అనంతపురం,ఐఏషియ న్యూస్: వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగం కోల్పోయిన అనంతపురం జిల్లా కానిస్టేబుల్ ప్రకాశ్ సోమవారం తిరిగి విధుల్లో చేరారు.తనకు తిరిగి ఉద్యోగం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల వ్యవస్థను ప్రశ్నించినందుకు జగన్ ప్రభుత్వం మూడేళ్ల కక్ష గట్టి విధుల నుంచి తొలగించడం జరిగింది. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక తన ఉద్యోగం తనకి ఇప్పించాలంటూ కానిస్టేబుల్ ప్రకాష్ కూటమి ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. అతని అభ్యర్థనను పరిశీలించిన సీఎం చంద్రబాబు తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలు,డీజీపీ ఉత్తర్వుల మేరకు ఎస్పీ జగదీశ్ ఆయనకు విధులు అప్పగించారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News