పోలీసులు రాగానే దుండగులు పరార్ సిబ్బందిపై దుండగులు తుపాకీతో కాల్పులు డిప్యూటీ మేనేజర్ గాయాలు హైదరాబాద్,ఐఏషియ న్యూస్: భాగ్యనగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.హైదరాబాద్ నగరం చందానగర్‌లో మంగళవారం పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. ఖజానా జ్యువెలరీ దుకాణంలో దుండగులు బంగారు ఆభరణాలు దోపిడీకి యత్నించారు. సిబ్బంది వారిని ప్రతిఘటించడంతో వారిపై తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో షోరూమ్ కు చెందిన ఓ వ్యక్తి తీవ్రంగాగాయపడ్డారు. వివరాల్లోకి వెళితేమంగళవారం ఉదయం చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ దుకాణం 11 గంటలకు తెరవడం జరిగింది. ఐదు నిమిషాల్లోనే ఆరుగురు దుండగులు …
Read More »crime
నిజాయితీని నిరూపించుకున్న బాలుడు
గుంటూరు,ఐఏషియ న్యూస్: గుంటూరు పట్టణానికి చెందిన కటికం భారతి అను మహిళ సోమవారం ఉదయం మంగళగిరి పట్టణంలోని ఎయిమ్స్ హాస్పిటల్ కు వచ్చి మంగళగిరి కొత్త బస్టాండ్ దగ్గర తన పర్స్ పోగొట్టుకొని పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన అనంతరం కొద్దిసేపటికి ఆమె పర్సు దొరికింది. ఈ నేపథ్యంలో ఒక బాలుడు నిజాయితీగా ఆ యొక్క పర్సు తీసుకుని వచ్చి మంగళగిరి పట్టణ పోలీసు స్టేషన్ యందు సిఐని కలిసి జరిగిన వాస్తవాలు తెలియపరచగా అందులో ఫిర్యాది కటికం భారతి చెప్పిన విధంగా …
Read More »ఎస్బిఐ బ్యాంకులో భారీ దోపిడీ
38 లక్షల నగదు,10 కేజీల బంగారం చోరీ తూముకుంట(శ్రీ సత్య సాయి జిల్లా),ఐఏషియ న్యూస్: శ్రీసత్యసాయి జిల్లాలోని తూముకుంట పారిశ్రామికవాడలో ఎస్బీఐ బ్యాంకులో ఆదివారం రాత్రి దుండగులు భారీ దోపిడీ చేశారు.కిటికీ కోసి లోనికి వెళ్లి సీసీ కెమెరా వైర్లు కట్ చేసి, లాకర్ తాళాలు విరిచి రూ.38 లక్షలు, 10 కేజీల బంగారం ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం బ్యాంక్ సిబ్బంది బ్యాంకు తెరిచి బ్యాంకులో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించారు. చోరీ సంఘటనపై పోలీసు అధికారులకు ఫిర్యాదు సంఘటనా స్థలాన్ని డిసిపిమహేశ్, ఎస్ …
Read More »బాలాపూర్ లోని ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: బాలాపూర్ లోని ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారు జామున అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం. షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. Authored by: Vaddadi udayakumar
Read More »రిటైర్ కానున్న మిగ్-21 యుద్ధ విమానాలు
న్యూఢిల్లీ,ఐఏషియన్ న్యూస్: భారత వైమానిక దళం నుంచి తొలుగుతున్న మిగ్-21 యుద్ధ విమానాలు సెప్టెంబర్ నుంచి దశల వారీగా కొనసాగుతున్న తొలగింపు ప్రక్రియ.రిటైర్డ్ కానున్న రష్యా తయారీకి చెందిన మిగ్-21 యుద్ధ విమానాల స్క్వాడ్రన్‌లుకొన్ని దశాబ్దాలుగా భారతీయ వైమానిక దళంలో మిగ్-21 కీలక పాత్ర తాజాగా తేజస్ ఎంకే1ఏ యుద్ధ విమానాలను అభివృద్ధి చేసిన భారత వైమానిక దళం.
Read More »ముంబయి రైలు బాంబు పేలుళ్లు కేసులో 12 మందికి విముక్తి
బాంబే హైకోర్ట్ తీర్పు: ప్రాథమిక సాక్షాల లోపం ముంబై,ఐఏషియన్ న్యూస్: బాంబే హైకోర్ట్ 2006 ముంబయి రైలు బాంబు పేలుళ్ల కేసులో జీవిత ఖైదు, మరణ శిక్షలు పొందిన 12 మందిని సోమవారం నిర్దోషులుగా ప్రకటించింది. ట్రయల్ కోర్టు విధించిన శిక్షలను హైకోర్టు రద్దు చేసింది. ఐదుగురికి మోకా కోర్టు విధించిన మరణశిక్షను ధృవీకరించడానికి నిరాకరించగా, ఏడుగురికి విధించిన జీవిత ఖైదును కూడా కొట్టివేసింది.ప్రాసిక్యూషన్ ప్రాథమిక ఆధారాలు సమర్పించడంలో విఫలమైందని, నిందితులను చిత్రహింసలకు గురిచేసి నేరాన్ని ఒప్పించేందుకు బలవంతం చేశారన్న వాదనను హైకోర్టు అంగీకరించింది. …
Read More »రోడ్డు ప్రమాదం మృతుని కుటుంబానికి 1 లక్ష 58 వేల నగదు అందచేత
పీఎంపాలెం ఎస్ఐ భాస్కరరావును అభినందించిన ఏసిపి, సీఐలు మధురవాడ(విశాఖపట్నం),ఐఏషియన్ న్యూస్: పి.ఎం.పాలెం పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు. దీంతో మానవతా దృక్పథంతో పి.ఎం.పాలెం పోలీసుస్టేషన్ ఎస్.ఐ.భాస్కరరావు జరిగిన విషయాన్ని తన వాట్సాప్ లో స్టేటస్ గా పెట్టారు. స్టేటస్ చూసిన ప్రతీ ఒక్కరూ స్పందించి ఎవరికి తోచిన వారు తమవంతుగా నగదు పంపించారు. సోమవారం సాయంత్రానికి 1 లక్ష 58 వేల రూపాయలు సమకూరింది.ఈ మొత్తాన్ని మృతుని కుటుంబసభ్యులకు ఏసీపీ అప్పలరాజు, సి.ఐ.బాలకృష్ణ …
Read More »యువ పోలీస్ అధికారులు టెక్నాలజీ మీద పట్టుసాధించాలి
డీజీపీ హరీష్ కుమార్ గుప్త విజయవాడ,ఐఏషియన్ న్యూస్: యువ పోలీస్ అధికారులు టెక్నాలజీ మీద మరింత పట్టు సాధించాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (హైదరాబాద్)77 ఆర్ ఆర్ బ్యాచ్ కు చెందిన 28 మంది ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారులు స్టడీ, కల్చరల్ టూర్ లో భాగంగా సోమవారం మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర పోలీస్ ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి పోలీస్ …
Read More »సెలవులకని వెళ్లి పైలోకానికి
అమెరికాలో హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం డల్లాస్,ఐఏసియాన్ న్యూస్ ప్రతినిధి: సరదాగా హాలీడేస్ ను ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఆ కుటుంబాన్ని మృత్యువు కబళించింది. సెలవులకు వెళ్లి సజీవ దహనం అయిన షాకింగ్ ఘటన అమెరికాలో జరిగింది. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం ఈ ప్రమాదంలో సజీవ దహనం అయింది. ఆ షాకింగ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.అమెరికాలో హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం సజీవ దహనం అయింది. వెకేషన్ కోసం …
Read More »విశాఖలో భారీగా డ్రగ్స్ స్వాధీనం
విశాఖ క్రైమ్,ఐఏసియన్ న్యూస్: ముందుగా రాబడిన సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల రోడ్ లో డ్రగ్స్ పట్టుకున్న పోలీసులు. సౌత్ ఆఫ్రికా కు చెందిన థామస్ డ్జిమోన్ తో పాటు విశాఖకు చెందిన అక్షయ్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. వీరి వద్ద నుంచి ఒక కార్,3.6 లక్షల నగదు, మూడు సెల్ ఫోన్లు,ఒక డైరీ స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న కొకెయిన్ విలువ 10 నుంచి 15 లక్షలు ఉంటుందని పోలీసులు తెలియజేశారు. నిఘవర్గాలు సమాచారం మేరకు ఈగల్ …
Read More »