామ్యంలో హింస పని చేయదు,జెండా కర్రే ఆయుధం
జనసేనాని,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపు విశాఖపట్నం,ఐఏషియ బ్యూరో: ప్రజాస్వామ్యంలో హింస పనిచేయదని,జెండా కర్రే ఆయుధం, గుండెల నుంచి వచ్చే మాటే తూటా కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనసైనికులకు పిలుపునిచ్చారు.అలా చేస్తే కచ్చితంగా మార్పు వస్తుందన్నారు. శనివారం విశాఖపట్నం మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.పార్టీ సభ్యత్వ నమోదు కోసం దసరా తర్వాత త్రిశూల్ పేరుతో కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు స్థిరత్వం కావాలని,కూటమి సర్కారు బలంగా …
Read More »On August 28, 2025, Hindus of Dallas hosted a Civic Reception in Dallas-Fort Worth to honor newly elected city officials from across the Metroplex.
The Hindus of Dallas proudly hosted a distinguished Meet & Greet Reception to honor newly elected and re-elected city officials from across the DFW Metroplex. Held in a spirit of unity and civic engagement, the event brought together City Mayors, Council Members, ISD Trustees from multiple cities across the Dallas Fort-Worth Metroplex, alongside more than 40+ prominent members of the …
Read More »విశాఖలో ఆర్టీసీ బస్సు దగ్ధం: ప్రయాణికులు సురక్షితం
విశాఖపట్నం ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం లభించింది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్, బస్సుల్లో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం.ఈ పరిణామాల మధ్య విశాఖపట్నంలో శుక్రవారం ఉదయం ఏపీఎస్ఆర్టీసీకి చెందిన మెట్రో బస్సు బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎటువంటి గాయాలు …
Read More »లంచం తీసుకున్న ఎస్ఐ కి ఏడేళ్ల జైలుశిక్ష,2.5 లక్షల జరిమానా
ఏసీబీ కోర్టు సంచలన తీర్పు ప్రకటన లీగల్ డెస్క్,ఐఏషియ న్యూస్: ముద్దాయిలను అరెస్టు చేయకుండా ఉండేందుకు లక్ష రూపాయలు లంచం తీసుకున్న సబ్-ఇన్‌స్పెక్టర్‌కు ఏసీబీ కోర్టు భారీ శిక్ష విధించింది. ఏడేళ్ల జైలుశిక్షతో పాటు 2.5 లక్షల రూపాయల జరిమానాను కూడా విధించింది. వివరాల్లోకెళ్తే విశాఖపట్నంలో నివసిస్తున్న ఓ మహిళ తన భర్త మంగరాజు,అతని తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్ల పై వరకట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్‌లో పెద్దయ్య 2015లో ఎస్ ఐ గా పనిచేస్తున్న సమయంలో సదరు మహిళ …
Read More »విశాఖ బీచ్ లో హాప్ ఆన్ హాప్ అఫ్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
విశాఖపట్నం,,ఐఏషియ న్యూస్: విశాఖలో పర్యాటకానికి మరింత ఆకర్షణ జోడిస్తూ డబుల్ డెక్కర్ బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విశాఖ బీచ్ రోడ్డులో హాప్ ఆన్ – హాప్ అఫ్ డబుల్ డెక్కర్ పర్యాటక బస్సులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో తిరగనున్న ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్లో స్వయంగా ప్రజా ప్రతినిధులతో కలిసిసీఎంకొంతదూరంప్రయాణించారు. బస్సు నుంచే బీచ్ లో ఉన్న పర్యాటకులకు అభివాదం చేశారు. …
Read More »విశాఖ పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 68వ రోజు ప్రజాదర్బార్
సమస్యలు విన్నవించేందుకు పార్టీ కార్యాలయానికి తరలివచ్చిన ప్రజలు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వినతులు స్వీకరించిన మంత్రి లోకేష్ విజ్ఞప్తులు త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ విశాఖపట్నం,ఐఏషియ బ్యూరో: వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖ నగరానికి వచ్చిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఉదయం విశాఖ పార్టీ కార్యాలయంలో 68వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను కలిసేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రజలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ప్రతిఒక్కరిని ఆప్యాయంగా …
Read More »
News Website (iasianews.net) I Asia News