సమాచార శాఖ కమిషనర్ చావలి సునీల్ దాతృత్వం మంగళగిరి,ఐఏషియ న్యూస్: ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా, సహాయం చేసే గుణం ఉండటమే అన్నింటికీ మించిన ఆస్తి అన్న చందాన సమాచార శాఖ కమిషనర్ చావలి సునీల్ దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. సమాచార శాఖ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి చనిపోగా, సదరు ఉద్యోగి కుటుంబ దిన స్థితిని గమనించిన సమాచార కమిషనర్ స్పందించి, తన నెల వారి జీతం నుంచి రూ. లక్ష ఆర్థిక సహాయంగా అందజేశారు. వివరాల్లోకి వెళితే.అంబేద్కర్ కోనసీమ జిల్లా, పుల్టేటికూరు గ్రామానికి చెందిన …
Read More »admin
గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం
నిమజ్జనానికి 50 వేల విగ్రహాలు రానున్నట్లు అధికారులు అంచనా హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ మహానగరంలో వినాయక నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేశారు.303 కిలోమీటర్ల మేర కొనసాగనున్న గణేష్ శోభాయాత్రలు. నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన జీహెచ్‌ఎంసీ. 13 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు.30 వేల మందితో పోలీసు బందోబస్తు.160 యాక్షన్ టీంలు.నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులు. 72 కృత్రిమ కొలనులు..134 క్రేన్లు,259 మొబైల్ క్రేన్లు. హుస్సేన్ సాగర్‌లో 9 బోట్లు సిద్ధం.. 200 మంది గజ ఈతగాళ్లు. శానిటేషన్ కోసం 14,486 మంది …
Read More »మోడీ తర్వాత స్థానం జూనియర్ ఎన్టీఆర్ దే
పాపులర్ వ్యక్తుల జాబితా విడుదల చేసిన ఎక్స్ సంస్థ బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్‌లు, చర్చలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఎక్స్ (ట్విట్టర్)లో సినీ,రాజకీయ, క్రీడా ప్రముఖుల గురించి నెటిజన్లు నిరంతరం మాట్లాడుకుంటుంటారు.తాజాగా, ఆగస్టు నెలలో ఇండియాలో అత్యధికంగా చర్చ జరిగిన సెలబ్రిటీల జాబితాను ఎక్స్ సంస్థ విడుదల చేయగా,అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండవ స్థానం దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.ఈ జాబితాలో ఎప్పటిలాగే ప్రధాని నరేంద్ర మోడీ అగ్ర స్థానంలో నిలిచారు.అయితే, ఆయన తర్వాత ఎన్టీఆర్ నిలవడం …
Read More »దృష్టిలోపం గల దివ్యాంగులకు ఎంపీసీ,బైపీసీ కోర్సులు చదవడానికి ప్రభుత్వం అనుమతి
అమరావతి,ఐఏషియ న్యూస్: దృష్టిలోపం దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డు కాకూడదని, వారికి మిగిలిన విద్యార్థులతో సమానంగా అవకాశాలు కల్పించడానికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా చొరవ చూపారు. దృష్టి లోపం గల దివ్యాంగ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ లో ఎంపీసీ, బైపిసి కోర్సులు చదవడానికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ జీ ఓ 278 జారీ చేసింది. తమకు సైన్స్ కోర్సుల్లో అవకాశం కల్పించాలని దృష్టిలోపం గల విద్యార్థులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కు …
Read More »భక్తులను మోసగిస్తే కఠిన చర్యలు: టిటిడి
తిరుమల,ఐఏషియ న్యూస్: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులను మాయమాటలతో మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టిటిడి హెచ్చరించింది. గత వారం రోజుల క్రితం భక్తురాలు శ్రీమతి ఊర్వశి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గూగుల్ ద్వారా వసతి కోసం వెతికే క్రమంలో శ్రీనివాసం రెస్ట్ హౌసెస్ అనే వెబ్ సైట్ లో ఇచ్చిన మొబైల్ నెంబర్ 8062180322 ను సంప్రదించగా, అభిమన్యు అనే వ్యక్తి తాను శ్రీనివాసం కాంప్లెక్స్ లో రిసెప్షన్ కి చెందిన వాడినని …
Read More »విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు భోజనం చేయాలి
ఫుడ్ పాయిజన్ జరిగే సంఘటనలు తగ్గుతాయి తెలంగాణ హైకోర్టు సీజే అపరేశ్‌కుమార్ సింగ్ హైదరాబాద్,ఐఏషియ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగాప్రభుత్వపాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో కలిసి అక్కడే భోజనం చేయాలని తెలంగాణ హైకోర్టు సూచించింది. ఇలా చేస్తే ఫుడ్ పాయిజన్ ఘటనలు తగ్గిపోతాయి, నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని అభిప్రాయపడింది.స్కూల్ భోజన నాణ్యతపై పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించింది.విద్యార్థులు పాఠశాల పనుల్లో భాగస్వాములు కావడం తప్పుకాదని సీజే వ్యాఖ్య.తాను కూడా చిన్నప్పుడు స్కూల్ పనులు చేశానని సీజే అపరేశ్‌కుమార్ సింగ్ గుర్తుచేసుకున్నారు.ప్రభుత్వంపై పిటిషనర్ వాదన ఈ …
Read More »చెట్లు నరికితే.. ఒక్కో వృక్షానికి రూ. లక్ష జరిమానా
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: చెట్లను నరకడం పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. దీనివల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని.. వర్షాలు సరిగ్గా పడవు. వాయు కాలుష్యం పెరుగుతుంది. ప్రజలు అనారోగ్యం పాలవుతారు. అందుకే చెట్లను నరకడం నేరం.ప్రతిఒక్కరికీ పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది.చెట్లను నాటి వాటిని సంరక్షించాలి. పర్యావరణాన్ని కాపాడితే మన భవిష్యత్తును మనం కాపాడుకున్నట్లేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చెట్లు నరకడం మనిషిని చంపడం కంటే దారుణమని, పర్యావరణానికి నష్టం కలిగించే వారిపై దయ చూపరాదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.అక్రమంగా చెట్లు నరికితే ఒక్కోదానికి రూ.1 …
Read More »17 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన ముంబై అండర్ వరల్డ్ డాన్ అరుణ్ గావ్లి
ముంబై,ఐఏషియ న్యూస్: ముంబై అండర్ వరల్డ్ డాన్, రాజకీయ నాయకుడిగా మారిన అరుణ్ గావ్లి 17 ఏళ్ల అనంతరం నాగ్పూర్ సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యాడు. 2007లో శివసేన కార్పొరేటర్ కమలాకర్ జంసండేకర్ హత్య కేసులో అతనికి జీవిత ఖైదు విధించారు.సుప్రీంకోర్టు అతనికి ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. అతను బయటకు వచ్చిన వెంటనే,అతని కుటుంబం, మద్దతుదారులు అతనికి ఘన స్వాగతం పలికారు. Authored by: Vaddadi udayakumar
Read More »జిఎస్టి లో రెండు స్లాబ్ లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
కేంద్ర క్యాబినెట్ నిర్ణయం భారీగా రేట్లు తగ్గనున్న టీవీ,వాషింగ్ మెషిన్,ఏసీలు హెల్త్,లైఫ్ ఇన్సూరెన్స్ లకు జీఎస్టీ ఎత్తివేత ఏపీ చీఫ్ బ్యూరో, ఐఏషియ న్యూస్: ప్రస్తుతం వసూలు చేస్తున్న జీఎస్టీలో 12శాతం, 28శాతం స్లాబులను తొలగించి ఆ స్థానంలో కేవలం. 5శాతం, 18శాతం స్లాబులే కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన న్యూఢిల్లీలో బుధవారం 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. పన్ను రేట్లపై రాష్ట్రాలు, కేంద్రం విస్తృతంగా చర్చించిన తర్వాత ఈ …
Read More »సిబిఐకి సుగాలి ప్రీతి కేసు అప్పగించిన ఏపీ ప్రభుత్వం
అమరావతి ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుగాలి ప్రీతి కేసును సీబీఐకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ హయాంలో ఈ కేసును సీబీఐకు అప్పగించారు. అయితే దర్యాప్తు సరిగా జరగలేదని భావిస్తున్న నేపథ్యంలో మరోసారి సీబీఐకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థకు లేఖ రాయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గురువారం రోజున జరిగే ఏపీ కేబినెట్ సమావేశంలోనూ ఈ విషయంపై చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు 2017 ఆగస్టు …
Read More »
News Website (iasianews.net) I Asia News