న్యూ ఢిల్లీ,ఐఏషియన్ న్యూస్: దేశ రాజకీయాల్లో సోమవారం సంచలన ఘటన చోటుచేసుకుంది. భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్ పర్సన్ జగదీప్ ధన్‌ఖడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉప రాష్ట్రపతి పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సోమవారం తన రాజీనామా లేఖను పంపించారు. అనారోగ్య సమస్యల కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తనకు ఉప రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చిన ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ముకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.కాగా, 2022 ఆగష్టు 11న ఆయన ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అంతకుముందు 1990-1991 వరకు కేంద్రమంత్రిగా, 2019 నుంచి 2022 వరకు బెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు. కిసాన్ పుత్రగా ఆయన దేశ రాజకీయాల్లో గుర్తింపు పొందారు. జనతాదళ్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన గతంలో శాసనసభ, లోక్‌సభ సభ్యుడుగా కూడా పనిచేశారు.
Check Also
విశాఖ పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 68వ రోజు ప్రజాదర్బార్
సమస్యలు విన్నవించేందుకు పార్టీ కార్యాలయానికి తరలివచ్చిన ప్రజలు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వినతులు స్వీకరించిన మంత్రి లోకేష్ విజ్ఞప్తులు …