న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: భారత్ పై అమెరికా సుంకాల పెంపుదల చేసిన క్రమంలోనే తొలి విడతలో భాగంగా ఈ నెల మొదట్లోనే 25 శాతం సుంకాలు భారత్‌పై విధిస్తున్నట్లు ప్రకటించి అమలు చేస్తున్నారు. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా నుంచి తక్కువ ధరకే చమురును దిగుమతి చేసుకుంటోందని పేర్కొన్న ట్రంప్ భారత్‌పై మరో 25 శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు బహిరంగంగానే వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ అదనపు సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) మంగళవారం హైలెవల్ …
Read More »admin
జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో పెన్ డ్రైవ్,వాట్సాప్ సర్వీసులు నిషేధం
శ్రీనగర్ ,ఐఏషియ న్యూస్: అన్ని ప్రభుత్వ శాఖల్లో కార్యాలయాల్లో పెన్‌డ్రైవ్‌లు, వాట్సాప్ సర్వీసులపై నిషేధం విధిస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్‌లోని ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌లోని కీలక శాఖలు, వెబ్‌సైట్‌లపై భారీఎత్తున సైబర్ దాడులు జరగ్గా వాటిని దృష్టిలో ఉంచుకుని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని అన్ని ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌లలో పెన్‌డ్రైవ్‌లు వాడడాన్ని నిషేధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక డేటాను ట్రాన్స్‌ఫర్ చేసేందుకు ఉపయోగించేవాట్సాప్ …
Read More »ఉస్మానియా అభివృద్ధికి 1000 కోట్లు కేటాయింపు
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ చరిత్రకు సజీవ సాక్ష్యమైన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంతో పోల్చదగ్గ స్థాయికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర సమాజానికి, తెలంగాణ ఉద్యమానికి పునాది వేసిన ఈ విశ్వవిద్యాలయాన్ని కాలగర్భంలో కలిసిపోనీయకుండా, గ్లోబల్ స్టాండర్డ్స్‌తో తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఆర్ట్స్ కాలేజీ ఠాగూర్ ఆడిటోరియంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. విద్యార్థుల కోసం కొత్త హాస్టల్ భవనాలు, లైబ్రరీ రీడింగ్ రూమ్‌కు శంకుస్థాపన చేశారు. అలాగే కొత్తగా …
Read More »ఆధార్ ను తప్పనిసరిగా గుర్తింపు కార్డుగా స్వీకరించాల్సిందే
బీహార్ ఎన్నికలవేళ తేల్చి చెప్పిన సుప్రీం కోర్ట్ న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: మన దేశంలో ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో కీలకమైన ఆధార్ కార్డు ఎన్నికల్లో ఓటు హక్కు పొందేందుకు చెల్లుబాటయ్యే పత్రాల్లో ఒకటిగా ఎప్పటి నుంచో ఉంది. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆధార్ ను ఓటరుగా నమోదు అయ్యేందుకు తగిన పత్రంగా ఎన్నికల సంఘం గుర్తించకపోవడంతో వివాదం మొదలైంది. దీనిపై ఇప్పటికే ఈసీకి అక్షింతలు వేసిన సుప్రీంకోర్టు.. ఆధార్ ను తప్పనిసరిగా గుర్తింపు కార్డుగా స్వీకరించాల్సిందేనని ఇవాళ తేల్చిచెప్పేసింది.బీహార్ లో ప్రత్యేక ఓటరు …
Read More »అంగరంగ వైభముగా సింహాద్రినాధుని నిత్య కల్యాణం
సింహాచలం,ఐఏషియ న్యూస్: ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి నిత్య కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణములో పాల్గొన్న భక్తుల, గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతోకార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు …
Read More »శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మహా పూర్ణాహుతితో ముగిసిన శ్రావణలక్ష్మి పూజలు
విశాఖ దక్షిణం,ఐఏషియ న్యూస్: ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి ఆలయంలో నెలరోజులు పాటు ఘనంగా నిర్వహించిన శ్రావణ లక్ష్మి పూజలు శనివారం నిర్వహించిన మహా పూర్ణహుతితో ఘనంగా ముగిసాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరణ చేశారు.అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి కే. శోభరాణి, వేద పండితులు,అర్చకులు,ఉభయదాతలు, సిబ్బంది పాల్గొన్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »మూడు నెలల్లోగా ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి
రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీలో ఉద్యోగులకు చెల్లించాల్సి బకాయిల పైన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరాయి. ఉద్యోగులు, పెన్షర్ల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేసాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ ప్రకటించాలని,12వ పిఆర్సీ కమీషన్ తక్షణమే నియమించాలని కోరుతున్నాయి. తక్షణమే పెండింగ్ డిఏలు విడుదల చేయాలని సంఘాల నేతలు కోరారు. మూడు నెలల్లోగా వీటి చెల్లింపు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని సంఘాలు …
Read More »ఏపీ డీజీపీకి మానవహక్కుల సంఘం నోటీసులు
తిరుపతి డిప్యూటీ మేయర్ ఉపఎన్నిక సందర్భంలో ఘటనపై నోటీసులు వైసీపీ ఎంపీ గురుమూర్తి ఫిర్యాదుపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ దర్యాప్తు నివేదిక అందించాలని డీజీపీకి ఆదేశాలు అమరావతి,ఐఏషియ న్యూస్: తిరుపతి డిప్యూటీ మేయర్ ఉపఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలపై ఏపీ డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) నోటీసులు జారీ చేసింది. ఎస్వీయూ క్యాంపస్‌లో జరిగిన హింసపై ఆరువారాల్లో నివేదిక సమర్పించాలని డీజీపీని ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశించింది.తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా రౌడీ మూకలు తమపై దాడి చేశారని,నిందితుల పేర్లతో …
Read More »భారత్ లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్ లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్ ను ప్రకటించారు. ఇరుదేశాల మధ్య టారిఫ్లకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం కీలకంగా మారింది. ప్రస్తుతం సెర్గియో గోర్ వైట్హౌస్లో పర్సనల్ డైరెక్టర్ గా ఉన్నారు.త్వరలోనే బాధ్యతలు చేపడతారు. Authored by: Vaddadi udayakumar
Read More »సెప్టెంబర్ 8 బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సారథ్యం శోభాయాత్ర విజయవంతం చేయాలి
బిజెపి అనకాపల్లి జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు సుజాతనగర్(విశాఖపట్నం,ఆంధ్రప్రదేశ్),ఐఏషియ న్యూస్: అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో సెప్టెంబర్ 8న జరగబోయే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ “సారథ్యం శోభాయాత్ర” విజయవంతం చెయ్యాలని కోరుతూ పెందుర్తి బిజెపి నాయకులు,జీవీఎంసీ 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు, బిజెపి 95,97వ వార్డుల అధ్యక్షులు చిక్కాల సతీష్ ల ఆధ్వర్యంలో బిజెపి 95,97వ వార్డుల పదాధికారులు,బిజెపి కార్యకర్తలు,అభిమానులతో ముఖ్య సమావేశం చినముషీడివాడలో శనివారం నాడు జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అనకాపల్లి బిజెపి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు పాల్గొని రాష్ట్ర అధ్యక్షులు …
Read More »
News Website (iasianews.net) I Asia News