admin

Shri C.P.Radhakrishnan ji is elected as New Vice President of India

Chandrapuram Ponnusamy C. P. Radhakrishnan was elected as the 15th Vice President of India on 9th  September 2025, succeeding Jagdeep Dhankhar who had resigned earlier that year citing health concerns. Representing the National Democratic Alliance (NDA), Radhakrishnan secured a robust victory with 452 first-preference votes—approximately 60.10% of the total—defeating the INDIA bloc’s candidate, former Supreme Court judge B. Sudershan Reddy, who obtained 300 …

Read More »

వైసీపీ ఎమ్మెల్యేలకు సమయం ఇస్తాం

అమరావతి,ఐఏషియ న్యూస్: వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరు ఎమ్మెల్యేల మాదిరిగానే మాట్లాడేందుకు సమయం ఇస్తామన్నారు.రాష్ట్రంలోని సమస్యలతో పాటు తమతమ నియోజకవర్గాల్లోని ప్రజలకు సంబంధించి అన్ని ఇష్యూలపై చర్చించేందుకు టైం ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని, ప్రభుత్వానికి సహకరించాలన్నారు.స్పీకర్ అయ్యన్న సూచనలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. Authored by: Vaddadi udayakumar

Read More »

ఇక ప్రతిరోజు తిరుపతి షిరిడి మధ్య ప్రత్యేక రైలు

తిరుపతి,ఐఏషియ న్యూస్: తిరుపతి- షిర్డీ మధ్య ఇకపై ప్రతిరోజూ రైలు నడవనుంది. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇప్పటివరకు తాత్కాలికంగా నడిచే సర్వీసును రెగ్యులర్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తిరుపతి- షిర్డీ మధ్య 07637/07638 నంబర్ రైలును ఇకపై ప్రతి రోజూ నడపనున్నట్లు వెల్లడించింది. రేణిగుంట, ధర్మవరం, రాయచూర్, షోలాపూర్, దౌండ్ స్టేషన్ల మీదుగా ఈ రైలు షిర్డీ చేరుకోనుంది. తిరుపతి టూ షిర్డీ మధ్య రైలు నడపాలని ఇటీవల సీఎం చంద్రబాబు …

Read More »

నాన్ స్టాప్ బస్సులకు తగ్గిన ఆదాయం: సర్వీసులు తగ్గిస్తున్న ఆర్టీసీ అధికారులు

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనెల15వ తేదీ నుండి స్త్రీ శక్తి పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న ప్రభుత్వ తీరుతో ఏపీ వ్యాప్తంగా మహిళలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో మరో కొత్త సమస్య కూడా వచ్చి పడింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పిస్తూ ఉండడంతో నాన్ స్టాప్ బస్సు సర్వీసులపైన తీవ్ర ప్రభావం పడుతుంది. స్త్రీశక్తి పథకంతో నాన్ స్టాప్ బస్సులకు దెబ్బ నాన్ స్టాప్ …

Read More »

నేడు ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక నేడు జరగనున్నది. పార్లమెంట్ సభ్యులు 15వ ఉప రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. ఈ క్రమంలో దేశరాజధానిలో రాజకీయాలు వేడెక్కాయి. తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఎన్డీఏ- ఇండియా బ్లాక్ వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకున్నాయి. ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపు నల్లేరు మీద నడకే. అయినప్పటికీ మెజారిటీని మరింత పెంచుకోవడంపై ఫోకస్ పెట్టింది.ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ బరిలో దిగారు. ఆయనపై సుప్రీంకోర్టు మాజీ …

Read More »

రెండుకోట్ల విలువైన రద్దయిన నోట్లు స్వాధీనం

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: నగరంలో రద్దయిన పెద్ద నోట్లు భారీమొత్తంలో పట్టుబడ్డాయి. నారాయణగూడ శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న కెనరా బ్యాంక్ వద్ద ఇద్దరిని, వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద ఇద్దరిని ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 3 బ్యాగుల్లో తనిఖీలు చేయగా.. రూ.2 కోట్లు విలువ చేసే రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం నారాయణగూడ పోలీస్ స్టేషన్ తరలించారు.ఈ నోట్లు ఎక్కడినుంచి వచ్చాయి ఎక్కడికి తీసుకు …

Read More »

46 డిఫెన్స్ మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు

గాజువాక,ఐఏషియ న్యూస్: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్, గాజువాక అధికారులు గాజువాక మండలం జింక్ గేట్ ఏరియాలో దాడులు చేసి ఒక డిఫెన్స్ మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు.ముందస్తుగా రాబడిన సమాచారం మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ అధికారులు గాజువాక మండలం జింక్ గేట్ ఏరియాలో సోమవారం నిర్వహించిన దాడుల్లో 46 డిఫెన్స్ మద్యం బాటిళ్లు(750ఎంఎల్ పరిమాణం) స్వాధీనం చేసుకున్నారు. బాటిల్స్ నిల్వచేసిన శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన శరగడం దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని అరెస్టు చేసి,తదుపరి దర్యాప్తు నిమిత్తం రిమాండుకు తరలించడం జరిగింది.ఈ దాడుల్లో …

Read More »

ఉపరాష్ట్రపతి ఎన్నికపై మంత్రి లోకేష్ టిడిపి ఎంపీలతో సమావేశం

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఢిల్లీలో సోమవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. మంగళవారం జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికపై చర్చించారు. ఓటింగ్ ప్రక్రియపై ఎంపీలకు మంత్రి నారా లోకేష్ సూచనలు చేశారు. ఈ సమావేశంలో టిడిపికి చెందిన ఎంపీలు పాల్గొన్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »

సీడాప్ ద్వారా 5 ఏళ్లలో 50వేల మందికి విదేశీ ఉద్యోగాలు లక్ష్యం

అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీడాప్, ఓంక్యాప్ బలోపేతంపై దృష్టిసారించామని, సీడాప్ ద్వారా రాబోయే అయిదేళ్లలో ఇతర దేశాల్లో 50వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సొసైటీ ఫర్ ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ ప్రైజ్ డెవలప్ మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సీడాప్ ), ఇండో యూరో సింక్రనైజేషన్ అండ్ జర్మన్ హెల్త్ కేర్ సంయుక్త భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్లేస్ మెంట్ పథకం (నర్సింగ్ ప్రొఫెషనల్స్) కింద …

Read More »

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్:  రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. శనివారం సాయంత్రం దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ లో ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ జపాన్, చైనా పర్యటనల అనంతరం జరుగుతున్న భేటీ కావడంతో విదేశీ పర్యటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే భారత్- అమెరికా వాణిజ్య సంబంధాలు, భారత్ పై సుంకాలు విధింపు.. తదితర అంశాలనూ ప్రస్తావించినట్లు సమాచారం. అలాగే …

Read More »