సింహాచలం,,ఐఏషియ న్యూస్: సింహాచలం దేవస్థానానికి వచ్చే సీనియర్ సిటిజన్, దివ్యాంగ భక్తుల కోసం విశాఖ నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది రహీమున్నీసా తన తండ్రి షేక్ ఖాదర్ హుస్సేన్ జ్ఞాపకార్థం ఆలయ అధికారి సునీల్ కు రెండు వీల్ చైర్స్ అందజేశారు. సామాజిక సేవలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రహీమున్నీసా తెలియజేశారు.అనంతరం సింహాద్రి నాధుని దర్శించుకున్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »admin
జియో పేమెంట్స్ బ్యాంక్ 6.5శాతం వడ్డీ రేటుతో
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జేఎఫ్‌సీఎల్) అనుబంధ సంస్థ జియో పేమెంట్స్ బ్యాంక్, సరికొత్త ‘సేవింగ్స్ ప్రో’ ఖాతాలను తీసుకొచ్చింది. ఈ బ్యాంకు ఖాతాల్లోని అదనపు నిధులపై వినియోగదారులకు 6.5 శాతం వరకు వడ్డీ చెల్లించనున్నట్లు తెలిపింది. ప్రారంభ దశలో రూ.5000 నుంచి కనీస మొత్తాన్ని వినియోగదారులు ఎంపిక చేసుకోవాలి. ఈ మొత్తానికి అదనంగా ఉండే సొమ్మును ఓవర్‌నైట్ మ్యూచువల్ ఫండ్లలో నేరుగా పెట్టుబడి పెడతారు. ఈ సదుపాయం ద్వారా వినియోగదారులు రోజుకు రూ.1,50,000 వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఖాతాదారులు తమ పెట్టుబడుల్లో …
Read More »ఏపీకి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ రాక రేపు
విజయవాడ,ఐఏషియ న్యూస్: ఉపరాష్ట్రపతిగా తొలిసారి బుధవారం రాష్ట్రానికి వస్తున్న రాధాకృష్ణన్.దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవ్ కు హాజరుకానున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్. ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉపరాష్ట్రపతి పర్యటన సంబంధించి జిల్లా అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »ప్రసారభారతి మాజీ సీఈవో కె.ఎస్.శర్మ అనారోగ్యంతో మృతి
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ప్రసారభారతి మాజీ సీఈవో కంభంపాటి సుబ్రహ్మణ్య శర్మ (కె ఎస్ శర్మ)(80) శనివారం హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు.ఆంధ్రప్రదేశ్ క్యాడర్1968 ఐఏఎస్ అధికారి అయిన కె ఎస్ శర్మ దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ గా కొద్ది కాలం,ఆ తర్వాత ప్రసార భారతి సీఈఓ గా 2006 వరకు సేవలు అందించారు. దూరదర్శన్ డైరెక్ట్ టు హోమ్, డిడి డైరెక్ట్ ప్లస్ లాంటి సేవలను చేపట్టటంలో శర్మ కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా కరీంనగర్ జిల్లాకలెక్టర్ గా విశేష సేవలు అందించారు. …
Read More »969 కిలోల బరువున్న భారీ గుమ్మడికాయను పండించి రికార్డ్ సృష్టించిన రష్యా రైతు
స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: రష్యా రైతు అలెగ్జాండర్ చుసోవ్ అరుదైన ఘనత సాధించారు. ఏకంగా 969 కిలోల బరువున్న భారీ గుమ్మడికాయను పండించి కొత్త రికార్డు సృష్టించారు. ఈ గుమ్మడికాయను మాస్కోలో జరిగిన అతిపెద్ద కూరగాయల పోటీలో ప్రదర్శించారు. రష్యా చరిత్రలో ఇంత పెద్ద గుమ్మడికాయ మొదటిసారి నమోదు కావడం విశేషం. ఆరు నెలల శ్రమ ఫలితం ఈ భారీ గుమ్మడికాయను పెంచడానికి చుసోవ్ దాదాపు ఆరు నెలలకు పైగా కృషి చేసినట్టు తెలిపారు. గుమ్మడికాయ పెరుగుదలకు అనువైన వాతావరణం కోసం ప్రత్యేకంగా గ్రీన్‌హౌస్ …
Read More »ఏపీలో దుకాణాలు,సంస్థల్లో పనిగంటలు పెంపునకు ప్రభుత్వ ఆమోదం
ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీలో దుకాణాలు,సంస్థల్లో పని గంటల పెంపునకు ఆమోదం లభించింది. ప్రస్తుతం 8 పని గంటల విధానం ఇక నుంచి మరో రెండు గంటల వరకు పెరగనుంది. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ బిల్లు ఆమోదించింది. దుకాణాలు, సంస్థలు, ఫ్యాక్టరీల్లోనూ మహిళలను రాత్రిపూట విధులకు అనుమతిస్తారు. పనిగంటల పెంపు సమయంలో పలు నిబంధనలను స్పష్టం చేసారు. దీని ద్వారా రాష్ట్రంలోని దుకాణాలు.. సంస్థలు, ఫ్యాక్టరీల్లో ఇక పని గంటలు పెరగనున్నాయి.ఏపీ దుకాణాలు, సంస్థల సవరణ బిల్లు-2025, ఫ్యాక్టరీస్ సవరణ బిల్లు-2025 …
Read More »హెచ్ వన్ బి వీసా విషయంలో ట్రంప్ నిర్ణయం పై సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం
హైదరాబాద్ ,ఐఏషియ న్యూస్: హెచ్ 1 బి వీసా విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రంప్ తాజా నిర్ణయం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, భారత్ – అమెరికా దేశాల మధ్య సంబంధాల చరిత్రలో ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.అమెరికా ఆర్థిక వ్యవస్థకు దశాబ్దాలుగా తోడ్పడుతున్న …
Read More »ఇప్పటికే హెచ్1బీ వీసాలు కలిగి ఉన్న వారికి శ్వేతసౌధం తీపికబురు
వాషింగ్టన్ డిసి,ఐఏషియ న్యూస్: కొత్త హెచ్1బీ వీసా దరఖాస్తులకు మాత్రమే వార్షిక రుసుము ఉంటుందన్న శ్వేత సౌధం ప్రకటించింది.కొత్త హెచ్1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్లు రుసుము ఉంటుందని వెల్లడించారు.ఇప్పటికే వీసా ఉన్నవారు లక్ష డాలర్ల రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.కొత్త వీసాదారులకే రుసుము ఉంటుందని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలినా లివిట్ వెల్లడించారు.ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లకు, పునరుద్దరణలకు కొత్త రుసుము వర్తించదని పేర్కొన్నారు.విదేశాల్లో ఉన్న హెచ్1బీ వీసాదారులు వెంటనే అమెరికాకు రావాల్సిన అవసరం లేదన్నారు.హెచ్1బీ వీసాల్లో దాదాపు …
Read More »అర్ధరాత్రి నిండు గర్భిణీని ఆదుకున్న108 సిబ్బంది
టెక్కలి 108 లో గిరిజన మహిళ సుఖప్రసవం టెక్కలి(శ్రీకాకుళం),ఐఏషియ న్యూస్: మందస మండలం బంసుగాం గిరిజన గ్రామానికి చెందిన సవర రుక్మిణి మొదటి కాన్పు పుట్టినొప్పులతో శుక్రవారం ఉదయం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా అక్కడి నుంచి అర్ధరాత్రి టెక్కలి ప్రభుత్వా ఆసుపత్రికి తరలించారు. గర్భిణీ ప్రసవంకి సహకరించక పోవడంతో టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది శ్రీకాకుళం రిమ్స్ కి రిఫర్ చేశారు. టెక్కలి 108 లో రిమ్స్ కి తీసుకువెళ్తుండగా కోటబొమ్మాళి మండలం పాకివలస గ్రామం వద్దకు వచ్చేసరికి పురిటి నొప్పులు ఎక్కువ …
Read More »విశాఖలో ఎయిరిండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు హైదరాబాద్‌కు విమానం బల్దేరింది. కొంత దూరం వెళ్లాక విమానం రెక్కలో పక్షి ఇరుక్కుంది. దీంతో ఇంజిన్ ఫ్యాన్ రెక్కలు దెబ్బతిన్నాయి. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని వెనక్కి తీసుకొచ్చి ల్యాండ్ చేశారు. ఘటన సమయంలో విమానంలో మొత్తం 103 మంది ప్రయాణికులు ఉన్నారు.వీరి కోసం ఎయిరిండియా యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. Authored by: Vaddadi udayakumar
Read More »