విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ప్రముఖ ఐటి సంస్థ మైక్రాన్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ సైన్స్ ద్వారా ఎమ్‌సిఎ కోర్సు అభ్యసిస్తున్న విద్యార్ధులను భారీ వేతనంలో ఎంపిక చేసుకుంది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం లోనే జరిగిన ఈ ప్రాంగణ నియామకంలో ఎమ్‌సిఎ ఆఖరి సంవత్సరం విద్యార్ధులు ఎస్.లహరి మోహన్, ఎమ్.వర్షిణి, పి.భవాని, కె.హర్షవర్ధన్‌రెడ్డి, ఎన్.మనోజ్ రూ.12.26 లక్షల వార్షిక వేతనంతో మైక్రాన్ సంస్థకు ఎంపికయ్యారు గీతం స్కూల్ ఆఫ్ సైన్స్‌లో ఎమ్‌సిఎ సహ పలు సైన్స్ కోర్సులు అభ్యసిస్తున్న వారికి ప్రత్యేకంగా నిర్వ హిస్తున్న కెరీర్ …
Read More »admin
62 ఏళ్ల తర్వాత అదే నిజమైంది: ఉపరాష్ట్రపతి మాతృమూర్తి ఆనందం
చెన్నై,ఐఏషియ న్యూస్: ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికవడం పట్ల ఆయన మాతృమూర్తి జానకీ అమ్మాల్ హర్షం వ్యక్తం చేశారు. తనకు కొడుకు పుట్టినప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నారు.ఆయన లాగే నేను కూడా టీచర్ గా పనిచేశాను. ఆయన పేరునే నా కుమారుడికి పెట్టాను. ఏదో ఒక రోజు తను రాష్ట్రపతి అవ్వాలనే ఆ పేరు పెడుతున్నావా అని తన భర్త అడిగారు.62 ఏళ్ల తర్వాత అదే నిజమైంది. నాకు చాలా సంతోషంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. Authored by: Vaddadi udayakumar
Read More »ఏపీ ఆటో డ్రైవర్లకు శుభవార్త
దసరా నుంచి ఖాతాలో డిబిటి ద్వారా నేరుగా 15వేలు జమ ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వాహనమిత్ర అమలు పైన ప్రకటన చేసారు. దసరా నుంచి ఈ పథకం అమల్లో భాగంగా అర్హత ఉన్న ప్రతీ ఆటో డ్రైవరు ఖాతాలో రూ 15 వేలు జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే లబ్దిదారులు.. ఖర్చు.. నిధుల కేటాయింపు పైన కసరత్తు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2.90 లక్షల మంది ఆటో డ్రైవర్లకు పథకం అమలు కానుంది. ప్రభుత్వం నిర్దేశించిన …
Read More »కాకినాడ ఎంపీకి సైబర్ షాక్
వాట్సాప్ డీపీతో రూ.92 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ‘టీ-టైమ్’ సంస్థలో భారీ మోసం ఎంపీ ఫొటోతో వాట్సాప్‌లో నమ్మించిన సైబర్ నేరగాళ్లు కేవలం రూ.7 లక్షలు మాత్రమే ఫ్రీజ్ చేసిన పోలీసులు కాకినాడ,ఐఏషియ న్యూస్: జనసేన పార్టీ కాకినాడ ఎంపీ, ‘టీ-టైమ్’ సంస్థ అధినేత ఉదయ్ శ్రీనివాస్ పేరును అడ్డం పెట్టుకుని సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి తెరలేపారు. ఎంపీ ఫొటోను వాట్సాప్ ప్రొఫైల్ చిత్రంగా పెట్టి, ఆయన సంస్థకే చెందిన ఫైనాన్స్ మేనేజర్‌ను నమ్మించి ఏకంగా రూ.92 …
Read More »ఉపాధి హామీ కూలీలకు వేతన బకాయి చెల్లింపునకు 1,668 కోట్లు విడుదల
అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఏపీలో మే 15వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు చెల్లించవలసిన వేతన బకాయిల సొమ్మును కేంద్రం విడుదల చేసింది. మొత్తం 1,668 కోట్ల రూపాయలను కేంద్ర ఉపాధి హామీ కూలీల కోసం విడుదల చేసింది. ఈ వేతన బకాయిలను కూలీల బ్యాంకు ఖాతాలలో జమ చేయనున్నారు.ఏపీలోని ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు కేంద్రంతో పాటు ఏపీ ప్రభుత్వం ఆర్థిక భరోసాను ఇవ్వనుంది. త్వరలో మరో …
Read More »టీటీడీ బోర్డు సభ్యునిగా టీవీఎస్ మోటార్స్ సీఎండీ సుదర్శన్ వేణు
తిరుమల,ఐఏషియ న్యూస్: టీవీఎస్ మోటార్స్ సీఎండీ సుదర్శన్ వేణును టీటీడీబోర్డు సభ్యునిగా నియమిస్తూ ప్రభుత్వం గురువారంఉత్తర్వులు జారీచేసింది. 29 మంది సభ్యులతో గత ఏడాది టీటీడీ నవంబర్ లో బోర్డు సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.అయితే ఈ సభ్యుల్లోసుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్ దత్తును సభ్యునిగా నియమించగా ఆయన ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం చేయలేదు. అందుచేత ఆ సభ్యుని తొలగించి ఆ సభ్యుని స్థానంలోట్రస్ట్ బోర్డ్ సభ్యులుగా సుదర్శన్ వేణును నియమించింది.ఈయనకు గతంలోనూ తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా పనిచేసిన …
Read More »నర్సీపట్నం అమ్మాయి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం గురువారం బదిలీ చేసిన 12 మంది జిల్లా కలెక్టర్ లలో కీర్తి చేకూరి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు.ఈమె అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం కోటవురట్ల తంగేడు గ్రామానికి చెందినవారు. నర్సీపట్నం ఆర్.సి.యం పాఠశాలలో విద్యనభ్యసించారు.బీటెక్ మెటలర్జీ ఐఐటి (మద్రాస్)లో చేశారు. మొదట ఐఆర్ఎస్ అధికారిగా కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అయినప్పటికీ ఐఏఎస్ చేయాలన్న పట్టుదలతో రెండుసార్లు తక్కువ ర్యాంకు వచ్చినప్పటికీ మూడోసారి పరీక్షలు రాసి ఆల్ ఇండియా 14వర్యాంక్ సాధించారు.కాకినాడ జాయింట్ కలెక్టర్, …
Read More »4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి హారిక
హైదరాబాద్,ఐఏషియ న్యూస్:నార్సింగి పురపాలక సంఘం పట్టణ ప్రణాళిక శాఖలో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారి ఎస్. మణి హారిక మంగళవారం లంచం తీసుకుంటు తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు.ఫిర్యాదుదారునికి చెందిన ఓ ప్లాటు క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్) జారీ చేసేందుకు, దానిని ప్రాసెస్ చేయడానికి మణి హారిక మొదట 10 లక్షల లంచం డిమాండ్ చేయగా అందులో భాగంగా 4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకున్న నగదు నాలుగు లక్షల …
Read More »ఉపరాష్ట్రపతి భారత ప్రభుత్వంలో రెండవ అత్యున్నత స్థానం
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్:ఉప రాష్ట్రపతి భారత ప్రభుత్వంలో రెండో అత్యున్నత స్థానం. భారత రాజ్యాంగంలోని 63వ అధికరణంలో ఉపరాష్ట్రపతి పదవి గురించిన ప్రస్తావన ఉంది. ఈ పదవికి సంబంధించి భారత్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోని మరే పెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోను లేని అంశం ఇది. పెద్ద ప్రజాస్వామ్యాలలో, అమెరికాలో మాత్రమే ఈ పదవి ఉంది.అయితే భారత్, అమెరికాలలో ప్రజాస్వామ్య విధానాలు వేరు (భారత్‌లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం,అమెరికాలో అధ్యక్ష ప్రజాస్వామ్య పద్ధతి ఉన్నాయి) అందుచేత ఉప రాష్ట్రపతి విధులకు,అమెరికా ఉపాధ్యక్షుడి విధులకు చాలా తేడా ఉంది.ఉపరాష్ట్రపతి …
Read More »భారత 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఎన్నిక
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: భారతదేశ 15వ ఉప రాష్ట్రపతిగా ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి,ఇండియా బ్లాక్ కు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డిని భారీ మెజారిటీతో ఓడించారు. ఈ విషయాన్ని పార్లమెంట్ సెక్రెటరీ జనరల్ పీసీ మోదీ మంగళవారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. మొత్తం 452 మంది లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఆయనకు ఓటు వేశారు. ఈ నెల 12వ తేదీన అంటే శుక్రవారం నాడు రాధాకృష్ణన్ …
Read More »
News Website (iasianews.net) I Asia News